నిశాచర జీవులను రాత్రి సమయంలో చూసే అవకాశాన్ని కల్పించే దిశలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దేశంలో తొలి నైట్ సఫారీ (Night Safari) ఏర్పాటు చేయనుంది. మరిన్ని వివరాలు చదవండి.
మనిషి ఉదయం నిద్రలేస్తాడు. అడవి రాత్రిపూట నిద్రలేస్తుంది. అడవిలో ఎన్నో జంతువులు రాత్రి సమయంలో చాలా యాక్టివ్‌గా ఉంటాయి. నిశాచరులైన జీవులు పగటిపూట విశ్రమించి, రాత్రి సమయంలో వేటాడుతాయి. అయితే ఇలా నిశాచర జీవులను రాత్రి సమయంలో చూసే అవకాశాన్ని కల్పించే దిశలో ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.
ముఖ్యాంశాలు
తొలి నైట్ సఫారీ | First Night Safari In India
భారత్‌లో తొలి నైట్ సఫారీనీ ప్రారంభించే దిశలో వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది యూపీ ప్రభుత్వం. నైట్ సఫారీతో పాటు అడ్వంచర్ పార్క్‌ను లఖ్నవులో ఏర్పాటు చేయనుందట. ప్రస్తుతం సింగాపూర్‌లోని నైట్ సఫారీ (Singapore Night Safari) చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు.
ఈ పార్కులాగే ఉండేలా కుక్రెయిల్ నైట్ సఫారీ అండ్ అడ్వంచర్ పార్క్ (Kukrail Night Safari ) ను ఏర్పాటు చేయనుందట అక్కడి ప్రభుత్వం. దీని వల్ల పర్యాటకం పెరగడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అడవిలో రాత్రి సమయంలో తిరిగితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో పర్యాటకులు ఎక్స్‌పీరియెన్స్ అవ్వొచ్చు..
ప్రాజెక్టు గురించి | Overview
- ప్రాంతం : ఉత్తర ప్రదేశ్‌లోని లఖనవూకు సమీపంలో ఉన్న కుక్రెయిల్ రిజర్వ్ ఫారెస్ట్ (Kukrail Reserve Forest).
- పెట్టుబడి : రూ.1,500 కోట్లు
- అభివృద్ధి : రెండు దశలో ఈ నైట్ సఫారీ అభివృద్ధి చేస్తారు. మొదటి దశ పనులను 24 నెల్లలో రూ.631 కోట్లను ఖర్చు చేసి పూర్తి చేయనున్నారు.
- ప్రేరణ : సింగపూర్ నైట్ సఫారీ
సదుపాయాలు | Key Features
- డెడికేటెడ్ జోన్స్: పులులు, సింహాలు, చిరుతలు, జింకలు ఇతర జంతువుల కోసం సెగ్రిగేటెడ్ ఎన్‌క్లోజర్స్ ఏర్పాటు చేశారు.
- ఆర్టిఫిషియల్ మూన్లిట్ ట్రెయిల్స్ : రాత్రి సమయంలో సహజమైన వెలుగు ఉండేలా ఆర్టిఫిషియల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
- ఎకో ఫ్రెండ్లీ సఫారీ రైడ్ : పర్యాటకులు (Traveling) ప్రయాణించేందుకు బ్యాటరీతో నడిచే వాహానాలను వినియోగించనున్నారు. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు.
- బర్డ్ వాచింగ్ ఏరియాలు : నిశాచర పక్షులను (Nocturnal Animal) చూసేందుకు ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయున్నారు.
- ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- ఎడ్యుకేషన్ సెంటర్ : వన్య ప్రాణి సంరక్షణ గురించి అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా ఇంటరాక్టీవ్ ఎడ్యుకేషనల్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
- విలాసవంతమైన రిసార్టులు : సందర్శకుల కోసం సఫారీ థీమ్‌లో విలాసవంతమైన రిసార్టులను నిర్మించనున్నారు.
వైల్డ్ లైఫ్ పర్యాటకానికి ఊతం
ఈ ప్రాజెక్టు రాకతో నైట్ సఫారీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఒక మంచి డెస్టినేషన్ లభిస్తుంది. సింగాపూర్తో పాటు భారత్‌కు కూడా నైట్ సఫారీ (Night Safari In Wildlife) కోసం చాలా మంది విదేశీ పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. వైల్డ్‌లైఫ్, అడ్వెంచర్, లగ్జరీ కలబోతలతో సిద్ధం అవుతున్న నైట్ సఫారీ అనేది వైల్డ్ లైఫ్ టూరిజాన్ని (Wildlife Tourism) సరికొత్తగా దిశను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.