భారత్- జపాన్ మధ్య వైమానిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశలో ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకు వేసింది. 2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ – టోక్యో హనెడాకు మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ నడపనున్నట్టు ప్రకటించింది.
ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వైమానికి సేవల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీసును ప్రారంభించింది.
ముఖ్యాంశాలు
నరితా నుంచి హనేడాకు షిఫ్ట్
2025 సంవత్సరం ఆరంభంలో ఎయిర్ ఇండియా (Air India) తన ఆపరేషన్స్‌ను నరితా ఎయిర్‌పోర్టు (Narita Airport) నుంచి సెంట్రల్ టోక్యోకు 18 కిమీ దూరంలో ఉన్న హనేడా ఎయిర్‌పోర్టుకు మార్చింది.
- ఎందుకంటే హనేడా విమానాశ్రయం (Haneda Airport) నుంచి వేగంగా, సులువుగా టోక్యో నగరంలోకి వెళ్లే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది.
- రోడ్డు మార్గాన వెళ్లినా, ట్రైన్లో వెళ్లినా ప్రయాణికులకు కనీసం 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది.
ప్రయాణికులు సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణికుల టైమ్‌తో పాటు ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పవచ్చు.
సంబంధిత కథనాలు
- Flight Attendants : ఫ్లైట్ అటెండెంట్లు చేతులు ఎందుకు లాక్ చేసుకుని కూర్చుంటారు?
- జెట్ లాగ్ అంటే ఏంటి ? ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా ? 10 Tips For Avoiding Jet Lag :
- ఫ్లైట్ టికెట్స్ చవకగా బుక్ చేసుకోవడానికి 14 సీక్రెట్ టిప్స్..ఎవ్వరికీ చెప్పకండి ! Flight Ticket Booking Hacks
- విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ?
- First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే
ఫ్లైట్, ఎయిర్ క్రాఫ్ట్ వివరాలు | Air India
2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ- టోక్యో మధ్య ఈ విమానాలు ప్రతీ రోజూ నడుస్తాయి. దీని కోసం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Boeing 787-8 Dream Liner) ఎయిర్‌క్రాఫ్టులను వినియోగించనున్నారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయాణం అనేది సౌకర్యాన్ని అందించడంతో పాటు ఇంధనాన్ని ఆదా కూడా చేస్తుంది.
Konnichiwa, Tokyo!
— Air India (@airindia) April 29, 2025
Starting 15th June 2025, we’re flying daily non-stop from Delhi to Tokyo Haneda.
From the neon glow of Shibuya’s streets to the peaceful views of Mount Fuji, discover a city of endless wonders.
Book now on https://t.co/W4rzk7GjCM or the app.#FlyAI #AirIndia… pic.twitter.com/EQ19l6Q8nU
- AI358: ఇది ఢిల్లీ (DEL) నుంచి 20:20 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.55 నిమిషాలకు టోక్యోలోని హనేడాకు (HND) చేరుకుంటుంది.
- AI357 : ఈ విమానం టోక్యో హనేడా నుంచి ఉదయం 11.50 నిమిషాలకు బయల్దేరి సాయంత్రం 17.25 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.