Unesco Sites షేర్ చేయండి Sun Temple, Konark : సమస్త జగత్తుకు ప్రాణ శక్తిని ప్రసాదిస్తున్న సూర్యుడికి అంకితం ఈ ఆలయం. ఇక్కడ ఏడు గుర్రాలపై 12 చక్రాలున్న రథంలో సూర్యభగవాణుడు కదిలినట్టు ఉంటుంది ఆలయం. ఈ ఆలయాన్ని 1238 నుంచి 1250 మధ్యలో రాజా నరసింగ దేవ సమయంలో నిర్మించారు. Top UNESCO Heritage Site In India Konark Sun Temple Khajuraho, Madhya Pradesh : ట్రీడితో బిల్డింగులు కట్టేస్తున్న జనరేషన్ ఇది. ఇలాంటి జనరేషన్ కూడా ఖజరహో అందాలను చూసి పరేషాన్ అవుతోంది. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వగుండా రాళ్లతో అద్భుతాలు చేశారు. భారతీయ శిల్పకళకు అత్యున్నత పురస్కారం, అత్యుత్తమ ఉదాహరణే ఇక్కడి నిర్మాణాలు Top UNESCO Heritage Site In India Khajuraho Ellora Caves, Maharastra : కొండలను తొలచి గుహాలయాలుగా మలచి ప్రపంచానికి అద్భుతమైన రాతి శిల్పకళను పరిచయం చేశారు నాటి శిల్పకారులు. ఈ గుహలు హిందూ, బౌద్ధమతం, జైనిజంల భారత్లో ఎలా సమాంతరంగా మనగడ సాగించాయో చాటుతాయి. Top UNESCO Heritage Site In India Ellora Caves, Maharashtra Ajanta Caves, Maharastra : అజంతా గుహలుమహరాష్ట్రలోని జాతి రత్నాలు అని చెప్పవచ్చు. ఇందులో గుట్టలను మలిచి మొత్తం 30 వరకు బౌద్ధ గుహలను మలిచారు. వాటిని తొలచిన విధానం నేటికీ ఒక అద్భుతం అని చెప్పవచ్చు. Top UNESCO Heritage Site In India Ajanta Caves, Maharashtra Taj Mahal, Agra : తాజ్ మహల్ కేవలం యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న పాలరాయి నిర్మాణం మాత్రమే కాదు ఇది ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి. భారత దేశానికి వచ్చే ప్రతీ విదేశీయుడు తాజ్ మహల్ తప్పకుండా చూడాలి అనుకుంటాడు. Top UNESCO Heritage Site In India Taj Mahal Agra Ramappa Temple, Telangana : తెలంగాణ నుంచి యూనెస్కో గుర్తింపు పొందిన ఒకే ఒక ఆలయం రామప్ప దేవాలయం. అద్భుతమైన శిల్పకళకు నిదర్శనమైన రామప్ప తెలుగు జాతికే గర్వకారణం. Top UNESCO Heritage Site In India Ramappa Temple Rani Ki Vav, Gujaraj : యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న ఒక బావి పేరే రాణికి వావ్. ఈ బావి చూస్తే మీరు కూడా వావ్ అంటారు. నీరు జీవితాన్ని ఎంత అందంగా మార్చుతుందో అలాంటి నీరు దొరికే చోటు కూడా అంతే అందంగా ఉండాలన్నట్టు ఈ బావిని అద్భుతంగా మలిచారు Top UNESCO Heritage Site In India Rani Ki Vav, Hampi, Karnataka : కర్ణాటకలోని హంపీలోని శిథిలాలు మిమ్మల్ని 14 శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యానికి తీసుకెళ్తాయి. పురా తత్వశాస్త్ర పరిశోధనా స్థలం అయిన హంపిలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు, రాజభవనాలు ఉన్నాయి Top UNESCO Heritage Site In India Hampi షేర్ చేయండి