Sabarimala Facts షేర్ చేయండి 1.1907-09 లో శబరిమల ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది ( Fire Accident In Sabarimala ) . తరువాత దేవాలయాన్ని మళ్లీ నిర్మించారు. మకరవిళుక్కు సమయంలో వెలిగించిన కర్పూరం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అప్పటి ఆలయాన్ని వెదురుతో నిర్మించడంతో వెంటనే అగ్గిరాజుకుంది.( ప్రతీకాత్మక చిత్రాలు) Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 2.2Camera: OnePlus Nord2 5GIso: 296Orientation: 1 2.శబరిమల ఆలయంలో పూజలు నిర్వహించే పుజారిని మేల్ శాంతి ( Mel Shanti ) అంటారు. ఈయనను ఎంచుకోవడానికి ప్రతీ ఏడాది లాటరీ నిర్వహిస్తారు. దీని కోసం అయ్యప్ప స్వామి ముందు ఒక డబ్బాలో పేర్లు ఉన్న చీటి ఉంచి ఒక బాలుడితో ఒక చీటి తీయిస్తారు. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 1329Orientation: 1 3.శబరిమలైలోనే కాకుండా కేరళలో అయ్యప్ప స్వామికి మరిన్ని ఆలయాలు ఉన్నాయి ( Ayyappa Temples In Kerala ) . కుళుతుపుళలో బాలుడిగా స్వామిని పూజిస్తారు. అలాగే అయ్యప్ప స్వామికి అచ్చన్ కోవిల్ అనే మరో ఆలయం కూడా ఉంది. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 372Orientation: 1 4.శబరిమల వార్షిక ఆదాయం ( Sabarimala Income ) రూ.100 కోట్లు ఉంటుంది. ఆలయానికి సంబంధించిన ఆస్తులను రూ.30 కోట్లకు ఇన్యురెన్స్ చేశారు. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 765Orientation: 1 5.నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఆలయానికి సుమారు రూ.50 నుంచి 70 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రసాదాల అమ్మకం ద్వారా సుమారు రూ.30 కోట్ల ఆదాయం వస్తుంది. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 237Orientation: 1 6. శబరిమల ఆలయం కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో ఉంది ( Where is Sabarimala) . సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో శబరిమల ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం 18 కొండల నడుమ ఉంది. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 407Orientation: 1 7. శబరిమల యాత్ర ( Sabarimala Yatra ) అనేది నవంబర్ నెలలో మొదలై జనవరి నెల వరకు కొనసాగుతుంది. మిగితా సమయంలో ఆలయం మూసి ఉంటుంది. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 2.2Camera: OnePlus Nord2 5GIso: 155Orientation: 1 8. 1935 వరకు శబరిమలై ఆలయం తిరువాంకూరు మహారాజు ఆధీనంలో ఉండగా 1935 లో తిరువాంకూరు దేవస్థానం ఆదీనంలోకి వెళ్లిపోయింది. ( Photo Source : Travancore Devaswom Board ) Facts About Sabarimala Ayyappa Temple Of Kerala 9. శమరిమలకు ప్రతీ సంవత్సరం సుమారు 5 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 162Orientation: 1 10. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే భక్తులు మండల కాలం ( Mandalam ) పాటు దీక్షతో ఉంటూ నియమాలు పాటిస్తారు. శబరిమలకు వచ్చి స్వామి సన్నిధానంలో దర్శనం చేసుకునే వరకు దీక్ష కొనసాగుతుంది. Aperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 814Orientation: 1 11. శబరిమల ఆలయం పైకప్పునకు వేసిన బంగారం పూత తో పాటు, ఆలయ సమీపంలో ఉన్న భవనాలకు, అయ్యప్ప స్వామి ఆభరణాలకు, స్థానిక ఉద్యోగులుకు భీమా చేయించారు. సంవత్సరానికి రూ.14.75 ప్రీమియం కడుతుంది శబరిమల దేవస్థానం.గమనిక : ప్రతీకాత్మక చిత్రాలు Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 238Orientation: 1 12.శబరిమలలో ప్రధాన ఘట్టాల విషయానికి వస్తే నవంబర్ 17వ తేదీన మండల పూజ ( Mandala Pooja ) జరుగుతుంది. తరువాత జనవరి 14వ తేదీన ఇక్కడ మకర విళుక్కు( Makara Vilukku ) జరుగుతుంది.ఈ రోజు మకర జ్యోతిని భక్తులు ( Makara Jyoti ) దర్శించుకుంటారు. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 497Orientation: 1 13. 1980 లో పంబపై ( Pamba )బ్రిడ్జి, లైట్స్, డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్, రెస్ట్ హాల్స్ నిర్మించారు. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 228Orientation: 1 14. బెంగుళూరుకు చెందిన ఒక భక్తుడు ఆలయం గర్బగుడిపై, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయించాడు.దీంతో శబరిమల ఆలయం గోల్డెన్ టెంపుల్‌గా ( Sabarimala golden Temple ) మారింది. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 230Orientation: 1 15. అయ్యప్పస్వామి వారి సన్నిధానం వద్ద 18 మెట్లను పదునెట్టాండి ( Padunettandi ) అంటారు. దీక్ష తీసుకున్న వారే ఈ మెట్లను ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. Facts About Sabarimala Ayyappa Temple Of KeralaAperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 152Orientation: 1 షేర్ చేయండి