క్రాంపస్ నైట్ | Krampus Night :
ఆస్ట్రియాతో పాటు సెంట్రల్ యూరోప్‌లో డిసెంబర్ 5వ తేదీన క్రాంపస్ నైట్ ఉంటుంది. ఈ రోజున స్థానికులు క్రాంపస్ అనే రెండు కొమ్ములు ఉన్న రాక్షసుడిలా తయారు అవుతారు. అల్లరి చేసే పిల్లలను శిక్షిస్తారు.
Photo Source : Septima7 Blog
కెంటకీ ఫర్ క్రిస్మస్ | Kentucky for christmas
ఇది జపాన్‌లో జరిగే క్రిస్మస్ వేడుక. క్రిస్మస్ సందర్భంగా మిలయన్ల మంది జపనీయులు కేఎఫ్‌సీ ( KFC ) ముందు లైన్లో నిలబడతారు. 1970 లో కేఎఫ్‌సీ ప్రారంభించిన ఒక వాణిజ్య ప్రకటన విజయవంతం అయింది. తరువాత అది ఆచారాం అయింది.
శాంక్టాకాన్ | Sanctacon :
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సోలో ఏటా శాక్టాకాన్ జరుగుతుంది. ఇందులో పాల్గొన్న వారు తమ బట్టలను విప్పేసి వీధుల్లో తిరుగుతారు.
పూపింగ్ లాగ్ | Pooping Log Tradition ( Tio De Nadal )
పూప్ అంటే పెంట లేదా షిట్. ఇంతకన్నా వర్ణించలేను. స్పెయిన్‌లోని కాటలోనా ప్రాంతంలో ఒక పెద్ద దుంగకు ( Wood ) ముఖాన్ని డిజైన్ చేస్తారు. డిసెంబర్ నెల మొత్తం ఆ దుంగకు చాక్‌లెట్లు, టాఫీలు తినిపిస్తారు. క్రిస్మస్ సాయంత్రం మాత్రం పిల్లలు అంతా ఒక దగ్గర మోపై కర్రలతో దాన్ని కొడతారు. తిన్నదంతా వెనక నుంచి తీసేయ్ అనే విధంగా పాటలు పాడుతూ ముఖం మీద కొడితే దుంగ వెనక నుంచి చాక్లెట్స్, గిఫ్టులు పడతాయి. విచిత్రంగా ఉంది కదా...బట్ ఇది వారి ఆచారం. మనకెందుకు అంత విచారం.
Photo : YouTube @polinakova
బెఫానా మంత్రగత్తె | Befana, The witch
ఇటలీలో జనవరి 5వ సాయంత్రం అనేది చాలా పాపులర్. ఈ రోజు బెఫానే అనే మహిళ ఒక కర్రపై కూర్చుని ఎగురుకుంటూ అన్ని ఇళ్లకు వెళ్తుందట. పిల్లలకు నచ్చిన కానుకలు ఇస్తుందట.