ఉదయం 5.45కే ఎయిర్ పోర్ట్ కి వెళ్లినా ఫ్లైట్ మిస్! కోర్టు షాకింగ్ తీర్పు! | Delhi Flight Missed
Delhi Flight Missed : ఢిల్లీ ఫ్లైట్ మిస్ అయిన కేసులో ప్రయాణికుడికి ₹71,587 పరిహారం. న్యూఢిల్లీ కమిషన్ CCTV ప్రూఫ్ లేదని తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాలు.
ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఒక ప్రయాణికుడికి జరిగిన నిజమైన సంఘటన ఇది. అతను జూన్ 2025లో రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేశాడు. ఉదయం 6.45కి ఫ్లైట్ ఉంది. ఆఫీస్ మీటింగ్ కోసం వెళ్తున్నాడు.
అతను ఉదయం 5.45కే ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోయాడు. గంట ముందే వెళ్లాడు. కానీ చెక్-ఇన్ కౌంటర్ దగ్గర 45 నిమిషాలు ఆలస్యం జరిగింది. సిబ్బంది ఫ్లైట్ ఫుల్ అయ్యింది అని చెప్పి పక్కకు పంపించారని అతను చెప్పాడు. దీంతో ఫ్లైట్ మిస్ అయ్యింది.
- ఇది కూడా చదవండి : Winter Travel Tips : చలికాలంలో ప్రయాణం…ఇలా అవ్వాలి సిద్ధం
మీటింగ్ మిస్ అవ్వకూడదని అదే ఎయిర్ లైన్ లో మళ్ళీ 11,587 రూపాయలు పెట్టి కొత్త టికెట్ కొని వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కూడా ఇబ్బంది వచ్చింది.
ఎయిర్ లైన్ ఏం వాదించింది? ప్రయాణికుడు ఉదయం 6.10కి వచ్చాడు, అందుకే నో-షో అయ్యాడు అని చెప్పింది.
న్యూఢిల్లీ జిల్లా వినియోగదారుల కమిషన్ విచారణలో కీలక ప్రశ్న అడిగింది. CCTV ఫుటేజ్ లేదా సరైన ఆధారం ఉందా అని. ఎయిర్ లైన్ ఎలాంటి ప్రూఫ్ చూపించలేకపోయింది.
అందుకే కమిషన్ ప్రయాణికుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కొత్త టికెట్ 11,587 రీఫండ్, మానసిక వేదనకు 50,000, లీగల్ ఖర్చులకు 10,000 కలిపి మొత్తం 71,587 రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు మనీకంట్రోల్ లో 05-11-2026న వచ్చింది.
ఈ కేసు ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాలి. ఎయిర్ పోర్ట్ కి ముందే వెళ్లడం మన బాధ్యత, సరైన సర్వీస్ ఇవ్వడం ఎయిర్ లైన్ బాధ్యత.
