ద్వారపూడిలోని ఆదియోగి విగ్రహం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Adiyogi Statue In Andhra Pradesh 10 Facts About the Dwarapudi Adiyogi Statue in Andhra Pradesh 1.ఆదియోగి విగ్రహం 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. భారత దేశంలో ఉన్న అత్యంత ఎత్తైన మహాశివుడి విగ్రహాల్లో (largest statues of Lord Shiva in India) ఇది కూడా ఒకటి. Adiyogi Statue in Andhra Pradesh 2.ఈ విగ్రహం ఆదియోగికి ప్రతిరూపంగా నిలుస్తుంది. అంటే బ్రహ్మండంలో ఆయనే తొలి యోగి. ధ్యానం, యోగాకు ఆయనే ప్రతిరూపం అని చాటి చెబుతుంది.. Adiyogi Statue in Andhra Pradesh 3. ఈ భారీ ఆదియోగి విగ్రహాన్ని 2025 ఫిబ్రవరి 26వ తేదీన పరమ శివుడికి అత్యంత ఇష్టమైన మహా శివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నారు. Adiyogi Statue in Andhra Pradesh 4 ద్వారపూడి అనేది రాజమండ్రి నుంచి 45 నిమిషాల దూరంలో, కాకినాడ నుంచి 90 నిమిషాల దూరంలో ఉంటుంది. సో చాలా మంది ఈ ప్రాంతాల నుంచి ద్వారపూడికి చేరుకోవచ్చు. Adiyogi Statue in Andhra Pradesh 5. ఆదియోగి విగ్రహం అనేది ఏపి శబరిమలగా ప్రసిద్ధి చెందిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ప్రాంగణం ఒక సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతోంది. Adiyogi Statue in Andhra Pradesh 6. ఈ విగ్రహాన్ని అచ్చం కోయంబత్తూలోని ఆదియోగి విగ్రహం లాగే మలిచారు. ఇది భారతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. Adiyogi Statue in Andhra Pradesh 7. ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగిన తరువాత వేలాది మంది పర్యాటకులను తనవైపు ఆకర్షిస్తుంది అని అంచనావేస్తున్నారు. దీనివల్ల స్థానిక పర్యాటకం ఊపందుకుంటుంది. స్తానికులకు ఆర్థికంగా ప్రయోజనం కలగనుంది. Adiyogi Statue in Andhra Pradesh 8. యోగా, ధ్యానాన్ని ప్రమోట్ చేస్తూ తద్వారా ప్రశాంతతను పొందేలా ప్రేరేపిస్తుంది ఆదియోగి విగ్రహం. Adiyogi Statue in Andhra Pradesh 9. ఈ మహా విగ్రహాన్ని స్థానిక కళాకారులు ఎంతో కష్టపడి నిర్మించారు. ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ముడిపదార్థాలను వినియోగించారు. Adiyogi Statue in Andhra Pradesh 10. ఆదియోగి విగ్రహం సమీపంలో కల్చరల్ పార్కు తో యోగా,ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. Adiyogi Statue in Andhra Pradesh