Namaste World : రూ.1,499 కే డొమెస్టిక్ టికెట్స్, Air India బంపర్ సేల్

షేర్ చేయండి

నమస్తే వరల్డ్ ( Namaste World ) అనే పేరుతో బంపర్ సేల్ ప్రకటించింది ఎయిర్ ఇండియా . ఈ అదిరిపోయే సేల్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ,1,499 కే దేశీయ టికెట్లు, తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రమోకోడ్స్, బ్యాంక్ కార్డుపై ఆఫర్లు కూడా ఉన్నాయి.

విమానయాన రంగంలో తనకుంటా ఒక ముద్ర వేసుకోవడానికి ఎయిర్ ఇండియా ఒక కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ వల్ల వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుంది అని ఆశిస్తోంది. దీని కోసం లిమిటెడ్ టైమ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ నమస్తే వరల్డ్‌ను ( Air India Namaste World ) ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది ఎయిర్ ఇండియా.

లిమిటెడ్ టైమ్‌ ఆఫర్ | Namaste World By Air India

025 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వన్ వే దేశీయ ఫ్లైట్ ధరలు వచ్చేసి రూ.1,499 గా నిర్ణయించారు. అదే సమయంలో అంతర్జాతీయంగా రిటర్న్ టికెట్ల ధరలు వచ్చేసి రూ.12,577 గా  ప్రకటించారు. ఈ డిస్కౌంట్ ధరలు ఎకానమీ, ప్రీమీయం ఎకానమీ, బిజినెస్ క్యాటగిరీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి

బుకింగ్, ట్రావెల్ డేట్స్ | Booking and Dates

ఎయిర్ ఇండియా ఈ కొత్త ఆఫర్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్న ప్రయాణికులు ఫివ్రబరి 6వ తేదీ వరకు ఈ ధరల్లో బుకింగ్ చేసుకోవాల్సిందే. ఇక ప్రయాణ తేదీల విషయానికి వస్తే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు మీరు ప్రయాణాలు చేయవచ్చు.

ప్రమో కోడ్ | Air India Flight Promo Code

Air India Offers : ఎయిర్ ఇండియా ప్రకటించిన ఈ ప్రత్యేక డిస్కౌంట్‌ సేల్‌లో మీరు మరిన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు. దీని కోసం మీరు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

  • మీకు జీరోకన్వీనియన్స్ ఫీజు అమలు అవుతుంది.
  • అంతర్జాతీయ విమానా టికెట్లపై రూ.999 వరకు మీరు ఆదా చేసుకోవచ్చు.
  • ఇక దేశీయ విమాన టికెట్లపై మీకు రూ.399 వరకు సేవ్ చేసుకోవచ్చు.
  • బేస్ ఫెయిర్‌పై రూ.1,000 వరకు ఇంస్టాంట్‌గా డిస్కౌంట్‌ కావాలి అనుకుంటే మీరు ఒక ప్రెమో కోడ్ వినియోగించాల్సి వస్తుంది. అది “FLYAI”

ఈ బ్యాంకు కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్స్ | Air India Bank Offers

ఎయిర్ ఇండియా విమాన టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటున్న వినియోగదారులు సాధారణ డిస్కౌంట్స్‌తో పాటు ఎక్స్‌క్లూసీవ్ డిస్కౌంట్స్‌ కూడా పొందవచ్చు. కొన్ని బ్యాంకు వినియోగదారులకు మరింత డిస్కౌంట్ పొందే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ ఇండియా. 

  • ఐసిఐసిఐ
  • యాక్సిస్ బ్యాంక్
  • ఫెడరల్ బ్యాంక్
  • బాబ్‌కార్డ్ ( BOBCARD)

ఈ బ్యాంకుల వినియోగదారులు అదనంగా బిజినెస్ క్లాసులపై రూ.3,000 వరకు, అంతర్జాతీయ టికెట్ల ధరలపై రూ.2,500 వరకు డిస్కౌంట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా మీరు ప్రత్యేక ప్రమోకోడ్ ఎంటర్ చేసి ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు.

పరిమితమైన సీట్స్ | Namaste World

ఎయిర్ ఇండియా ప్రవేశ పెట్టిన ఈ నమస్తే వరల్డ్ ( Namaste World ) ఆఫర్‌ టికెట్లు లభించడం అనేది అందుబాటులో ఉన్న సీట్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఎవరు ముందు వస్తే వారికి ముందు సీట్ల కేటాయింపు ఉంటుంది కాబట్టి ఏమైనా ప్లాన్ ఉంటే వెంటనే బుకింగ్ కోసం ప్రయత్నించండి. ఆ అద్భుతమైన ఆఫర్ల వల్ల లాభాలను పొందండి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!