12 నెలల్లో చూడాల్సిన 12 ఆసియా దేశాలు

BY MG KISHORE

 జనవరి

సీయేమ్ రీప్,  కాంబోడియా

యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అంగ్‌కోర్ వట్ అనేది అతి పురాతరమైన శ్రీ మహావిష్ణువు ఆలయం.జనవరిలో ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది.దీంతో పాటు ఇక్కడ నైట్ మార్కెట్ మీకు తప్పకుండా నచ్చుతుంది.

. ఫిబ్రవరి

హోయ్ ఆన్, వియత్నాం

మన దేశంలో ఉన్నట్టే వియత్నాంలో కూడా కొత్త సంవత్సరాన్ని రెండు సార్లు సెలబ్రేట్ చేస్తారు.హోన్ అన్ అనే ప్రాంతంలో కొత్త సంవత్సరం సందర్భంగా పూర్తిగా కొత్త వియత్నాంను చూస్తారు మీరు

మార్చి

చియాంగ్ మై , థాయ్‌లాండ్

మార్చి నెలలో సోంగ్‌క్రాన్ వాటర్ ఫెస్టివల్ జరుగుతుంది.ఇది థాయ్‌లో ఉగాది లాంటిది.థాయ్ సంప్రదాయం ప్రకారం ఈ రోజున వారు ఆలయాలకు వెళ్తారు.ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెబుతారు

ఏప్రిల్

బొరాకే, ఫిలిప్పిన్స్

బొరకే అనేది చాలా పాపులర్ బీచ్ డెస్టినేషన్.ఏప్రిల్లో వస్తే అంత పోటీ ఉండదు.చక్కగా బోటు తీసుకుని దగ్గర లోని  ద్వీపాలను చుట్టేయొచ్చు.

మే

కౌలాలంపూర్, మలేషియా

ఇక్కడి ఐకానిక్ పెట్రోనాస్ జంట భవనాలు , స్థానిక బటు గుహలకు వెళ్లవచ్చు. నైట్ లైఫ్ ఇష్టపడే వారు జలాన్ అలోర్ నైట్ మార్కెట్‌ను సందర్శించవచ్చు.

జూన్

తైపీ, తైవాన్

తైపీలోని వైవిధ్య భరితమైన మార్కెట్లు, దీంతో పాటు ఇక్కడ లభించే నాన్‌వెజ్ నూడిల్స్ సూప్ మీరు ట్రై చేయవచ్చు.దీంతో పాటు లోంగ్‌షాన్ ఆలయాన్ని కూడా మీరు సందర్శించవచ్చు.

జూలై

లువాంగ్ ప్రబాంగ్, లావోస్

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతంలో  100 సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఇక్కడి గల్లీల్లో మీకు ఒకవైపు పురాతన బౌద్ధ కట్టడాలు కనిపిస్తే, మరో వైపు ఫ్రెంచు వాళ్ల నివాసాలు కనిపిస్తాయి

ఆగస్టు

హా లాంగ్ బే , వియాత్నం

వియత్నాం లోని హా లాంగ్ బే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకుంది.ఇక్కడి బీచులు ఎంత అందంగా ఉంటాయో అంతే చిన్నగా ఉంటాయి.నీటిలోంచి ఇప్పుడే బయట పడినట్టు ఉండే పచ్చని కొండల అనేవి విచిత్రంగా అందంగా కనిపిస్తాయి.

సెప్టెంబర్

సియోల్ ,దక్షిణ కొరియా

గియాంగ్‌బోక్‌గుంగ్ అనే ప్యాలెస్ సందర్శించవచ్చు.కొరియన్ రాజుల కాలం నాటి ఈ కోట,దాని ప్రాంగణం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.నేటికీ ఈ కోటను సైనికులు పహరా కాస్తారు.ఇక్కడి మియాంగ్ గోండ్ నైట్ మార్కెట్‌ , ట్రెండీగా హోంగ్డే అనే ప్రాంతానికి వెళ్లవచ్చు.

అక్టోబర్

బాలి, ఇండోనేషియా

గియాంగ్‌బోక్‌గుంగ్ అనే ప్యాలెస్ సందర్శించవచ్చు.కొరియన్ రాజుల కాలం నాటి ఈ కోట,దాని ప్రాంగణం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.నేటికీ ఈ కోటను సైనికులు పహరా కాస్తారు.ఇక్కడి మియాంగ్ గోండ్ నైట్ మార్కెట్‌ , ట్రెండీగా హోంగ్డే అనే ప్రాంతానికి వెళ్లవచ్చు.

అక్టోబర్

మకావు, చైనా

ఈ నగరం గేమింగ్ అండ్ టూరిజం విషయంలో బాగా పాపాలర్.ఇక్కడ ఎన్ని కసీనోలు ఉన్నాయి అంటే దీనిని ప్రపంచ గాంబ్లింగ్ రాజధాని అని కూడా పిలుస్తుంటారు.

డిసెంబర్

ఫుకెట్ , థాయ్‌లాండ్

బీయర్ ఉన్నా లేకున్నా చియర్స్ చెప్పే మనుషులు ఫుకెట్‌లో కనిపిస్తారు..ఇక్కడ బోటు తీసుకుని ఫిఫి ఐల్యాండ్‌కు వెళ్లవచ్చు.అక్కడికి వెళ్లి స్కార్కిలింగ్ చేయవచ్చు, పగడపు దిబ్బలను చూడవచ్చు.