నది మధ్యలో దాగున్న నారదుడి ఏకైక ఆలయం | Narad Mandir Boat Ride
Narad Mandir Boat Ride : పండరీపురంలో ఎన్నో ఆలయాలు చూశాను కానీ, నాకు అన్నింటికంటే భిన్నంగా అనిపించింది నారద మందిరం.
శ్రీ మహా విష్ణు పాదం ఆలయం నుంచి చూస్తే నది మధ్యలో మునిగి ఉన్న ఒక ఆలయం కనిపిస్తుంది చూడండి, అది నారదుడి ఆలయం. నారదుడిని దర్శించుకోవడానికి మనం బోటులో వెళ్లాల్సి ఉంటుంది.
అవును, చంద్రభాగా నది మధ్యలో ఉండే ఈ ఆలయం సంవత్సరంలో దాదాపు మూడు నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది. వర్షాకాలంలో దర్శనం కుదరదు. మిగతా కాలంలో మాత్రమే బోటులో వెళ్లి దర్శించుకోవచ్చు. ఒక్కొక్కరికి 50 నుంచి 100 రూపాయల వరకు బోటు కోసం తీసుకుంటారు. నది మధ్యలో నుంచి పండరీపురం ఘాట్, విఠోబా ఆలయం కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది.
ఇక్కడే నారద మహర్షి తపస్సు చేశాడని, అందుకే విష్ణుపాద ఆలయానికి దగ్గరలోనే ఆయన కొలువై ఉన్నాడని స్థానికులు చెబుతారు. మీరు పండరీపురం వస్తే ఈ ఆలయాన్ని మాత్రం మిస్ అవ్వకండి.
- హైదరాబాద్ నుంచి పండరీపురం ఎలా వెళ్లాలి? | Hyderabad To Pandharpur
హైదరాబాద్ నుంచి పండరీపురం 340 కి.మీ దూరం. విజయవాడ నుంచి 560 కి.మీ.
బస్సు: నాంపల్లి నుంచి TSRTC, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. RTC బస్సు ఛార్జీ రూ.650 నుంచి మొదలవుతుంది. ప్రైవేట్ బస్సులు సీజన్ బట్టి రూ.800 నుంచి రూ.1300 వరకు ఉంటుంది. నైట్ జర్నీ చేస్తే మధ్యలో ధాబా బ్రేక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.
ట్రైన్: లింగంపల్లి / సికింద్రాబాద్ నుంచి సోలాపూర్ వరకు ట్రైన్ ఉంది. సోలాపూర్ నుంచి పండరీపురం 45 కి.మీ మాత్రమే. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేట్ వెహికల్ లో వెళ్లొచ్చు.
లోకల్ లో తిరగడం: పండరీపురంలో 5-6 ప్రదేశాలు చూడటానికి ఆటో బెస్ట్. నేను ఒక ఆటోను రూ.800 కి మాట్లాడుకున్నాను. కైకడి మహారాజ్ మఠం, గజానన మహారాజ్ మఠం, గోపాలకృష్ణ ఆలయం, విష్ణుపాదం, నారద మందిరం, సంత్ తుకారాం మందిరం అన్నీ కవర్ చేశాను.
ఎప్పుడు వెళ్లాలి? – బెస్ట్ టైమ్
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైమ్. చలికాలంలో వాతావరణం చాలా బాగుంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వర్షాకాలంలో భీమా నది స్నానం కోసం జనాలు ఎక్కువ వస్తారు. ఎండాకాలంలో 40 డిగ్రీల ఎండ ఉంటుంది, చాలా ఇబ్బంది.
- ఇది కూడా చదవండి : పండరిపురం ఆలయ దర్శనం కంప్లీట్ గైడ్
ఎక్కడ ఉండాలి? చిట్కాలు
నేను చంద్రభాగా నది ఒడ్డున ఉన్న ISKCON Chandrabhaga Guest House లో ఉన్నాను – రూ.861 కే బుక్ అయింది. ఫ్యామిలీతో వెళ్లేవారికి, ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి ఇది బాగా సెట్ అవుతుంది.
విఠోబా ఆలయంలోకి మొబైల్ అనుమతించరు, బయట లాకర్లు ఉంటాయి. ఇక్కడ స్వామిని తాకి దర్శనం చేసుకోవచ్చు, దీన్నే పాద స్పర్శ దర్శనం అంటారు.
ఈ యాత్రను పూర్తిగా డాక్యుమెంట్ చేసి వీడియోను యూట్యూబ్లో షేర్ చేశాను..వెంటనే చూడండి…
