Flight Attendants : ఫ్లైట్ అటెండెంట్లు చేతులు ఎందుకు లాక్ చేసుకుని కూర్చుంటారు?

షేర్ చేయండి

మీరు విమాన ప్రయాణం చేసి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. అదేటంటే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎయిర్‌హోస్టెస్ (Flight Attendants) తన చేతిని ఇలా లాక్ చేసుకుని కూర్చుంటుంది. ఇది కాస్త అసహజంగా అనిపించినా ఇలా చేయడం వేనక ఒక సేఫ్టీ రీజన్ కూడా ఉంది. 

విమానంలో ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే దానికి ఫ్లైట్ ఎటెండెంట్స్ సిద్ధం అయ్యేలా చేస్తుంది ఈ పొజిషన్. అయితే ఇలా చేయడానికి అసలు కారణం ఏంటో చూద్దాం.

ఈ పొజిషన్‌ను ఏమంటారు ? 

ఫ్లైట్ అటెండెంట్స్ ఇలా కూర్చునే విధానాన్ని బ్రేసింగ్ పొజిషన్ (Bracing Position) అని అంటారు. విమానం ఎగిరే లేదా దిగే సమయంలో ఈ పొజీషన్‌లో కూర్చుంటారు.

  • ముందుగా నిటారుగా కూర్చుని తరువాత వారి చేతులును తొడల కింది భాగంలో అరచేతిని పైకి ఉంచి, బొటన వేళ్లను లోపలికి మడిచి, చేతలను లూజ‌్‌గా వదిలేస్తారు. 
  • దీని వల్ల అత్యవసరమైన పరిస్థితి వస్తే శారీరక కదలికలు తగ్గి, గాయలు అయ్యే అవకాశాన్ని తగ్గుతాయి అని అంటారు.

ప్రశాంతంగా గమనించడం | Flight Attendants

Flight Attendants
అత్యవసర పరిస్థితికి సిద్ధం అవడంలో భాగంగా బ్రేసింగ్ పొజిషన్‌లో కూర్చున్న సిబ్బంది (PC:Hennylim/Youtube)

ఏదైనా విపత్కర లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఫ్లైట్ అటెండెంట్స్ సైలెంట్‌గా పరిస్థితిని గమనిస్తారు. ఈ పరిస్థితి నుంచి ప్రయాణికులను (Air Travelers) సురక్షితంగా బయటికి ఎలా తీయాలో మైండ్‌లోనే రిహర్సల్ చేస్తారు. 

  • సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో భాగం అయిన డోర్ ఆపరేషన్, ఎవాక్యువేషన్ కమాండ్స్‌ను గుర్తు తెచ్చుకుంటారు. 
  • దీంతో పాటు ఎగ్జిట్ డోర్ తెరవడానికి ముందు బయటి పరిస్థితిని గమనించడం చేస్తారు. 

అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఈ విధంగా సాధన చేయడాన్నిఎయిర్‌బస్ (Airbus) లాంటి ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు రికమండ్ చేస్తారు.

ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు ప్లైట్ అటెండెంట్స్ సేప్టీ ప్రోటోకాల్స్ (Flight Safety Protocols) గుర్తు చేసుకుని ఏమైనా అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు స్పందించేందుకు మానసికంగా సిద్ధం అవుతారు.

ఎయిర్‌క్రాఫ్టును బట్టి, సీట్లు ఉన్న విధానాన్ని బట్టి ప్లైట్ అటెండెంట్స్ తమ తలను కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. 

మొత్తానికి విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సయమంలో ఇలా చేతులపై కూర్చోవడం అనేది ఒక ఆసనం మాత్రమే కాదు. అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు ప్లైట్ అటెండెంట్స్ సిద్ధం అయ్యే విధానం కూడా. 

శారీరకంగా, మానసికంగా విపత్కర పరిస్థితులకు ఇలా సిద్దం అవడం అనే ఏవియేషన్ సేఫ్టీలో (Aviation Safety) భాగం అని చెప్పవచ్చు. సో,  నెక్ట్స్ టైమ్ మీరు విమానం ఎక్కినప్పుడు అందులో ఉన్న సిబ్బంది మీ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఒకసారి గమనించండి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!