Jungfraujoch : యూరప్‌లో హయ్యెస్ట్ రైల్వే స్టేషన్
Jungfraujoch : భూమి మీద నుంచి ఆకాశాన్ని హత్తుకునే దూరంలో మంచు కొండల మధ్యలో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎండాకాలంలో చల్లని గాలి పలకరిస్తే, ఆ అనుభవం మాటలకు అందదు. స్విస్ ఆల్ఫ్స్‌లోని యుంగ్ఫ్రౌయోఖ్కి వెళ్లే ప్రయాణం ఒక తలపు తెరిచి కొత్త లోకంలోకి వెళ్లినటట్టు అనిపిస్తుంది.
స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లేకన్ (Interlaken) దగ్గర మొదలై, పచ్చని కొండల మధ్య నుంచి మెల్లిగా మంచు మెరుపుల వైపు వెళ్లే ఈ జర్నీ గుండెను తడిమి వెళ్తుంది.
ముఖ్యాంశాలు
సందర్శనీయ ప్రదేశాలు | Places To Visit
ఐగర్ గ్లేషియర్ | Eiger Glacier
ఐగర్ గ్లేషియర్ నుంచి మొదలై స్పింక్స్ అబ్జర్వేటరీ (Sphinx Observatory) దాకా వెళ్లే ప్రతీ అడుగు ఒక కొత్త పరిశోధనలా ఉంటుంది.
ఐస్ ప్యాలెస్‌లోని టన్నెల్స్‌లో నడుస్తుంటే మనం ఒక డ్రీమ్ వరల్డ్‌లో ఉన్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ ఐస్‌తో చేసిన కళాఖండాలు చూస్తుంటే మనిషి, ప్రకృతి కలిస్తే వచ్చే అద్భుతం అర్థం అవుతుంది.
ఆసక్తికరమైన విషయాలు | Quick Facts
యుంగ్ఫ్రౌయోఖ్ అనేది సముద్ర మట్టానికి 3,454 మీటర్ల హైట్‌లో ఉంటుంది.
యూరోప్‌లోని హయ్యెస్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంటుంది.
ఆలెష్ గ్లేషియర్ అనేది యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.
లిండ్ట్ చాకొలేట్ హెవెన్ అనే వరల్డ్‌లోని హయ్యస్ట్ చాకొలెట్ షాప్ ఇక్కడే ఉంది.
ఐస్ ప్యాలెస్‌లో అనుభవాలు | Ice Palace
గ్లేషియర్ లోపల తవ్విన ఈ టన్నెల్స్‌లో బ్లూ రంగు మెరుపులు మన కళ్ల ముందు ఒక మేజిక్‌లా కదులుతూ ఉంటాయి.
ఇక్కడ గద్దలు, ఎలుగుబంటులు రూపంలో చేసిన మంచు శిలలు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. మార్నింగ్ సమయంలో ఈ ఐస్ ప్యాలెస్‌కి వెళ్లడం బెటర్. ఎందుకంటే ఈ సమయంలో క్రౌడ్ తక్కువగా ఉంటాయి. ఆ ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.
ఎలా వెళ్లాలి ? | How To Reach ?
ప్రయాణం స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లేకన్ నుంచి మొదలవుతుంది అక్కడి నుంచి గ్రైండెల్వాల్డ్ టర్మినల్ (Grindelwald Terminal) రీచర్ అయ్యి, అక్కడి నుండి ఐగర్ ఎక్స్‌ప్రెస్ కేబుల్ కార్ ఎక్కితే గంటలోనే పీక్స్ వరకు వెళ్లిపోవచ్చు.
ట్రైన్లో వెళ్లేప్పుడు విండో సీట్ దగ్గర ఉంటే నేచర్‌లో వచ్చే వ్యూస్‌ని కెమెరాలో బంధించవచ్చు.
ఎక్కడ ఉండాలి ? | Places To Stay
ఇంటర్లేకన్ లేదా గ్రైండెల్వాల్డ్ విలేజెస్లోని ట్రెడిషనల్ స్విస్ చాలెటట్స్ ఉంటే ప్రతీ ఉదయం మంచు కొండలు పలకరిస్తాయి.
వుడెన్ వాల్కనీస్ నుంచి కనిపించే వ్యూ, రాత్రి పూట మెరిసే నక్షత్రాలు మనకు మర్చిపోలేని మెమోరీస్‌ని ఇస్తాయి.
ఇక్కడ హోటల్స్‌లో ఉంటే నేచర్‌కి ఇంకా దగ్గరగా ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది.
ఏం చూడాలి ? | What To See
స్పింక్స్ అబ్జర్వేటరీ నుంచి ఆలెష్ గ్లేషియర్ (ఆలెష్ గ్లేషియర్) ని చూడటం ఒక మస్ట్ సీ ఎక్స్‌పీరియెన్స్ అవుతుంది. యూరోప్‌లోని పెద్ద గ్లేషియర్‌లో ఇది ఒక వైట్ రివర్‌లా పర్వతాల మధ్యలో నుంచి వెళ్లడం చూస్తే అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది.
మధ్యాహ్నం సమయంలో గ్లేషియర్‌పై సూర్య కిరణాలు ఒక కొత్త రంగును పరిచయం చేస్తాయి. అది చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.
- ఇది కూడా చదవండి :ప్రపంచ వింతలకు తక్కువ కాని 8 ప్రదేశాలు…చూస్తే వారెవ్వా అనాల్సిందే !
ఏం తినాలి ? | Food To Eat
ఇక్కడ చాకొలెట్ షాప్‌లో దొరికే ఫ్రెష్ స్విస్ ఛాకోలేట్స్ ఒక స్పెషల్ టేస్టుని ఇస్తాయి.
చల్లగా ఉన్న పీక్స్ మధ్యలో వేడిగా ఉండే స్విస్ ఛీజ్ లేదా ట్రెడిషనల్ సూప్ తింటూ ఉంటే ఆ టేస్ట్ గుర్తుండి పోతుంది.
లిండ్ట్ చాకొలేట్ హెవెన్‌లో (Lindt Chocolate) దొరికే హాట్ చాకొలేట్ ఆ కోల్డ్ వెదర్లో ఒక వేడిని, ఎనర్జీని ఇస్తుంది.
యాక్టివిటీస్ | 5 Things To Do
స్నో ఫన్ పార్క్‌లో మంచు మీద మెల్లిగా నడవడం ఒక గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది. ఐస్ ప్యాలెస్‌లోని టన్నెల్స్‌లో ఫోటోస్ తీసుకోవడం ఎవర్ గ్రీన్ మెమోరీగా మిగిలిపోతుంది. ఆల్పైన్ సెన్సేషన్ కారిడార్‌లో యుంగ్ఫ్రౌయోఖ్ హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు.
యూరోప్‌లోని హయ్యెస్ట్ పోస్ట్ ఆఫిస్ నుంచి ఒక పోస్ట్ కార్డు పంపడం మర్చిపోలేని ఙ్ఞాపకంగా మిగిలిపోతుంది. స్పింక్స్ డెక్‌పై నుంచి చుట్టూ ఉన్న పీక్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ప్రశాంతంగా కూర్చోవచ్చు.
ప్రయాణికుడు టిప్స్ : సమ్మర్లో ట్రిప్ ప్లాన్ చేస్తే సన్‌గ్లాసెస్ మర్చిపోకండి. స్నో రిఫ్లెక్షన్ కంటి చూపుపై ప్రభావం చూపిస్తుంది.
– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు.కామ్
Photo Source: Jungfraujoch Tourism / Prayanikudu.com
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.
- మరిన్ని మీడియా పబ్లిషింగ్ రికార్డుల కోసం క్లిక్ చేయండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
