మెక్సికో (Mexico), ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటి. అక్కడ డ్రగ్ మాఫిమా చాలా ఎక్కువ. అత్యంత కరప్ట్ పోలీసులు ఎక్కడైనా ఉన్నారంటే మెక్సికోలోనే (Most Corrupted Police Force) ఉన్నారంటారు.
ముఖ్యాంశాలు
డార్లింగ్ ప్రభాస్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో స్పిరిట్ అనే మూవీ రానుంది అన్న విషయం తెలిసింది. ఈ చిత్రాన్ని మెక్సికోలో (Mexico) షూట్ చేయనున్నట్టు సందీప్ రెడ్డివంగా ప్రకటించాడు. గ్రేట్, చాలా మంచి విషయం ఇది. ఇంటర్నేషనల్ మార్కెట్‌ను క్యాచ్ చేయాలంటే విదేశాల్లో షూట్ చేయాలి కదా అని మీకు అనిపిస్తే…మీ ఆలోచనలకు చిన్న బ్రేక్ వేయండి. ఎందుకంటే అది మెక్సికో….
అత్యంత ప్రమాదకరమైన దేశం | Most Dangerous Country
మెక్సికో, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటి. అక్కడ డ్రగ్ మాఫిమా చాలా ఎక్కువ. అత్యంత కరప్ట్ పోలీసులు ఎక్కడైనా ఉన్నారంటే మెక్సికోలోనే (Most Corrupted Police Force) ఉంటారు.
We are planning to shoot #Spirit in Mexico – @imvangasandeep#Prabhas pic.twitter.com/zHTDhKCML1
— Prabhas Trends (@TrendsPrabhas) March 30, 2025
ఇవన్నీ నాకు ఆకాశ రామన్న వచ్చి చెప్పిన విషయాలు కాదు. మీరు కూడా గూగుల్ చేయండి. నేను చెప్పిన దానికన్నా దారుణమైన విషయాలు మీకు తెలుస్తాయి. ఇలాంటి దేశంలో ఒక సిన్సియర్ అండ్ రుథ్లెస్ పోలిస్ అధికారిగా ప్రభాస్ కనిపించనున్నాడు.
జస్ట్ ఇమాజిక్ పొట్ట నుంచి, వీపు, గుండు, ముఖం, ఈవెన్ కళ్లకు కూడా ట్యాటూ లేసుకునే మెక్సికన్ డ్రగ్ పెడ్లర్స్ అండ్ గ్యాంగ్‌స్టర్స్‌తో ప్రభాస్ (Prabhas) ఫైట్ సీన్ ఉంటే ఎలా ఉంటుంది. దీనికి తోడు ఒక్క గుద్దుతో గుండు గులాజ్జామున్లా కమలిపోయేలా కొట్టే సౌత్ కొరియన్ సూపర్ స్టార్, ఫిస్ట్ ఫైట్ ఛాంపియన్ డాన్ లీ (Don Lee) ఈ మూవీలో నటిస్తున్నాడు అని పుకార్లు వినిపిస్తున్నాయి. మే బీ అతనే మెక్సికన్ కార్టెల్ లీడర్ పాత్రలో కనిపిస్తాడేమో.
కాంగ్ వర్సెస్ గాడ్జిల్జా
మరోసారి, జస్ట్ ఇమాజిన్ బాహుబలి ప్రభాస్, ఒక్క శత్రువుకు రెండు పంచులు ఇవ్వకూడదు ఒక్క గుద్దులోనే నరకానికి పంపించాలి అన్నట్టు ఉండే పాత్రలు చేసే డాన్లీ…ఇద్దరూ తెరపై కనిపిస్తే కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా కన్నా సీవియర్ ఫైట్ ఉంటుంది. తెరలు కలెక్షన్‌ను క్యాచ్ చేసే ఎరలు అవుతాయి.
Timeline filled with #Donlee – #Prabhas Edits!
— MalayalamReview (@MalayalamReview) November 10, 2024
Huge jump in his Instagram followers count after that story – It was a storm of attention that took the digital world by surprise!!!#Salaar2 #Spiritpic.twitter.com/XEnpdochxw
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ- మెక్సికో-రుథ్లెస్ అండ్ సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ అనేవి మాత్రమే అఫీషియల్‌గా తెలిసిన విషయాలు. మిగితా ఎలివేషన్ అంతా నేను కూడా ఇమాజిన్ చేసి రాశాను.
ఒక ఎక్స్‌లో ఒక యూజర్ క్రియేట్ చేసిన ఏఐ వీడియో చూడండి. డాన్లీకి ప్రభాస్ ఆతిథ్యం ఇస్తున్న వీడియో…
#DonLee after #Spirit shoot at #Prabhas Home 😂 pic.twitter.com/rxD8fLaWLX
— サミュエル・ラジ (@TheSamuelRaj) February 17, 2025
మెక్సికో దేశానికి మిలియన్ల మంది ఎందుకు వెళ్తుంటారు ?
ఇక ఎలివేషన్ నుంచి ఇంఫర్మేషన్ దగ్గరికి వద్దాం. మెక్సికో కూడా మిగితా దేశాల్లాగే అందంగా ఉంటుంది. అందులో డౌట్ లేదు. అద్భుతమైన కల్చర్, సూపర్ ల్యాండ్‌స్కేప్, గొప్ప చరిత్ర ఉన్న దేశం అది. కానీ కానీ…ఇవన్నీ కూడా నాణేనికి ఒకవైపు మాత్రమే.
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
ఈ దేశానికి వెళ్లే ముందు పెండింగ్ ఛలాన్లు చెల్లించండి, మొక్కులు చెల్లించుకోండి, ఎవరికైనా ఐలవ్ యూ చెప్పాలంటే చెప్పేయండి, ఇరానీ టీ తాగాలంటే తాగేయండి, మైసూర్ భజ్జీ తినాలంటే తినేయండి అన్నట్టు చాలా మంది చెబుతుంటారు. నిజంగానే ఈ దేశం అంత డేంజరా అంటే అవును అనే చెప్పాలి.

కొన్ని ప్రాంతాలు మినహా మెక్సికో అంత సేఫ్ దేశం కాదు. అయితే ఈ దేశానికి ప్రతీ ఏడాది మిలియన్ల మంది పర్యాటకులు ఎందుకు వెళ్తున్నారు ? వారికి ఏం అవ్వడం లేదు అనేది మీ ప్రశ్న అయితే…ముందే చెప్పాను కదా కొన్ని ప్రాంతాలు మినహా అని…
దారుణమై నేరాలు : అమెరికాస్‌లో (Americas) అత్యధిక హత్యలు జరిగే దేశాల్లో మెక్సికో కూడా ఒకటి. ఒక్క 2023 లోనే ఇక్కడ 35,000 మర్డర్లు జరిగాయి. ఇక్కడ డ్రగ్ కార్టెల్ చేసే హింసకు హద్దు లేదు. టూలుమ్, కాంకన్ (Cancus) అనే ప్రాంతాల్లో జరిగిన కాల్పుల వల్ల చాలా మంది మెక్సికోకు వెళ్లేందుకు బయపడుతున్నారు.
టార్గెట్ స్కామ్స్ : అంతర్జాతీయ ప్రయాణికులు సందర్శించే ప్రాంతాలు స్కామర్స్‌కు అడ్డాలుగా మారుతుంటాయి. ఎన్నో పెద్ద పెద్ద రిసార్టులు, పాపులర్ ప్రాంతాల్లో కూడా కూడా దొంగతనాలు, మోసాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది టూరిస్టులు, పెద్ద పెద్ద హోటల్లలో ఉండటం కన్నా స్థానికంగా ఉండే నివాస ప్రాంతాల్లో ఉండటం సేఫ్ అనుకుంటారు.
కిడ్నాపింగ్ రిస్కు: మెక్సికోలో ఆర్గనైజ్డ్ క్రైమ్ శాతం చాలా ఎక్కువ. గుంపులుగా వచ్చి కిడ్నాపింగ్, కార్ జాకింగ్ ( గన్ను చూపించి కార్ ఎత్తుకెళ్లడం) వంటివి కొన్ని ప్రాంతాల్లో చాలా సాధారణం. అత్యధిక హింస జరిగే కొన్ని రాష్ట్రాలకు వెళ్లకుండా అమెరికా తమ పౌరులకు హెచ్చిరికలు జారీ చేసింది.
ఈ ప్రాంతాలకు వెళ్లకండి | Places To Avoid In Mexico
మెక్సికోలో కొన్ని ప్రాంతాలకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మరికొన్ని ప్రాంతాలకు వెళ్లడం గురించి అసలు ఆలోచించకండి. ఈ ప్రాంతాలకు అస్సలు వెళ్లకూడదు…అవి:
- టమౌలిపాస్ (Tamaulipas) : ఇది అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రం. మరీ ముఖ్యంగా రీనోసా ( Reynosa), న్యువో లారేడో (Neuvo Laredo) అనే ప్రాంతాలు ప్రయాణించకూడని (Do Not Travel) జోన్లో ఉన్నాయి. ఇక్కడ తరచూ డ్రగ్ కార్టెల్స్‌కు చెంది మెంబర్స్ హింసకు దిగుతుంటారు. కిడ్నాపింగ్ వంటివి చేస్తుంటారు.
- ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది.
- గ్యురెరో (Guerrero) : ఈ రాష్ట్రం మొత్తాన్ని ప్రమాదకరమైన రాష్ట్రంగా చెబుతుంటారు.మరీ ముఖ్యంగా ఎకాపుల్కో (Acapulco) లో పర్యాటకులు ఉన్న ప్రాంతంలోనే అత్యధిక నేరాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ జిహుతనేజో (Zihuatanejo) అనే పట్టణమే ఈ రాష్ట్రంలో కాస్త సేఫ్ అని అంటారు. అది కూడా మీరు విమానంలో వెళ్తేనే సేఫ్ అంటారు.
- సినాలోవా (Sinaloa): ఇక్కడ డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా కులియాకాన్ (Culiacan) అనే నగరలో క్రైమ్ చాలా ఎక్కువ. అత్యవసరం అయితే తప్పా ఇక్కడికి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు.
- మిచోవాకన్ (Michoacan) : ఈ రాష్ట్రంలో గ్యాంగ్ వార్, డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ మోరీలా (Morelia) అనే ప్రాంతం కొంచెం సేఫ్ అంటారు. కానీ ఇక్కడ కూడా జాగ్రత్గగా ఉండాల్సిందే.
- కోలిమా (Colima) : తీవ్ర నేరాలతో పాటు కిడ్నాపింగ్‌లు ఎక్కువగా జరిగే ఈ ప్రాంతం మెక్సికోలో డునాట్ ట్రావెల్ జాబితాలో ఉంది. ఇక్కడికి ఎట్టిపరిస్థితిలో వెళ్లకూడదు.
- చిహూవాహువా (Chihuahua) : ఈ రాష్ట్రంలోని చిహువాహువా సిటీ కాస్త సేఫ్ అంటారు. కానీ మిగితా ప్రాంతాలు ప్రమాదకరం అంటారు.
- బజా కాలిఫోర్నియా (Baja California) : దీనిని తిజువానా (Tijuana) అని కూడా పిలుస్తారు. ఇక్కడ టూరిస్టులపై అత్యధిక నేరాలు జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో క్రైమ్ రేటు మరీ ఎక్కువగా ఉంటుంది అంటారు. అ ప్రాంతాలేంటో కనుక్కుని అక్కడికి వెళ్లకుండా చూసుకోవాలి.
- జాలిస్కో (Jalisco) : మిచోహాకన్ (Michoacan) సరిహద్దు ప్రాంతాల్లో 50 కిమీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో వివిధ గ్యాంగ్‌ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా గ్వాడలజరా (Guadalajara) ప్రాంతాల్లో పర్యాటకులపై నేరాలు జరిగే అవకాశం ఎక్కువ.
మెక్సికో గురించి విని చాలా మంది ఇంత డేంజరస్ దేశం నిజంగా అలాగే ఉంటుందా అని చూడటానికి వెళ్తుంటారు. మరి నిజంగా మెక్సికో అంత డేంజరస్ దేశమా అనేది ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు.
ఈ వీడియోలో టిమ్మి కార్టర్ అనే ట్రావెల్ వ్లాగర్ (Travel Vlogger) మెుక్సికోలో కార్టెల్స్ మధ్య వార్ జోన్ అయిన కాంకన్ (Cancun) అనే ప్రాంతానికి వెళ్తాడు. అంత ప్రమాదకరమైన ప్రాంతంలో ప్రజలతో అతను మాట్లాడుతాడు. మెక్సికోలో ఈ ప్రాంతం పగలు సేఫ్ రాత్రి డేంజర్ అని అతడికి కూడా అర్థం అవుతుంది.
మెక్సికన్ టూరిజం | Tourism In Mexico
మెక్సికో దేశంలో ప్రస్తుతం టూరిజం శాఖ లేదు. ఈ శాఖకు పెట్టాల్సిన డబ్బును ఇతర పనులకు డైవర్డ్ చేయడంతో టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అనేవి జరగడం లేదు. దీంతో అక్కడికి వెళ్లేందుకు టూరిస్టులు అంతగా ఇష్టపడరు. పర్యాటక రంగం కూడా తీవ్రంగా ప్రభావితం అయింది.
పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రాంతాల్లో సెక్యూరిటీ బానే ఉంటుంది అని అక్కడి అధికారులు అంటారు. అయితే అదే ప్రాంతాల్లో రెస్టారెంట్స్, హోటల్స్, నైట్‌క్లబ్బుల్లో క్షణాల్లో నేరాలు జరిగిపోతుంటాయి.
ఈ విషయాల్లో జాగ్రత్త | Things Not To do In Mexico

- మెక్సిలో ఉన్నప్పుడు అనవసరంగా రాత్రి సమయంలో బయటికి వెళ్లడం చేయకూడదని అనేక దేశాలు తమ ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే రాత్రి సమయంలో హైవేలు, సరిహద్దు ప్రాంతాల్లో అత్యధిక నేరాలు జరుగుతుంటాయట.
- దర్పం వద్దు : మెక్సికో వెళ్లినప్పుడు వీలైనంత సాధారణంగా, సింపుల్‌గా ఉండేలా ప్రయత్నించడండి. కాస్ట్లీ బట్టలు వేసుకుని, ఖరీదైన వాచులు ధరించి జిగేల్ జిగేల్ మని వెళ్లే పర్యాటకులను సులభంతా గ్యాంగ్స్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది.
- అధికారులు సూచనలు : గురెరో, మిచోవాకన్ వంటి ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లే సమయంలో అధికారుల సూచనలు పాటించాాలి. ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ రేట్ చాలా ఎక్కువ.
- నల్లా నీళ్లు తాగకండి: మెక్సికో నల్లా నీళ్ల గురించి ఎన్నో వ్లాగ్స్‌లో చూశాను. వాటిని బట్టి ఈ నీరు అంత సేఫ్ కాదట. వీలైనంత వరకు బాటిల్స్ కొని తాగమంటారు.
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 నగరాల్లో 7 నగరాల వరకు మెక్సికోలోనే ఉంటాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ దేశం ఎంత డేంజరో. దీంతో పాటు సిరియా (Syria) తరువాత అత్యంత ప్రమాదకరమైన రెండో దేశం మెక్సికో.
మెక్సికో దేశం గురించి నేను చెప్పిన విషయాలతో పాటు ఉమా తెలుగు ట్రావెలర్ చెప్పిన విషయాలు కూడా తెలుసుకుని ఒక నిర్ణయం తీసుకోండి.
అందమైంది…కానీ ప్రమాదకరమైనది
నిజానికి ఈ దేశం చాలా అందమైంది. ఇక్కడి ప్రజలు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫుడ్ బాగుంటుంది. కానీ ఇక్కడ డ్రగ్ కార్టెల్స్, గ్యాంగ్ వార్స్ వంటి విషయాల వల్ల చాలా మంది ఈ దేశానికి వెళ్లడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. మీరు కూడా మెక్సికో వెళ్లాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.