మిస్టర్ ఎబ్రాడ్ అనే యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ ఇటీవలే హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో (Hyderabad Metro Rail) ప్రయాణించాడు. అత్యాధునిక రవాణా సౌకర్యంపై వ్లాగ్ చేసేందుకు ప్యారడైజ్ స్టేషన్ నుంచి లకిడీకాపూల్ వరకు ప్రయాణించిన ఈ వ్లాగర్ పాజిటీవ్ రియాక్షన్ చూసిన తరువాత మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది.
ముఖ్యాంశాలు
ఫస్ట్ ఇంప్రెషన్ ప్యారడైజ్ స్టేషన్ | Hyderabad Metro Rail
ప్యారడైజ్ స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన మిస్టర్ ఎబ్రాడ్ (Mr Abroad) మెట్రో రైల్వే స్టేషన్‌లో ఉన్న అత్యాధునిక నిర్మాణ సౌకర్యాలు, మెయింటెన్ చేస్తున్న విధానం గురించి మాట్లాడాడు. అచ్చం లండన్‌లో ఉన్నట్టుగా ఉన్న సైన్ బోర్డుల వల్ల సులభంగా వెళ్లాల్సిన చోటుకు వెళ్లగలగలిగాను అని, వేగంగా టికెట్ కౌంటర్లను కనుక్కోగలిగానని అన్నాడు మిస్టర్ ఎబ్రాడ్. ప్యారడైజ్ నుంచి లకిడికాపూల్ వెళ్లేందుకు అతను రూ.35 చెల్లించాడు.
సెక్యూరిటీ | Security In Hyderabad Metro Rail
హైదరాబాాద్ సెక్యూరిటీ కూడా మిస్టర్ ఎబ్రాడ్‌ను ఇంప్రెస్ చేసింది. బ్యాగ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్లు ఇవన్నీ కలిపి ఎయిర్ పోర్టులో (Airport) ఉన్నట్టు సెక్యూరిటి వ్యవస్థ సాలిడ్‌గా ఉందన్నాడు. అయితే సెక్యూరిటీ ఏరియాలో కూడా అతను షూటింగ్ చేస్తుండటం గమనించిన గార్డు అలా చేయవద్దని నవ్వుతూ సూచించడం అతనికి ఇంకా నచ్చింది.

ఇక ప్లాట్‌ఫామ్‌పై చేరుకున్నాక అక్కడి పరిశుభ్రతను చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు. లండన్లో (London) ఉన్న కొన్ని మెట్రో స్టేషన్ల కన్నా ఇక్కడి పరిస్థితి బెటర్‌గా ఉందన్నాడు.
మెట్రో ప్రయాణం | Traveling In Metro Rail
మెట్రో ట్రైన్ ఎక్కిన మిస్టర్ ఎబ్రాడ్ ట్రైన్‌లోపల మంచి స్పేస్ ఉండటం, ఏసి, ఇంగ్లిష్‌లో రూట్ మ్యాప్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉండటాన్ని గమనించాడు. నగర పరిసరాలను గమనిస్తూ తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
స్టేషన్ జంప్
వ్లాగింగ్ గొడవలోపడి తను దిగాలి అనుకున్న లకిడికాపూల్ స్టేషన్‌కు బదులు అసెంబ్లీ (Telangana Assembly) వద్ద ఉన్న స్టేషన్‌కు చేరుకుంటాడు. దీంతో అతను మళ్లీ తను వెళ్లాల్సిన స్టేషన్‌కు ఎలా వెళ్లాలో కనుక్కునేందుకు కాస్త కష్టపడాల్సి వచ్చింది.
- అయితే మిగితా వాళ్లకు ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా మిస్టర్ ఎబ్రాడ్కు మాత్రం ఇది ఒక అవకాశంగా కనిపించింది.
- అందుకే ఆ సమయంలో కూడా మెట్రో స్టేషన్ సిస్టమ్‌ను మరింత లోతుగా ఎక్స్ప్లోర్ చేశాడు.
- ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
హైదరాబాద్ మెట్రో ట్రైన్ గురించి…| Foreigner About Hyderabad Metro Rail
మెట్రో రైళ్లో వచ్చే ఎనౌన్స్‌మెంట్ వినకపోవడం వల్ల ఒక స్టేషన్‌కు బదులు మరో స్టేషన్ చేరుకున్న మిస్టర్ ఎబ్రాడ్ అది తన తప్పే అని గమనించాడు. అందుకే తన తప్పు కరెక్ట్ చేసుకోవడంతో పాటు హైదరాబాద్ మెట్రో ట్రైన్ సిస్టమ్ ఎలా అనిపించిందో అభిప్రాయం తెలిపాడు.
- ముందుగా అతనికి మన మెట్రో రైల్ ప్రయాణం బాగా నచ్చింది.
- ట్రైన్ క్వాలిటీ, స్టేషన్‌లో ప్రయాణికులు సులభంగా వారు వెళ్లాల్సిన ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు చేసిన ఏర్పాట్లు, ధర అందుబాటులో ఉండటం వంటి విషయాలను అతను తన వ్లాగ్‌లో హైలైట్ చేశాడు.
- 40 నిమషాల ప్రయాణానికి కేవలం రూ.35 చార్జ్ చేయడం అనేది చాలా ఇంప్రెసివ్‌గా ఉందన్నాడు. ఇది మెట్రో ట్రైన్ సంస్థ ప్రయాణికులకు అందించే సేవకు, నిబద్ధతకు నిదర్శనం అన్నాడు మిస్టర్ ఎబ్రాడ్.
ఒక ప్రయాణికుడిగా..
హైదరాబాద్ మెట్రో ప్రయాణం అనేది నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలని అనుకునే ప్రయాణికులకు (Traveling) మన్నికైన, వేగవంతమైన, సులభమైన రవాణా వ్యవస్థగా మిస్టర్ ఎబ్రాడ్ చెప్పకనే చెప్పాడు. .
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.