Japan Traveler : జపాన్ ట్రావెలర్కి ఇండియా నరకం లా అనిపించిందట… కానీ అసలు కథే వేరే ఉంది!
Japan Traveler : జపాన్ ట్రావెలర్ రూ.48,400 తో 30 రోజులు 5000 కిమీ ఇండియా ట్రిప్ చేసి నరకం అని కామెంట్ చేశాడు, బడ్జెట్ పై భారతీయులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.
30 రోజులు.. 5000 కిలోమీటర్లు.. రూ.48 వేల బడ్జెట్.. ఈ లెక్కతో ఇండియా ఎలా అనిపిస్తుంది?
ఒక జపాన్ యువకుడు నెల రోజుల ఇండియా ట్రిప్ తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియా worst hell-like country అని, మళ్లీ ఎప్పటికీ రానని రాశాడు. దీనిపై భారతీయులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
30 రోజుల ప్రయాణం లోపల ఏం జరిగింది
ఈ ట్రావెలర్ తన పోస్ట్ లో పూర్తి వివరాలు పంచుకున్నాడు. 30 రోజుల పాటు ఇండియాలో 5000 కిలోమీటర్లు తిరిగాడు. సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. ఒకసారి కట్ ఫ్రూట్ తిని అనారోగ్యం పాలయ్యాడు. ప్రయాణంలో 3 కిలోల బరువు తగ్గాడు. మూడు సార్లు కోపం వచ్చి భారతీయులపై అరిచానని కూడా ఒప్పుకున్నాడు.
ついに日本に帰国! インドは最悪地獄のような国でした! もうインドなんて二度と行かねーよ!🤣🤣🤣 日数 30日 移動距離 インド国内5000km 使ったお金 インド国内 95000円 航空券 8万円 平均気温 35度 腹を壊した回数 1回(カットフルーツ) キレてインド人を怒鳴った回数 3回 減った体重 3キロ https://t.co/ER2C8ltgQ0
— バックパッカーの山本! (@YAMAMOTOPEN) November 3, 2026
అసలు ఖర్చు ఎంత.. లెక్కలో తేడా ఏంటి
మొదట 95 వేల జపనీస్ యెన్ అంటే సుమారు రూ.56,750 ఖర్చు చేశానని చెప్పాడు. తర్వాత లెక్క సరిచేసుకుని అసలు ఖర్చు 81 వేల యెన్ అంటే సుమారు రూ.48,400 అని క్లారిటీ ఇచ్చాడు. ఫ్లైట్ టికెట్ కోసం విడిగా 80 వేల యెన్ అంటే రూ.47,800 పెట్టాడు. అంటే విమాన ఛార్జీ కలిపినా మొత్తం ట్రిప్ సుమారు లక్ష రూపాయల లోపే.
- ఇది కూడా చదవండి : Japan Travel : జపాన్లో తప్పక చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు ..ఒకసారి వెళ్తే మర్చిపోలేరు!
ఇంటర్నెట్ ఎందుకు స్కూల్ చేసింది
ఈ బడ్జెట్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. 95 వేల యెన్ తో 30 రోజులు ట్రావెల్ చేయడం అంటే సర్వైవల్ ఛాలెంజ్ లాంటిదే అని ఒకరు కామెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్ తో అమెరికా, చైనా, జపాన్ వెళ్లినా కూడా నరకంలానే అనిపిస్తుందని మరొకరు రాశారు. భారతీయ మధ్యతరగతి కుటుంబాలు కూడా నెలకు ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తాయని, రూ.57 వేల బడ్జెట్ అంటే నా ఫోన్ ధర కంటే తక్కువే అంటూ కౌంటర్లు వేశారు.
ఆలోచించాల్సిన పాయింట్
ఈ ట్రావెలర్ తాను ఇండియాలో ఉన్నప్పుడు దాదాపు డబ్బంతా భారతీయులకే ఖర్చు చేశానని కూడా రాశాడు. బడ్జెట్ ట్రావెల్ తప్పు కాదు. కానీ చాలా తక్కువ బడ్జెట్ తో లగ్జరీ అనుభవం ఆశించడం సరికాదు అనేది చాలా మంది వాదన. భారతీయ ఆతిథ్యం, వైవిధ్యం, వాతావరణం అర్థం చేసుకోవాలంటే కొంత ప్లానింగ్, కొంత బడ్జెట్ అవసరం.
మీరే చెప్పండి.. రూ.48 వేలతో 30 రోజులు 5000 కిలోమీటర్లు తిరగడం సాధ్యమేనా? ఇంత తక్కువ బడ్జెట్ లో ట్రావెల్ చేస్తే ఏ దేశమైనా కష్టంగానే అనిపిస్తుందా? కామెంట్ లో మీ అభిప్రాయం పంచుకోండి.
▶️ వీడియో చూడండి : థాయ్లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
