ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న 2025 అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra 2025) సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. ఒక వేళ మీరు కూడా ఈ పవిత్రమైన యాత్రకు వెళ్లాలని అనుకుంటే ఈ ప్రయాణం సాఫీగా సాగేందుకు కావాల్సిన సమాచారం అంతా మీకోసం అందిస్తున్నాం.
ముఖ్యాంశాలు
ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న 2025 అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra 2025) సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. జమ్మూ అండ్ కశ్మీర్‌లోని పవిత్రమైన అమర్‌నాథ్ గుహకు వెళ్లాలనేది కోట్లాది మంది జీవిత ఆశయాల్లో ఒకటిగా ఉంటుంది.
ఒక వేళ మీరు కూడా ఈ పవిత్రమైన యాత్రకు వెళ్లాలని అనుకుంటే ఈ ప్రయాణం సాఫీగా సాగేందుకు కావాల్సిన సమాచారం అంతా మీకోసం అందిస్తున్నాం. నలుగురికి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయగలరు.
గుర్తుంచుకోవాల్సిన తేదీలు | Important Days
2025 అమర్‌నాథ్ యాత్ర గురించి మార్చిలోనే అప్డేట్స్ వచ్చాయి. అయితే రిజిస్ట్రేషన్ మాత్రం 2025 ఏప్రిల్ 2025న ప్రారంభం అయింది. ఇక మీకు తేదీల విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ఒకసారి చెక్ చేయండి!
- యాత్ర మొదలయ్యే తేది : 2025 జూలై 25
- యాత్ర చివరి తేది : 2025 ఆగస్టు 19
- రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యే తేది : 2025 ఏప్రిల్ 2025
ఈ యాత్రను హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు సవ్యమైన మార్గం ఉన్నప్పుడు ప్రారంభిస్తారు. అమర్‌నాథ్ గుహలో భక్తులు మంచుతో ప్రాకృతికంగా ఏర్పడిన మహాలింగాన్ని (Amarnath Shiva Lingam) దర్శించుకుని తరిస్తారు.
ప్రతీ సంవత్సరం ఈ పవిత్ర యాత్రకు లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. ఇది ఆధ్యాత్మికతతో కూడిన ఒక అద్భుతమైన సాహసయాత్ర .
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?
How To Register For Amarnath Yatra 2025: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని కోరుకునే భక్తులు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు ఇవే :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ | Amarnath Yatra 2025 Online Registration

ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా సులువైన విధానం అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియను మీరు మీ ఇంట్లోంచి మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి కూడా పూర్తి చేయవచ్చు.
- ముందుగా మీరు శ్రీ అమర్‌నాథ్ యాత్రాజి ష్రైన్ బోర్డు (SASB) వెబ్‌సైట్ https://www.jksasb.nic.in/ ను విజిట్ చేయాలి.
- తరువాత అక్కడ ఉండే రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని కరెక్టుగా నింపాల్సి ఉంటుంది.
- అవసరమైన డాక్యుమెంట్స్, ఫోటోలు, కంపల్సరీ హెల్త్ సర్టిఫికెట్స్ (CHC) అప్లోడ్ చేయండి.
- ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి (రూ.150)
- మీ యాత్రా పర్మిట్ ( Amarnath Yatra 2025 Permit) ను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్తగా దాచుకోండి.
వ్యక్తిగతంలా రిజిస్ట్రేషన్ కేంద్రాలకు వెళ్లి ఫామ్‌లను ఫిల్ చేసే ఇబ్బంది నుంచి తప్పించుకోవాలి అనుకునే వారికి ఆన్‌లైన్ విధానం బాగా సెట్ అవుతుంది.
ఆఫ్‌లైన్లో రిజిస్ట్రేషన్ | Offline Registration
ఆన్‌లైన్లో కాకుండా ఆఫ్‌లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి అనుకునేవారు ఈ కింది కేంద్రాలకు వెళ్లవచ్చు
- భారత దేశ వ్యాప్తంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ బ్రాంచిలకు వెళ్లవచ్చు.
- అక్కడ దరఖాస్తు ఫామ్‌లను తీసుకుని అన్ని వివరాలను సరిగ్గా నింపండి.
- దరఖాస్తు ఫామ్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్, హెల్త్ సర్టిఫికెట్, ఫోటోలను అటాచ్ చేయండి.
- తరువాత రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి మీ యాత్రా పర్మింట్‌ను తీసుకోండి.
డిజిటల్ విధానంపై అంతగా అవగాహన లేని వారు లేదా ఆ వ్యవస్థ అందుబాటులో లేని వారు ఇలా ఆఫ్‌లైన్ మార్గాన్ని ఎంచుకుని యాత్ర అనుమతిని పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ సాఫీగా సాగాలంటే | Tips For Smooth Registration
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు కొన్ని చిట్కాలు:
- త్వరపడండి : అమర్‌నాథ్ యాత్రకు ప్రతీ రోజు కేవలం 15,000 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. కాంపిటీషన్ బాగా ఉంటుంది కాబట్టి వెళ్లాలి అనుకుంటే వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోండి.
- ఆరోగ్య పరిస్థితులు : ఈ పవిత్ర యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా “ కంపల్సరి హెల్త్ సర్టిఫికెట్ “ (CHC) ను ఆథరైజ్డ్ డాక్టర్ లేదా మెడికల్ ఇనిస్టిట్యూట్ నుంచి పొందాల్సి ఉంటుంది. దాంతో పాటు 13 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసు ఉన్న వారిని ఆరోగ్యం బాగుంటేనే ఈ యాత్రకు అనుమతి ఇస్తారు.
Compulsory Health Certificate PDF (Amarnath Yatra) ఎలా ఉంటుందో చూడండి. కావాలంటే ఇది డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
గ్రూపు రిజిస్ట్రేషన్ : మీరు మీ ప్యామిలీ, ఫ్రెండ్స్ లేదా ఒక గ్రూపుతో కలిసి వెళ్లాలి అనుకుంటే గ్రూప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అందుబాటులో ఉంటుంది. దానిని ఉపయోగించుకోలరు.
అమర్‌నాథ్ యాత్ర గురించి | Facts About Amarnath Yatra
అమర్‌నాథ్ యాత్ర గుహ అనేది 3,888 మీటర్ల ఎత్తులో కఠినమైన పర్వతశ్రేణుల్లో ఉంటుంది. ఈ ట్రెక్ (Amarnath Trek) అనేది రెండు మార్గాల్లో సాగుతుంది. ఒకటి బాల్టాల్ (Baltal), రెండోది పలల్గామ్ (Pahalgam). ఈ రెండు మార్గాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి.
ప్రకృతి రమణీయత భక్తులను కట్టిపడేస్తుంది. ఇక ట్రెక్కింగ్ చేయడం కష్టంగా అనిపించే వారి కోసం హెలికాప్టర్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ పవిత్రమైన గుహలో మంచు లింగం అనేది చంద్రగమంతో పాటు పెరిగి కరుగుతుంది. మరీ ముఖ్యంగా జులై నుంచి ఆగస్టు మాసంలో ఈ లింగం చుట్టూ ఉన్న ఐస్ క్యాప్స్ కరిగిపోయి పరిపూర్ణమైన లింగాకారం ఏర్పడుతుంది.
ఈ సమయంలో ఇక్కడ లింగాన్ని దర్శించుకోవడం వల్ల భోళా శంకరుడి (Lord Shiva) కరణకు పాత్రులు అవుతాము అని భక్తులు నమ్ముతారు
ఆధ్మాత్యిక యాత్ర మాత్రమే కాదు …
అమర్‌నాథ్ యాత్ర అనేది కేవలం ఒక తీర్థయాత్ర (Pilgrimage) మాత్రమే కాదు. ఇది మనిషిలోని ఆధ్మాత్మిక భావనకు ఈ భౌతిక ప్రపంచానికి మధ్య వారధిలా నిలిచే పవిత్ర యాత్ర. ఈ యాత్రకు వెళ్లాలనుకుంటే పైన వివరించిన ప్రక్రియను జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది.
అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి ఈ పవిత్రయాత్రను ప్రశాంతంగా, పూర్తి భక్తి భావంతో కంప్లీట్ చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, హర్ హర్ మహాదేవ్ అని శివన్నామస్మరణ చేసి బ్యాగులు ప్యాక్ చేసుకుని ఈ యాత్రకు సిద్ధం అవ్వండి. జై భోళేనాథ్
ఈ వార్త అప్డేట్ అవుతోంది…
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.