Ramappa Temple : రామప్ప ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు

షేర్ చేయండి

అద్భుతమైన వాస్తు శిల్పకళకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్త్రీయ, జానపద నృత్యాలకు కూడా రామప్ప ఆలయం (Ramappa Temple) చిరునామాగా మారింది. ముస్లిం రాజుల దాడులను తట్టుకుని మరీ నేటికీ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తోంది. ఇటీవలే ప్రపంచ సుందురీమణులు దర్శించుకున్న తెలంగాన శిల్పకళా రాజసానికి, ఆధ్మాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు.

రామప్ప టెక్నాలజీతో అయోధ్య రామాలయం | Sandbox Technology

కాకతీయులు నిర్మించిన (Kakatiya Temples) ఆలయాలన్నీ దాదాపు శాండ్‌బాక్స్‌ టెక్నాలజీతో నిర్మించినవే. అందులో రామప్ప దేవాలయం కూడా ఒకటి ఆలయ పునాదుల్లో 12 నుంచి 15 అడుగుల లోతులో సన్నని ఇసుకను నింపి, దానిపైన రాళ్లతో పునాదులు వేశారు. భూకంపాలు వచ్చినా ఆలయం కుంగకుండా ఉండేందుకే ఈ విధానాన్ని అనుసరించారు.

అందుకే, 800 ఏళ్లలో ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా, ఇసుక షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేసింది. అయితే, ప్రకృతి వైపరీత్యాలు ఆలయాన్ని కొద్దిగా దెబ్బతీశాయి. ఈ టెక్నాలజీతోనే అయోధ్యలోని శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించారు. ఇది నిజంగా తెలుగువారికి గర్వకారణం .

శిల్పి పేరా లేక స్వామి పేరా ?

తెలంగాణలో రెండున్నరవేలకు పైగా ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఆధ్మాత్మిక చరిత్రకు  సాక్షిగా నిలచే ఎన్నో మందిరాలు కేవలం భక్తికి మాత్రమే కాకుండా కళలకు, శిల్పకళ వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. అలాంటి ఒక అద్బుతమైన ఆలయమే ములుగు జిల్లాలోని రామప్ప రుద్రేశ్వర ఆలయం. దీనిని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు.

ramappa Temple History (2)
రామప్ప ఆలయం ముందు ప్రపంచ సుందరీమణులు

ఆలయాన్ని శిల్పకారుడు రామప్ప నిర్మించగా అతని పేరుమీదే ఆలయానికి రామప్ప ఆలయంగా పేరు వచ్చింది అని కొందరంటారు. మరికొంత మంది ప్రధానాలయంలో కొలువై ఉన్నది రామ లింగేశ్వర స్వామి (Rama Lingeshwara Swamy) కాబట్టి ఆయన పేరు మీదుగానే రామప్ప ఆలయం అని పిలుస్తారు అని కొంత మంది అంటారు.

అద్భుతమైన వాస్తు శిల్పాలకు మాత్రమే కాకుండా పేరిణి (Perini Dance Form), కోలాటం వంటి శాస్త్రీయ, జానపద నృత్యాలకు కూడా రామప్ప చిరునామాగా మారింది. ముస్లిం రాజుల దాడులను తట్టుకుని మరీ నేటికీ భక్తులకు దైవ దర్శనం కల్పిస్తోంది.

రామప్ప దేవాలయం ఎక్కడుంది ? | Where Is Ramappa Temple ?

కాకతీయ కళా వైభవానికి ప్రతీక రామప్ప దేవాలయం.  రామప్ప అనేది  దేవాలయాల సమూహం. వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కిలో మీటర్ల దూరంలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ నుంచి కేవలం 70 కిమీ దూరంలో ఉంటుంది కాబట్టి చాలా మంది ముందు వరంగల్ వచ్చి అక్కడి నుంచి ములుగు జిల్లాకు వస్తుంటారు.

రామప్ప ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా నిర్మించాడు. రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని క్రీ.శ 1213 లో  కట్టించాడు అని గుడిలో ఉన్న శాసనం చెబుతుంది. 

అద్భుతమైన శిల్పకళ | Ramappa Sculptures

ramappa Temple History (2)
రామప్ప ఆలయం ముందు మిస్ ఇండియా నందిని గుప్తా

రామప్ప అద్భుతమైన శిల్పకారుడు. అతని శిల్పకల కొన్ని శతాబ్దాలుగా భక్తులను అలరిస్తోండగా ఇటీవలే యూనెస్కో (UNESCO World Heritage Site) గుర్తింపు కూడా వచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రామప్ప ఆలయానికి సరైన రికగ్నిషన్ దొరికింది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రామప్ప ఆలయాన్ని సంరక్షించి పర్యటకాన్ని ప్రోత్సాహిస్తోంది. రామప్ప ఎంత మంచి శిల్పకారుడో వెళ్లి చూస్తేనే అర్థం అవుతుంది. 

 ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.

  1. ఈ ఆలయాన్ని సాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు.ఇసుక పునాదులను ఉపయోగించి ఆలయాన్ని నిర్మించడం కాకతీయుల ప్రత్యేకత. అంటే భూకంపాలు వస్తే ఆలయానికి పూర్తిగా నష్టం జరగదు.ఈ సాంకేతికతతో అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని కూడా నిర్మించారు.
  2. రామప్ప ఆలయ గోపురాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు. అయితే ఢిల్లీ సుల్తానుల (Delhi Sultans) దాడుల్లో ఆ గోపురం ధ్వంసం అయింది. తరువాత కాలంలో భారత పురావస్తు శాఖ పూణె నుంచి తెలికైన ఇటుకలను తెప్పించి పైకప్పును నిర్మించింది. మరిన్ని రిపెయిర్లు  చేసింది. 
  3. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సీఎంగా ఉన్నప్పుడు రామప్ప చెరువులో బోటింగ్, గెస్ట్‌హౌజ్‌లు కట్టించారు..
  4. అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడు మానిక్ ఖాఫుర్ ఈ ఆలయంపై దాడి చేసి ఇక్కడి విగ్రహాలనో ఒక్కో భాగాన్ని తొలగించి, విగ్రహాలను అసంపూర్ణంగా మిగిల్చాడు. 
  5. అయితే మరో ముస్లిం రాజు అంటే నిజాం …వందేళ్ల క్రితం రామప్పను పునరుద్ధరించేందుకు పూనుకున్నాడు. 1914 లో నిజాం రాష్ట్ర పురావస్తు శాఖ . రామప్ప ఆలయాన్ని వేగంగా రినోవేట్ చేసింది.
  6. ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
అయితే ఈ మరమ్మత్తు సమయంలో ఆలయ కళాత్మకత, పురావస్తు విలువలు చాలా మట్టుకు కముమరుగయ్యాయని అంటారు.. 

1944 లో రామప్ప ఆలయంలో పుజారులను నియమించారు. 2013 లో రామప్ప ఆలయాన్ని కట్టి 800 ఏళ్లు పూర్తి అవడంతో రామప్ప ఉత్సవాలు జరిగాయి.

    రామప్పకు ఆ పేరు ఎలా వచ్చింది ? | Ramappa Temple Name

    రామప్ప ఆలయ గర్భగుడిలో రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ ఆ రామలింగేశ్వరుడి పేరుతో ఈ ఆలయానికా పేరు రాలేదు. ఆనాటి పాలకుడైన గణపతిదేవుడి పేరుతోనూ పిలువలేదు. ఇంత అందమైన ఆలయాన్ని కట్టించిన రేచర్ల రుద్రుడి పేరుతోనూ చెప్పుకోలేదు.

    రుద్రుడి తండ్రి కాటయ. ఆయన తన హయాంలో పలు చెరువులు తవ్వించాడని  రామప్ప దేవాలయ శాసనం తర్వాతిదైన గొడిశాల శాసనం (శక సంవత్సరం 1157, క్రీ.శ.1236) ద్వారా తెలుస్తున్నది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రేచర్ల రుద్రుడు తటాకాలు తవ్వించడంతోపాటు రామప్ప ఆలయాన్నీ కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువుకూడా రేచర్ల రుద్రుడు నిర్మించిందే!

    ramappa Temple History (2)
    రామప్ప ఆలయం ముందు మిస్ ఇండియా నందిని గుప్తా

    ఈ ఆలయం పేరు గురించి ప్రముఖ చరిత్రకారుడు అయిన డా||. ధ్యావనపల్లి సత్యనారాయణ తెలంగాణలోని కొత్త విహార స్థలాలు అవనే పుస్తకంలో ఒక యాంగిల్ని పరిచయం చేశారు. ఆయనేం రాశారంటే..

    రాముడు వైష్ణవ మతానికి సంబంధికుడు కాగా, లింగం లేదా శివుడు శైవ మత సంబంధికుడు. ఈ రెండు మతాలను కలిపి రామలింగేశ్వర ఆలయాలయను కట్టించడం అనేది క్రీ.శ 5వ శతాబ్దం నాటి విష్ణుకుండుల కాలం నుంచి వస్తున్న ఆచారం. కాకతీయులు విష్ణుకుండి మాధవర్మను తమ మూల పురుషుడిగా చెప్పారు కాబట్టి ఇప్పటికీ రామప్ప ఆలయం అంతరాళలో విష్ణుకుండుల సాంప్రదాయ శిల్పమైన సప్తమాతృకల శిల్పం కనిపిస్తుంది కాబట్టి….ఈ దేవాలయ మూలాలు విష్ణుకుండుల కాలం నుంచే ఉన్నాయని చెప్పవచ్చు అని తన పుస్తకంలో రాశారు. సో దీన్ని బట్టి ఆయం 1213 లో నిర్మితం అయినా అంతకు ముందే కొన్ని శతాబ్దాల నుంచే ఇక్కడ ఆలయానికి సంబంధించిన మూలాలు ఉన్నయని అర్థం చేసుకోవచ్చు.

    భూకంపాల ఎలా తట్టుకుంటుంది ? 

    కాకతీయులు నిర్మించిన ఆలయాలన్నీ దాదాపు శాండ్‌బాక్స్‌ టెక్నాలజీతో నిర్మించినవే. అందులో రామప్ప దేవాలయం కూడా ఒకటి ఆలయ పునాదుల్లో 12 నుంచి 15 అడుగుల లోతులో సన్నని ఇసుకను నింపి, దానిపైన రాళ్లతో పునాదులు వేశారు. భూకంపాలు వచ్చినా ఆలయం కుంగకుండా ఉండేందుకే ఈ విధానాన్ని అనుసరించారు. అందుకే, 800 ఏళ్లలో ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా, ఇసుక షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేసింది. అయితే, ప్రకృతి వైపరీత్యాలు ఆలయాన్ని కొద్దిగా దెబ్బతీశాయి. ఈ టెక్నాలజీతోనే అయోధ్యలోని శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణం .

    పేరిణి నృత్య శిల్పాలు

    రామప్ప ఆలయంలో ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ప్రతీ శిల్పం వెనక అంతరార్థం, ఒక  పరమార్థం ఉంటుంది. ప్రతీ శిల్పం కూడా ప్రత్యేకమే. ఉదాహరణకు ఆలయంలో ఉన్న పేరిణి నృత్యానికి  సంబంధించిన చిన్నచిన్న శిల్పాలు చరిత్ర గురించి చెప్పకనే  చెబుతాయి. ఆంధప్రదేశ్ స్టేట్ డ్యాన్స్ అయిన కూచిపూడి చరిత్రను చూస్తే దానికి 400 ఏళ్లకన్నా పురాతనమైన చరిత్ర లేదు అని ఆరుద్రగారు తేల్చి చెప్పారు.

    దాని కన్నా పురాతనమైన నాట్యకళ గురించి రామప్ప ఆలయంలో శిల్పాల రూపంలో ఉంది. ఆ నాట్యకళే పేరిణి నృత్యం. కూచిపూడికన్నా అతిపురాతమైన 1213 సంవత్సరాల నాటి నాట్యకళ ఇది. 

    ఇది కూడా చదవండి : Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !

    దీనిని పేరిణి శివతాండవం అంటారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర నృత్యం కూడా ఇదే. పేరిణి అనే పదం ప్రేరణ అనే పదం నుంచి వచ్చింది అంటారు. యుధ్దానికి వెళ్లే సైనికులకు ప్రేరణ అందించేందుకు వారిలో ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ నృత్యంలో భంగిమలు ఉంటాయి.

    సర్వాలంకృత నంది విగ్రహం

    Ramappa Temple
    రామప్ప ఆలయంలో ఉన్న నందీశ్వరుడి విగ్రహం

    రామప్ప ఆలయంలో శిల్పకళ అనేది ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్న విషయం. అయితే ఆలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడిని చూస్తే ఏ క్షణమైన ప్రాణం పోసుకుని (Ramappa Nandi Statue) లంకెలేసుకుని వెళ్లి మహాశివుడి దర్శనానికి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతంది. భక్తులను సమ్మోహనానికి గురి చేసేలా శిల్పి దీనిని మలిచాడు. చక్కగా అలంకరించాడు. 

    ఈ నందికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పెట్టుకుని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్టుగా ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆలయం ముందు ఉన్న నందిని ఏ దిశ నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. సర్వాలంకృతమైన ఈ నంది విగ్రహాన్ని చూస్తే ఎంత చూసినా తనివి తీరని సమ్మోహనం అని కవయిత్రి భారతీ పేర్కొన్నారు.

    వాస్తు శిల్పాల వైభవం

    రామప్ప ఆలయం నక్షత్రాకారంలో ఉంటుంది. మూడు దిక్కులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయ వేదిక ఎత్తే సుమారు 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. అధిష్టానంపై మూడు మీటర్ల వెడల్పుగా ప్రదక్షిణలు చేసే మార్గం ఉంది. కర్ణాటకలోని హోయసన సామ్రాజ్యానికి చెందిన బేలూరు, హళబేడు దేవాలయాల తర్వాత అంతగొప్ప శిల్పకళాసౌందర్యం రుద్రేశ్వరాయంలో ఉంది.

    1.శతాబ్దాలుగా చెక్కుచెదరని ఈ ఆలయాన్ని ఇసుకతో పునాదిని నిర్మించారు.

    2.నల్లని గ్రానైట్‌అంటే చలువరాయశిలలను ప్రత్యేకంగా తెప్పించి ఆలయ రంగ మంటపం కట్టారు.

    3. కఠినమైన రాతిపై శిల్పాలు చెక్కిన తర్వాత అద్దంలాంటి నునుపుదనం వచ్చేంత వరకు చిత్రిక పట్టారు.

    4. ఆలయ కప్పు భారాన్ని మోయడానికి నల్లరాతి గ్రానైట్‌ శిల్పాలను వాడారు

    5. ఆలయ రంగ మంటపంలోని నల్లని స్తంభాలపై పడే వెలుగు పరావర్తనం చెంది గర్భగుడిలోకి ప్రసరించేలా నిర్మించారు.

    తేలే ఇటుకల గోపురం

    కాకతీయ రుద్రేశ్వర ఆలయానికి ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో దేవాలయం గోపురం ఒకటి. దీన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఇవి ఎంత తేలికైనవి అంటే వాటిని నీటిలో వేసినా తేలుతాయట.

    శిలాశాసనం

    ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత గుడి నిర్మాత రేచర్ల రుద్రుడు సంస్కృతంలో 204 పంక్తులతో ఒక శాసనాన్ని వేయించాడు. అది ఎండా వానలకు పాడు అవ్వకుండా ఉండేలా ఒక మండపాన్ని కట్టించాడు. ఒక శాసనాన్ని అందంగా చెక్కించి, మరింత అందంగా మంటపం కట్టించి, మంటపంలో ప్రతిష్ఠించిన వైనం బహుశా ఎక్కడా కనిపించదు.

    ఈ శాసనంలో రుద్రసేనాని వంశానికి సంబంధించిన వివరాలు, అతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి, పరాక్రమాలు, ఆనాటి ఓరుగల్లు పట్టణ వైభవం వివరించారు. ఇదే శాసనంలో ఆలయ నిర్వహణకు పలు గ్రామాలు శాశ్వత దానం ఇచ్చినట్టు ఉంది. శాసనంలో పేర్కొన్న తేదీ క్రీ.శ.1213 మార్చి 31గా తెలుస్తున్నది.

    మహాశిల్పి రామప్ప | Ramappa Temple

    తన శిల్పకళతో ఆ ఆలయం అణువణువునూ అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి అయిన రామప్ప పేరుతో ఈ ఆలయం ఖ్యాతిగడించింది. కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి.

    ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు.

    ప్రపంచ వారసత్వం సంపద | World Heritage Site

    2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా.. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.

    చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, జలపాతాలు క్రీస్తుపూర్వం నుంచి తెలంగాణలో ఎన్నో ఉన్నా.. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. తాజాగా రామప్ప ఆలయానికి ఈ ఖ్యాతి దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    సమాచార మూలం : ఈ కథనం మీకు ఇంత వివరంగా, చక్కగా అందించేందుకు వివిధ పుస్తకాలను, ఆన్‌లైన్‌ కంటెంట్ రీసెర్చ్ చేశాము. రామప్ప పేరు, ఇతర ఆసక్తికరమైన, చారిత్రాక్మక అంశాలలో కొన్నింటిని డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ గారు రాసిన తెలంగాణ కొత్త విహార స్థలాలు అనే పుస్తకం నుంచి సేకరించాము. వారికి ధన్యవాదాలు. 

    📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

    Cover and Feature Photos By : Telangana Tourism Dept.

    షేర్ చేయండి

    Leave a Comment

    error: Content is protected !!