Watch : ఏక్తా నగర్ గ్లాస్ స్కైవాక్ – గాజు మీద వాక్ | Rain Forest Sky Walk
Rain Forest Sky Walk : ఏక్తా నగర్ రెయిన్ ఫారెస్ట్ లో ప్రధాన ఆకర్షణ 220 మీటర్ల గాజు స్కైవాక్.
ప్రధాని మోదీ గారు ప్రారంభించిన ఈ వంతెన, రెయిన్ ఫారెస్ట్ మధ్యలో ఎత్తులో నిర్మించారు. పూర్తిగా గాజుతో చేసిన ఈ వంతెన పై నడుస్తుంటే కింద ఉన్న పచ్చని అడవి, జలపాతం, చెరువు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి అడుగు వేసేటప్పుడు కొంచెం భయం అనిపించినా, తర్వాత థ్రిల్ గా ఉంటుంది.
ఈ స్కైవాక్ పై నుంచి దూరంగా ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ (Statue Of Unity) కూడా కనిపించడం ప్రత్యేకం. ఫోటోలకు, వీడియోలకు ఇది బెస్ట్ పాయింట్.
47 వేల చదరపు మీటర్ల రెయిన్ ఫారెస్ట్ లో ఈ వంతెన కోసం 9.49 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. కెవడియా వెళితే ఈ గాజు వంతెనను తప్పక ఎక్కండి.
మీరు కూడా ఈ రీల్లో చూడండి
