Cautionary Tale : భారత్‌లో ట్రైన్ ప్రయాణం…ఆసుపత్రిపాలైన అమెరికన్ వ్లాగర్ 

షేర్ చేయండి

ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creator) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.

వారణాసి నుంచి | Cautionary Tale

అమెరికాలోని మిజోరి (Missouri- USA)కి చెందిన నిక్ మాడోక్ (Nick Maddock) గత ఆరు సంవత్సరాల నుంచి ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. ఇటీవలే భారత్‌కు వచ్చినప్పుడు థర్డ్ క్లాస్ ఏసీలో (indian railways) వారణాసి నుంచి న్యూ జల్‌పైగురి వరకు ట్రైనులో ప్రయాణించాడట. ఈ ప్రయాణం అనేది తన జీవితంలోనే అత్యంత అపరిశుభ్రమైన ప్రయాణంగా తెలిపాడు నిక్. మురికిగా ఉన్న వాష్‌రూమ్‌లు, పరిశుభ్రంగా లేని పరిస్థితుల్లో ఇకపై ఎప్పుడూ జర్నీ చేసేది లేదు అని తెలిపాడు.

మూడు రోజులకే ఆసుపత్రిపాలు…

భారత దేశ యాత్రను పూర్తి చేసుకుని భూటాన్ (Bhutan) వెళ్లాడు నిక్. వెళ్లిన వెంటనే ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా శ్వాస సంబంధిత సమస్య వచ్చిందని , వైద్యులు చికిత్స అందించారని ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ట్రైన్ వాష్‌రూమ్‌లో పరిస్థితి ఎలా ఉందో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిష్ చేశాడు.

నెటిజెన్ల మిశ్రమ స్పందన | Mixed Reactions Online

నిక్ పరిస్థితి చూసి కొంత మంది నెటిజెన్లు అయ్యో పాపం అంటే…మరి కొంత మంది మాత్రం కావాలనే భారత దేశం (Foreigner about India) గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నాడు అని అన్నారు. కొంత మంది ఎగువ తరగతి టికెట్లు బుక్ చేసుకోవాల్సింది అని సూచించగా…నిక్ మాత్రం మురికిగా ఉంటే చెప్పడం తన బాధ్యతగా తనను తాను సపోర్ట్ చేసుకున్నాడు. 

నెటిజెన్లు ఏమన్నారంటే…

Cautionary Tale 4
నువ్వు ఏసీ క్లాసు (AC Class) టికెట్టే బుక్ చేసుకుని ఉండొచ్చు. కానీ నువ్వు సెకండ్‌క్లాస్‌లో ఉన్న వాష్‌రూమ్‌కి వెళ్లి షూటింగ్ ఎందుకు చేశావు ? నీకు చాలా తక్కువ….(photo source : nickmaddockglobal/instagram)
  • మీ అమెరికన్లు మీలాంటి దేశం కాని దేశాల్లోకి వెళ్లినప్పుడు దానిని తట్టుకునే విధంగా మీ రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచుకోవాల్సి ఉంటుంది.
  • నువ్వు ఏసీ క్లాసు (AC Class) టికెట్టే బుక్ చేసుకుని ఉండొచ్చు. కానీ నువ్వు సెకండ్‌క్లాస్‌లో ఉన్న వాష్‌రూమ్‌కి వెళ్లి షూటింగ్ ఎందుకు చేశావు ? నీకు చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి భారత్ గురించి తప్పుగా చెప్పి ఫాలోవర్స్ సంపాదించాలనే స్ట్రాటజీ ఫాలో అయ్యావు.
  • బ్రదర్ నువ్వు మంచి ఆసుపత్రిలో చూపించుకో… కొన్ని హాస్పిటల్స్ ప్రతీ చిన్నదానికి భయపెట్టి డబ్బులు గుంజుతాయి.
  • ఇండియాలో చాలా మంచి ట్రైన్లు ఉన్నాయి…అందులో ఎందుకు ప్రయాణించలేదు ? ….
  • ఇది కూడా చదవండి : “ భారత్ లాంటి దేశం ఎక్కడా లేదు” …5 వారాలు భారత్‌లో గడిపిన Canadian Vlogger అభిప్రాయం

…అని నెటిజెన్లు రియాక్ట్ అయ్యారు. అయితే ఇందులో ఒక యూజర్ అయితే కాస్త లాజికల్ పాయింట్స్ తన కామెంట్స్‌లో ప్రస్తావించారు.

cautionary Tale (2)
” ఒక్క జర్నిలోనే నీకు శ్వాస సంబంధిత సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందా ?” (photo source : nickmaddockglobal/instagram)

“నువ్వు ఏ దేశానికి అయినా వెళ్లి అక్కడి దిగువ శ్రేణి పరిస్థితులను చెక్ చేయ్…దుబాయ్‌కు (Dubai) వెళ్లి అక్కడి లేబర్ క్యాంప్స్ చెక్ చేసి ఒక్క రోజు స్పెండ్ చేస్తే తరువాత ఆసుపత్రికి వెళ్లాల్సిందే. లోకల్ క్లాసులో వెళ్తే మజా వస్తుందని ఎవరు చెప్పారు ? వెళ్లే ముందు సరైనా గైడెన్స్ తీసుకోవాలి కదా ? నచ్చకపోతే 15 గంటలు ప్రయాణించడానికి బదులు నెక్ట్స్ స్టాప్‌లో దిగిపోవచ్చు కదా ? ఒక్క జర్నిలోనే నీకు శ్వాస సంబంధిత సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందా ?” అని మరో యూజర్ స్పందించారు.

గతంలో ఫ్రెంచ్ యూట్యూబర్ విక్టర్ బ్లాహో కూడా భారత దేశంలో ట్రైను ప్రయాణం గురించి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. 46 గంటల పాటు సాగిన తన ప్రయాణంలో ఫ్లోర్‌పై ఎలుకను, బెడ్ పక్కనే బొద్దింకను చూశానని పోస్ట్ చేశాడు విక్టర్…

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!