Boycott Azerbaijan Turkey: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తరువాత భారతీయ పర్యాటక రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయులకు బాగా ఇష్టమైన దేశాలైన అజర్‌బైజాన్, టర్కీ దేశాలపై నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ఉగ్రవాదానికి తండ్రిలాంటి పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తున్న ఈ దేశాలకు వెళ్లకుండా బాయ్‌కాట్ చేయమని నినాదాలు చేస్తున్నారు.
ఈ కోపం ఎందుకంటే ? | What Sparked the Outrage?

పహల్గాంలో ఉగ్రవాదుల (Pahalgam Attack) దాడుల్లో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి చేసిన వాళ్లు ఎక్కడున్నా సరే వారికి అక్కడే సమాధి చేస్తామన్న భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది.
ఈ దాడి తరువాత అనేక దేశాలు భారత్‌కు మద్దతు ఇవ్వగా పాక్ జిగ్రి దోస్తు చైనా (China) దానికి అండగా నిలిచింది. ఈ విషయం ముందుగా ఉహించిందే. కానీ ఉగ్రవాద దేశం పాకిస్థాన్‌కు టర్కీ (Turkey), అజర్ బైజాన్ దేశాలు కూడా మద్దతునిచ్చాయి.
- ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
భూమ్మీద ఉన్న 50 ఇస్లామిక్ దేశాల్లో కేవలం 2 ముస్లిమ్ దేశాలు పాక్‌కు మద్దతు ఇచ్చాయి. ఎందుకంటే…
- టర్కీ ఇస్లామిక్ రాజ్యాన్ని మళ్లీ ఏర్పాటు చేసిన దానికి అందులో లీడర్ అవ్వాలని భావిస్తోంది. మళ్లీ ఓట్టోమన్ రాజ్యాన్ని పున: స్థాపించాలని భావిస్తోంది. అందుకే గుడ్డిగా ఉగ్రవాద దేశం అని తెలిసినా కూడా ఇస్లామిక్ దేశం (Islamic Countries) అయిన పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తోంది. మరో ఇస్లామిక్ కష్టాల్లో ఉంటే గుడ్డిగా వారికి అండగా ఉంటాము అన్నట్టుగా తన వార్‌షిప్‌ను పాకిస్తాన్‌కు పంపించింది టర్కీ.
- దీంతో పాటు బర్యక్తార్ టీబీటు (Baryakat TB2) అనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లను కూడా పాకిస్తాన్‌కు అందించింది. దీంతో ఇటీవలే 300-400 డ్రోన్లను భారత్‌వైపు ప్రయోగించింది పాక్. ఉగ్రదేశం- టర్కీ సాయంతో ఇలా చేస్తుంది అని ముందే పసిగట్టిన మన ఆర్మీ వాటిని ఎక్కడికక్కడ పేల్చి వేసింది.
- ఇక అజర్‌బైజాన్ (Azerbaijan) ఎందుకు పాక్‌ను సపోర్ట్ చేస్తోంది అంటే 2020 లో అర్మేనియాతో ఘర్షణల్లో ఉన్న ఈ దేశానికి పాక్ మిలిటరీ సాయం చేసింది. దీంతో ఈ ఫేవర్ రిటర్న్ ఇచ్చే దిశలో అడుగులు ముందుకేస్తోంది బాకు.
“ఇక వెళ్లేది లేదు” | Online Backlash and Industry Response

Boycott Azerbaijan Turkey : టర్కీ, అజర్‌బైజాన్ దేశాల అసలు స్వరూపం తెలుసుకున్న భారతీయలు ఇక ఈ దేశాలకు వెళ్లేది లేదు అని నిర్ణయించారు. సోషల్ మీడియాలో తమ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం #BoycottTurkey అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ (X) లో ట్రెండింగ్ అవుతోంది.
“మాకు వ్యతిరేకంగా నిలబడుతున్న దేశాలకు వెళ్లి వారికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి” అని ప్రశ్నిస్తున్నారు.
Enough is Enough! Blood and Bookings wont flow together. We are suspending all flight and hotel bookings for Turkey, China and Azerbaijan on ixigo.
— Aloke Bajpai (@alokebajpai) May 10, 2025
రంగంలోకి ట్రావెల్ ఏజెన్సీలు | Travel Agencies on Turkey and Azerbaijan
కేవలం వ్యక్తులే కాదు వ్యవస్థలు కూడా ఈ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. భారత్‌లో అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీల్లో ఒకటైన ఈజ్‌మై ట్రిప్ (Ease My Trip) ఈ దేశాలకు వెళ్లకుండా బుకింగ్ చేసుకోవద్దని ప్రయాణికులను సూచిస్తోంది. దీంతో పాటు పిక్‌యువర్ ట్రెయిల్, గోవా విల్లాస్ కూడా ఈ దేశాలకు బుకింగ్స్‌ను నిలిపివేశాయి. కొన్ని సంస్థలు టర్కిష్ పార్టనర్స్‌తో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
రక్తం పర్యాటకం కలిసి ఉండలేవు | Blood and Booking…
ఇక ఇక్సిగో (Ixigo) కో ఫౌండర్ ఆలోక్ భాజ్‌పై స్వయంగా టర్కీ, అజర్‌బైజాన్, చైనా దేశాలకు విమానాల టికెట్ బుకింగ్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపాడు. బ్లడ్ అండ్ బుకింగ్ రెండూ ఒకేసారి జరగడం సాధ్యం కాదు అని ట్వీట్ చేశాడు ఆలోక్.
పర్యాటక రంగంపై ప్రభావం | Impact on Tourism

ఈ దేశాలకు పర్యాటకులు వెళ్లకపోవడం వల్ల ఇరు దేశాల టూరిజంపై ప్రభావం పడనుంది. 2024 లో 270,000 మంది భారతీయులు టర్కీ వెళ్లారు. 2025 లో ఈ సంఖ్య 20 శాతం పెరుగుతుంది అని భావించారు.
ఇక అజర్ బైజాన్ విషయానికి వస్తే భారతీయులకు వెడ్డింగ్ డెస్టినేషన్‌గా అవతరించింది ఈ దేశం. ఇకపై భారతీయులు ఈ రెండు దేశాలకు వెళ్లడం మానేస్తారు లేదంటే పూర్తిగా తగ్గిస్తారు అని ప్రత్యేకంగా చెప్పే అవవరం లేదు.
వీటికి బదులు | Alternatives and the Road Ahead
యుద్ధ సమయంలో శత్రు దేశానికి అండగా నిలిచిన టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు వెళ్లకుండా అర్మేనియా (Armenia), గ్రీస్ (Greece), నేపాల్, భూటాన్ వంటి దేశాలకు వెళ్లడం ఉత్తమం అని నెటిజెన్లు, ఇండస్ట్రీ నిపుణలు సూచిస్తున్నారు. మన దేశానికి అండంగా నిలిచే ఎన్నో దేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లడం వల్ల ఉత్తమం అని అంటున్నారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.