Bharat Parv 2026 : ఏక్తానగర్ లో మినీ ఇండియా! 182 మీటర్ల విగ్రహం దగ్గర అద్భుతం
Bharat Parv 2026 ఏక్తానగర్ లోని ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరుగుతున్న అద్భుతమైన ఉత్సవం. ఒకే చోట యావత్ భారతాన్ని చూపించే సంస్కృతి, చేతిపనులు, జానపద నృత్యాల సమాహారం. పూర్తి వివరాలు ఇక్కడ.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారత్ పర్వ్ 2026 ఘనంగా జరుగుతోంది. 182 మీటర్ల ఎత్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కింద నిలబడితే మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. ఈ విగ్రహం కేవలం ఒక కట్టడం కాదు, భారతదేశ ఐక్యతకు ప్రతీక.
సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేసిన ప్రదేశంలోనే ఇప్పుడు యావత్ భారతాన్ని ఒకే చోట చూపిస్తున్నారు. నవంబర్ 1 నుండి 15 వరకు జరిగే ఈ ఉత్సవంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల సంస్కృతి కనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Tawang Travel Guide : హిమాలయాల మధ్య ధ్యానం లాంటి ప్రదేశం తవాంగ్
భారత్ పర్వ్ లోకి అడుగుపెడితే రాజస్థాన్, సిక్కిం, ఒడిశా, తమిళనాడు, అస్సాం ప్రతి రాష్ట్రం స్టాల్స్ తో ఒక ప్రపంచాన్ని సృష్టించాయి. ఒక పక్క రంగురంగుల జానపద నృత్యాలు, గర్బా, భాంగ్రా నృత్యాలతో సందడిగా ఉంటుంది. మరో పక్క చేతితో చేసిన బొమ్మలు, మాస్కులు, పెయింటింగ్స్, పట్టు చీరలు, మట్టి కుండలు కనువిందు చేస్తాయి.
ఇక్కడ ప్రతి వస్తువు వెనుక ఒక కథ ఉంది, ప్రతి కళ వెనుక ఒక చరిత్ర ఉంది. దేశం మొత్తాన్ని 2 రోజుల్లో చూడాలనుకునే వారికి ఏక్తానగర్ బెస్ట్ డెస్టినేషన్. స్టాట్యూ ఆఫ్ యూనిటీతో పాటు భారత్ పర్వ్ ను తప్పక చూడండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
