Srisailam : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు | భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు
మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.