సాహసం శ్వాసలా సాగిపోయే ప్రయాణికులకు ఈ ప్రయాణికుడి నమస్కారం. ఇటీవలే నేను ప్రయాణికుడు అనే య్యూట్యూబ్ ఛానెల్‌లో ఒక ట్రెక్కింగ్ వీడియోను షేర్ చేశాను. ఇది ఒక అద్భుతమైన హిమాలయన్ ట్రెక్కింగ్ ( Himalayan Trekking ) . ఇందులో హిమాలయ అందాలు, అక్కడి ఆపదలు, మనుషుల్ని మోయడానికి కంచరగాడిదలు పడే కష్టాలు ఇవన్నీ నేను ఘాంఘరియా నుంచి గోవింద్ ఘాట్ వీడియోలో చూపించాను.ఈ జర్నీలో హైలైట్స్…
ముఖ్యాంశాలు
ఘాంఘరియా ఎక్కడుంది ? | Where Is Ghangharia
ఘాంగిరయా అనేది ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ఉంటుంది.ఇది ట్రెక్కింగ్ చేసే వారికి బేస్ క్యాంప్ లాంటిది. ఇక్కడి నుంచే చాలా మంది హేంకుండ్ సాహిబ్ ( Hemkund Sahib Gurudwara ) , వ్యాలీ ఆఫ్ ప్లవర్స్‌కు వెళ్తుంటారు. ఘాంఘరియా అనేది 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. హేంకుండ్ సాహిబ్ అనేది 15197 అడుగుల ఎత్తులో, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది 11,800 అడుగుల ఎత్తులో ఉంటుంది.
హేంకుండ్ సాహిబ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వారా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ( Valley Of Flowers ) అనేది దేవతలు కూడా చూడటానికి వచ్చే ఒక అందమైన పువ్వుల లోయ. ఈ రెండు ప్రదేశాలను నేను నా వీడియోలో కవర్ చేశాను.
Watch : ఆ లింక్స్ ఇవే Watch
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
ఘాంఘరియా నుంచి డిసెండింగ్ షురూ | Ghangharia To Govindghat Trek
ఘాంఘరియా నుంచి సుమారు ఉదయం 7 గంటలకు మా డిసెండింగ్ ( పర్వత అవరోహణ లేదా దిగడం ) మొదలైంది. ఎత్తైన కొండలను వదిలి వెళ్లాలి అనిపించలేదు. పైగా ఈ కొండ దిగితే మళ్లీ గ్లేషియర్ ( Glacier ) ఎప్పుడు కనిపిస్తుందో అని మరోసారి గ్లేషియర్‌ను కనులారా చూశాను.
ఘాంఘరియా నుంచి మీరు గుర్రం లేదా పల్లకి, లేదా హెలికాప్టర్‌లో గోవింద్ ఘాట్ అనే ప్రాంతానికి చేరుకోవచ్చు.హెలికాప్టర్ చార్జీ వచ్చేసి రూ.3000 వరకు ఉంటుంది. ఒక ఐదు నిమిషాల్లో మీరు 10000 అడుగుల కిందికి వేగంగా చేరుకుంటారు. అయితే నేను ఒక నా టీమ్ మెంబర్స్‌తో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ దిగడానికే ప్రాధాన్యత ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడి గాలి పీల్చుకుంటూ దిగడంతో ఉన్న ఎక్సైట్‌మెంట్ గాలి మోటార్లో ఎక్కి వెళ్లడంలో ఉండదు.
కొండ దారిలో నడిచే పద్దతి | Right Way To Walk In A Trek
హిమాలయాలకు ఎవరైనా వచ్చి ఉంటే వారు ఒక విషయాన్ని గమనించి ఉండాలి. ఇక్కడ గుర్రాలు లేదా కంచర గాడిదలు తిన్నగా ముందుకు వెళ్లవు. అవి ఒక కార్నర్ వరకు వెళ్లి లెఫ్ట్ తీసుకుని అడ్దంగా రోడ్డు దాటుతూ మరో కార్నర్ వెళ్లి అక్కడి నుంచి మళ్లీ రైట్ తీసుకుని మళ్లీ రోడ్డుకు అడ్డంగా మరో వైపు వెళ్లాయి. దీన్నే జిగ్‌జాగ్ ( Zig Zag Walking ) డిసెండింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల శరీరం త్వరగా అలసిపోదు. చాలా మంది ట్రెక్కర్స్ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు.
డా. హరికిషన్‌గారితో కలిసి…| Himalayan Trekking
ఈ ప్రయాణంలోనే కాదు మా టీమ్ మొత్తంలో నేను బాగా కనెక్ట్ అయిన వ్యక్తి డాక్టర్ హరికిషన్ గారు. గుజరాత్‌కు ( Gujarat ) చెందిన ఈయన ఒక వైద్యుడు. వయసు 60వరకు ఉంటుంది. కానీ ఆయన ఫిట్నెస్ చూస్తే అలా అనిపించదు. ఒక కుర్రాడిలా కొండలు ఎక్కాడు దిగాడు. దీనికి కారణం ఏంటి అంటే రోజు 8 నుంచి 10 కిమీ వాకింగ్ చేయడమే అన్నారు. ఆయనతో కలిసి ఎన్నో మంచి విషయాలు డిస్కస్ చేస్తూ కొండ దిగాను. సోలో ట్రావెల్ వ్లాగర్ ( Solo Travel Vlogger ) కష్టాలు అర్థం చేసుకున్న ఆయన నా వీడీయోలు కూడా తీశారు. పెద్దాయన నన్ను గుజరాత్ రమ్మని కూడా ఆహ్వానించారు. గుజరాత్ వెళ్తే ఆయనతో తప్పుకుండా కలుస్తాను. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఏదోకరోజు.
ఖచ్చర్లతో జాగ్రత్త | Tips for Navigating Khachar
మా దారిలో మేము డిసెండింగ్ అవుతున్న సమయంలో మాకు చాలా ఖచ్చర్ ( కంచర గాడిదలు ) ఎదురయ్యాయి. ముందుగా అవి మనవైపు వస్తాయా లేదా మరో వైపు వెళ్తాయా అనేది అర్థం కాదు. ఎందుకంటే అవి జిగ్‌జాగ్‌గా వెళ్తాయి. మరో మార్గంలో వెళ్లవు. దీంతో పాటు భారీ బరువులు, మనుషులను మోస్తాయి కాబట్టి దారి కూడా కొంచెం చిన్నగా మారిపోయి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఇలాంటి సమయంలో మీరు సేఫ్‌గా ఉండాలి అంటే అవి మీ వైపు రాక ముందే మీరు సేఫ్ సైడ్‌కు వెళ్లాలి. అంతే కానీ మీరు లోయ వైపు అస్సలు వెళ్లకూడదు. ఎందుకంటే ఖంగారులో మీరు స్లిప్ అయ్యే అవకాశం ఉంది. లోయలో పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే లోయవైపు కాకుండా కొండవైపు ఉండాలి.
హిమాలయాల నీరు తాగాను | Himalayan Stream Water
ఈ ట్రెక్‌లో నాకు లెక్కలేనన్ని చిన్న పెద్దా జలపాతాలు, ధారలు కనిపించాయి. అక్కడ నేను నేను నీళ్లు తాగడంతో పాటు బాటిల్ కూడా నింపేసుకున్నాను. ఈ నీరు చాలా టేస్టీగా, క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది డైరక్టుగా గ్లేషియర్ నుంచి జారుతుంది.
కొన్ని రోజుల క్రితం అంటార్కిటికా గురించి రాసిన పోస్టులో ప్రపంచంలోనే 70 శాతం మంచి నీరు అక్కడే ఉంది అని, భూమిపై ఉన్న నీరు అనేది మనకు హిమాలయాల్లాంటి మంచు పర్వతాల నుంచే వస్తుంది అని రాశాను కదా…ఈనీరే అది. సో నేను తాగిన హిమాలయన్ నీరు నా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అని ఆశిస్తున్నాను.
ట్రెక్కింగ్‌లో ఎలా రెస్టు తీసుకోవాలి ? | How To Take Rest During Trekking
ట్రెక్కింగ్ అనేది మంచి మంచోళ్ల గాలి తీసేస్తుంది. అందుకే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. అయితే మరీ ఎక్కువ సేపు రెస్ట్ తీసుకుంటే అప్పటి వరకు వేడెక్కిక మీ శరీరం పూర్తిగా చల్లారిపోతుంది. మళ్లీ బాడీలో ఈ హీట్ జనరేట్ అవ్వడానికి మళ్లీ అంతే కష్టపడాల్సి ఉంటుంది. అందుకే మీరు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే 30 సెకన్ల నుంచి 60 సెకన్లు మాత్రమే బ్రేక్ తీసుకోండి. కూర్చోకండి. మీ ట్రెక్కింగ్ పోల్ లేదా ఊతకర్రపై నిలబడే ఒరగండి. ఎలా ? ఇలా!
డిటాచ్ అయ్యే ప్యాంట్ | Detachable Trekking Pant Uses
ఈ ట్రెక్కింగ్‌లో నాకు బాగా నచ్చిన అంశం వచ్చేసి నా ట్రెక్కింగ్ ప్యాంట్. దీనికి మోకాలి భాగంలో ఒక జిప్ ఉంటుంది. ఈ జిప్ ఓపెన్ చేస్తే కింది భాగం సపరేట్ అయిపోతుంది. దీంతో క్షణాల్లో మీ ప్యాంట్ కాస్తా షార్ట్ అయిపోతుంది. దీని వల్ల మీకు సెపరేట్‌గా షార్ట్ తీసుకెళ్లే అవసరం ఉండదు. ఉదయం చలి ఉన్నప్పుడు ఫల్ ప్యాంట్, వేడి పెరిగినప్పుడు షార్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు డెకథ్లాన్ అనే స్టోర్‌లో లభిస్తుంది. లేదంటే మీరు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు
ఖచ్చర్లు, గుర్రాల విషాధ గాథ | Sad Life Of Asses and Horses Of Himalayas
మనిషి స్వార్థానికి సమిధలవుతున్న జీవుల్లో గాడిదలు, గుర్రాలు, కంచర గాడిదలు ముందు వరుసలో ఉంటాయని నా అభిప్రాయం. గణాంకాలు ఏం చెప్పినా సరే ఈ ట్రెక్‌లో అనుభవాంకాలు చెప్పాలి అనుకుంటున్నాను. నడవడానికి బద్ధకించే వాళ్లు, నడవలేని వారు ఎవరైనా సరే కొండలను ఎక్కడానికి గుర్రాలను, ఖచ్చర్‌లను హైర్ చేసుకుంటారు. నిజానికి వాటిని తోలే వ్యక్తికి మనం డబ్బులు ఇస్తున్నాం. వాటిని తోలే వ్యక్తి వాటికి దారిలో దొరికే ఆకులు అలమలు తినిపిస్తాడు.
ఈ రెండు ఆకుల కోసం ఎంత బరువులు మోస్తాయి, ఎన్ని రిస్కులు చేస్తాయో చూస్తే వాటిది ఎంత పెద్ద విషాధ గాథో మనకు అర్థం అవుతుంది.
ఈ ప్రయాణంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా మంది కొత్త స్నేహితులు పరిచయం అయ్యారు. మంచి మాటలు చెప్పే పెద్దవాళ్లు, మంచిగా మాట్లాడితే వినే స్నేహితులు…ఇలా సాఫీగా హ్యాప్పీగా సాగిన నా ట్రెక్ మంచి అనుభవాలతో ముగిసింది.
ప్రయాణాలు అనేవి మనకు కొత్త అనుభవాలు ఇవ్వడానికే ఉంటాయి. కొత్త పాఠాలు నేర్పడానికే ఉంటాయి. అలాంటి కొత్త అనుభవాల కోసం నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. మీరు కూడా మీ ప్రయాణాన్నికొనసాగించండి. అప్పుడప్పుడు ఈ ప్రయాణికుడిని కూడా గుర్తు తెచ్చుకోండి. థ్యాంక్యూ.
మీ ప్రయాణికుడు
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
వీడియోను చూడండి
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి
- Sabarimala Facts : 1902 లో కర్పూరం వల్ల అగ్నికి ఆహూతి అయిన శబరిమల ఆలయం… శమరిమలై ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
- Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
- షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
- Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
- Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts