ఇటీవటే థాయ్‌లాండ్‌లోని పట్టాయా బీచులో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. ఈ ఘటన వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి,ప్రయాణికులపై ( Indians In Thailand) దీని ప్రభావం ఏంటో చూద్దాం.
భారతీయుల్లో ఎక్కువ మంది సందర్శించే దేశాల్లో థాయ్‌లాండ్ ఒకటి. మన దేశం ( India to Thailand ) నుంచి వచ్చే ప్రయాణికుల వల్ల ఆదాయం బాగా వస్తోండటంతో అక్కడి వాళ్లు మనకు బాగా గౌరవం ఇస్తారు. అయితే గౌరవం పోగొట్టుకునే పనులు చేశారు మన వాళ్లు. థాయ్‌లాండ్‌లో పబ్లిక్‌ప్లేస్‌లో టాయిలెట్ చేసి ఇప్పుడు ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారు.
ఇటీవటే థాయ్‌లాండ్‌లోని పట్టాయా బీచులో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. ఈ ఘటన వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి,ప్రయాణికులపై దీని ప్రభావం ఏంటో చూద్దాం.
ముఖ్యాంశాలు
ఏం జరిగింది | Indians Urinated in Thailand
ఈ ఘటన జరగడం దురదృష్ణకరం. పబ్లిక్ ప్లేస్‌ను వాష్‌రూమ్‌గా మార్చకూడదు. అయితే దీనిపై ప్రయాణికులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.
కొంత మంది భారతీయులు పట్టాయా బీచులో ( Pattay ) పబ్లిక్‌గా యూరినేట్ చేశారు. దీంతో స్థానికులతో పాటు తోటి ప్రయాణికులు కూడా గుర్రుమన్నారట. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయులు అంటే విదేశాల్లో ఒక మర్యాద ఉంటుంది. ఇలాంటి పనుల వల్ల ఆ మర్యాద పోతుంది. దీంతో పాటు నలుగురు ఉన్న చోట ఇలాంటి పని చేయడం అనేది డీసెన్సీ అనిపించుకోదు అంటున్నారు నెటిజెన్లు.
- ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఇలాంటి పనులు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అంటున్నారు . నిజానికి బీచ్ అంటే అక్కడ చాలా మంది వచ్చీ వెళ్తుంటారు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఏ ప్రయాణికుడు అయినా ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయడు.
ఈ విషయం సోషల్ మీడియాలో హైలైట్ అవడంతో జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. వాటిని బట్టి గత నెల అంటే జనవరి 16వ తేదీన థాయ్‌లాండ్‌లోని (Thailand ) పట్టాయా బీచుకు సుమారు 6 మంది భారతీయులు వెళ్లారు. వేకువ జామున వారికి ప్రకృతి నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఇంత పొద్దున ఎవరు చూస్తారు అనుకుని అక్కడే పని కానిచ్చారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ ఛండాలాన్ని రికార్డు చేశాడు. దాన్ని ప్రపంచంతో షేర్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.
ఇది కరెక్టు కాదు కదా | How to Behave In Foreign Land
ఈ ఘటనతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ వెళ్లినా స్థానిక పరిస్థితులు, ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించాలి. అదే సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం వచ్చి వెళ్లాం అని ప్రకృతికి ఇలా చెప్పే అవసరం లేదు .
విదేశాల్లో ఉన్నప్పుడు మనం మన దేశానికి ప్రతినిధులుగా ఉంటాము. మనం ఏం చేసినా భారతీయులు ఇలాంటి వారు, అలాంటి వారు అని అక్కడి స్థానికులు, విదేశీయులు ఒక ముద్ర వేసేస్తారు. పైగా థాయ్‌లాండ్ లాంటి దేశాల్లో ( Indians In Thailand ) భారతీయులు తలదించుకునే ఇలాంటి పనులు చేయడం ఏ మాత్రం కరెక్టు కాదు.
నిజంగా అందరూ అలా చేస్తారు అని కూడా అనడం లేదు. కానీ ఒక్క ఘటన వల్ల మిగితా టూరిస్టులపై ప్రభావం చూపిస్తుంది.
పోయేది వ్యక్తి పరువు మాత్రమే కాదు
ట్రావెల్ ( Travel ) అనేది కొత్త ప్రాంతాలకు వెళ్లి అక్కడి వారి నుంచి ఏమైనా మంచి విషయాలు నేర్చుకోవడానినకి చేస్తుంటాం. కానీ మన చెడ్డ లక్షణాలు అక్కడ బయటపెట్డడానికి వెళ్లకూడదు. వివిధ దేశాల మధ్య ఉన్న తేడాలేంటో తెలుసుకోవడానికి వెళ్లాలి కానీ భారతీయుల కన్నా మనం బెస్ట్ అనిపించుకోవడానికి కాదు. పోయేది ఒక వ్యక్తి పరువు మాత్రమే కాదు కదా.
ఈ ఘటన జరగడం దురదృష్ణకరం. పబ్లిక్ ప్లేస్‌ను వాష్‌రూమ్‌గా మార్చకూడదు. అయితే దీనిపై ప్రయాణికులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.