బేగంబజార్ లో భూమిలో నుండి వెలసిన అమ్మవారు – 130 ఏళ్ల భూలక్ష్మీ మాత రహస్యం | Bhulakshmi Mata Temple
Bhulakshmi Mata Temple : నమస్తే, నేను మీ ప్రయాణికుడు కిషోర్. హైదరాబాద్ లో 50 దేవాలయాలను కవర్ చేయాలని మొదలుపెట్టిన నా కొత్త సిరీస్ Hyderabad Temple Rush లో ఇది మొదటి ఎపిసోడ్. మొదటి గుడిగా నేను ఎంచుకుంది నా చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బేగంబజార్ భూలక్ష్మీ మాత ఆలయం.
చిన్నప్పుడు దీపావళి, దసరా పండుగలకు మా అమ్మ నన్ను ఇక్కడికే తీసుకొచ్చేది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీ అందరికీ ఈ గుడిని చూపించడానికి వచ్చాను. ఎప్పుడూ రద్దీగా ఉండే బేగంబజార్ రోడ్డులో ఉన్నా, గుడి లోపలికి అడుగుపెడితే చాలు, మనసు ప్రశాంతంగా అయిపోతుంది.
1. గుడి చరిత్ర – భూమిలో నుండి వెలసిన అమ్మవారు
Sri Bhoo lakshmi Temple History: ఈ గుడి చరిత్ర చాలా మందికి తెలియదు. ఈ గుడి దాదాపు 130 ఏళ్ల నాటిది.
1893 లో నిజాం ప్రభుత్వం ఇక్కడ మూసీ నదిపై ముసల్లం జంగ్ బ్రిడ్జి కడుతున్నప్పుడు, పునాదుల కోసం తవ్వుతుండగా భూమి లోపల నుండి అమ్మవారి విగ్రహం బయటపడిందట. భూమిలో నుండి వచ్చింది కాబట్టే ఈ అమ్మవారిని భూలక్ష్మీ మాత లేదా భూదేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారని అంటారు. నిజాం నవాబే స్వయంగా ఈ గుడిని కట్టించాడని స్థానికులు చెప్తారు. ఆలయ చరిత్రను ఇక్కడి నిర్వాహుకులు నరేష్ వివరించారు. బ్లాగ్ చివరిలో లాంగ్ వీడియోలో చూడండి.
2. ఇక్కడి ప్రత్యేకత ఏంటి? | Bhulakshmi Mata Temple Speciality
బేగంబజార్ అంటే హైదరాబాద్ లోనే అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్. ఇక్కడ వేల మంది వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళలో చాలా మంది ప్రతి రోజూ ఉదయం 5-6 గంటలకే వచ్చి, ముందు అమ్మవారిని దర్శించుకుని, ఆ తర్వాతే తమ షాపులు తెరుస్తారు.
లక్ష్మీదేవి అంటేనే డబ్బుకి, వ్యాపారానికి మూలం. ఇక్కడ హుండీలో డబ్బు వేస్తే వ్యాపారం బాగుంటుందని, ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని ఇక్కడి వ్యాపారస్తులు గట్టిగా నమ్ముతారు. అందుకే హుండీ ఎప్పుడూ నిండుగా ఉంటుంది.
లోపల అమ్మవారు చిన్న రూపంలో ఉన్నా, పెద్ద పెద్ద పూలమాలలతో, చాలా శక్తివంతమైన కళ్ళతో దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారం జరిగే కుంకుమ పూజ చాలా ఫేమస్. వందల మంది మహిళలు వచ్చి పూజ చేయించుకుంటారు.
3. మీకు కావాల్సిన పూర్తి సమాచారం | Bhulakshmi Mata Timings Etc
టైమింగ్స్| Timings: ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 11:30 వరకు నాన్ స్టాప్ గా తెరిచే ఉంటుంది. మధ్యాహ్నం క్లోజ్ చేయరు. ఇది చాలా మందికి తెలియదు. మీరు ఎప్పుడైనా రావచ్చు.
దర్శనం ఫీజు | Darshan Fee: ఎంట్రీ ఫీజు లేదు, స్పెషల్ దర్శనం ఫీజు లేదు. పూర్తిగా ఉచిత దర్శనం. కేవలం 10 నుండి 15 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది.
- ఇది కూడా చదవండి : తెలంగాణలోని ఈ ఆలయానికి వెళ్తే అరుణాచలం వెళ్లినట్టే…| Chinna Arunachalam
ఎలా రావాలి? | How To Come
మెట్రోలో వస్తే: MGBS లేదా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ లో దిగాలి. అక్కడి నుండి నడిచి లేదా ఆటోలో 10 నిమిషాల్లో గుడికి చేరుకోవచ్చు.
బస్సులో వస్తే : బేగంబజార్ X రోడ్ స్టాప్ లో దిగాలి.
బైక్ లేదా కారులో వస్తే: ఇక్కడే చిన్న సమస్య ఉంది. రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి, గుడికి సొంత పార్కింగ్ లేదు. మెయిన్ రోడ్డులోనే ఎక్కడైనా పార్క్ చేసి నడిచి రావాలి.
ప్రయాణికుడి సలహా: బేగంబజార్ వైపు వచ్చినప్పుడు సొంత కారు తీసుకురాకండి. వీలైతే క్యాబ్ లేదా బైక్ టాక్సీ వాడుకోండి. చాలా తేలికగా ఉంటుంది.
4. బోనస్ – ఈ గుడి చుట్టూ నేను చూసిన మరో 6 గుడ్లు
Temples Near By Bhulakshmi Mata Temple Begumbazar
వీడియో షూటింగ్ సమయంలో నేను దగ్గర్లో ఉన్న మరికొన్ని గుడ్లను కూడా చూశాను. మీరు కూడా ఒకే ట్రిప్ లో కవర్ చేయవచ్చు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
1. సంతోషి మాత ఆలయం: భూలక్ష్మీ గుడికి చాలా దగ్గరలోనే ఉంది. నేను వెళ్ళేసరికి తలుపులు మూసి ఉంది. ఇక్కడ ప్రతీ శుక్రవారం ఉద్దాపన అనే ప్రత్యేక పూజ జరుగుతుంది. భక్తులు అన్నదానం కూడా చేస్తారు.
2. ఓంకారేశ్వర్ ఆలయం | Begumbazar Omkareswar Temple: ఇది చాలా మహిమ గల గుడి. ఇక్కడ శివలింగం దగ్గరికి రాత్రిపూట నాగుపాములు నిజంగా వస్తాయని పూజారి గారు చెప్పారు. ఇది 500 ఏళ్లనాటి శివలింగం ఉన్న ఆలయం.
3. రామ పరివారంతో ఉన్న ఆంజనేయుడు: ఓంకారేశ్వర్ గుడి ఆవరణలోనే ఉంది. ఇక్కడ ఆంజనేయుడి విగ్రహం కింద ఉంటే. పై భాగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మతల్లి ఉంటారు. ఇలాంటి విగ్రహం చాలా అరుదు.
- ఇది కూడా చదవండి : పండరిపురం ఆలయ దర్శనం కంప్లీట్ గైడ్
4. దక్షిణ ముఖ ఆంజనేయ ఆలయం: కొద్ది దూరంలోనే ఉంది. దక్షిణం వైపు చూసే ఆంజనేయుడు చాలా పవర్ఫుల్.
5. ఏకముఖి దత్తాత్రేయ ఆలయం: సాధారణంగా దత్తాత్రేయ స్వామికి మూడు ముఖాలు ఉంటాయి కదా… ఒక్క ముఖంతో ఉన్న దత్తాత్రేయుడి విగ్రహం ఇక్కడ ఉంది, ఇది చాలా అరుదైనది.
6. హింగ్లాజ్ దేవి ఆలయం | Hinglaj Temple Hyderabad: ఇది నాకు పెద్ద ఆశ్చర్యం. పాకిస్తాన్ లో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఒకటైన హింగ్లాజ్ మాత ప్రతిమ ఇక్కడ ఉంది.
చూశారు కదా, ఇదీ బేగంబజార్ భూలక్ష్మీ మాత ఆలయం పూర్తి వివరాలు. చిన్నప్పుడు మా అమ్మతో వచ్చిన ఈ గుడికి చాలా కాలం తర్వాత మీ కోసం రావడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్.
మీరు కూడా మీ ఫ్యామిలీతో తప్పకుండా రండి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి.
ఈ బ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్ లో ఉంది.
మీ కోసం ఇక్కడ షేర్ చేస్తున్నాను.
నేను మీ ప్రయాణికుడు కిషోర్, మళ్ళీ Temple Rush Episode 2 లో కలుద్దాం. జై మాతాది.
▶️ వీడియో చూడండి : బేగంబజార్ భూలక్ష్మీ మాత ఆలయం విశేషాలు
