ఇటీవలే ఉగ్రవాడుల దాడులకు గురైన పహల్గాంలోని బైసారన్ లోయను మిని స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. అలాంటి మినీ స్విట్జర్లాండ్ (Mini Switzerland) ఎలా ఉంటుందో చూద్దామనే కోరికతో గుర్రాలు ఎక్కి, నడుచుకుంటూ వెళ్లారు పర్యాటకులు. అదే సమయంలో పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి (Pahalgam Terror Attack) చేశారు.
దీంతో మళ్లీ ఈ మిని స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు ఎంత మంది ఆసక్తి చూపుతారు అనేది ఇప్పటికైతే చెప్పలేము. కానీ మన దేశంలో బైసారన్ వ్యాలీ (Baisaram Valley) మాత్రమే కాదు మరో 7 మినీ స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి అని మాత్రం చెప్పగలము.
ముఖ్యాంశాలు
1 .ఖజ్జర్, హిమాచల్ ప్రదేశ్ | Khajjar, Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా (Chamba District) జిల్లాలో ఉన్న పాపులర్ డెస్టినేషన్ ఖజ్జర్. దూరదూరం వరకు పరుచుకుని ఉన్న పచ్చ గడ్డి మైదానాలు, మధ్యలో ఉన్న చిన్నసరస్సు (Khajjar Lake) వెరసి ఇది ఒక బ్యూటిఫుల్ పెయిటింగ్‌లా కనిపిస్తుంది.
యాక్టివిటీస్ : ఖజ్జి నాగ్ ఆలయం (Khajji Nag Temple), ప్యారాగ్లైడింగ్, గుర్రపు స్వారి
ఆలి, జోషిమఠ్, ఉత్తరాఖండ్

Auli, Uttarakhand : ఆలి లేదా ఓలి అని పిలుస్తారు. ఇది ఉత్తరాఖండ్ జిల్లాలోని జోషిమఠ్ (Joshimath) సమీంలో ఉంటుంది. ఒకప్పుడు సైనికులు ఇక్కడ స్కీయింగ్ ప్రాక్టిస్ చేసేవాళ్లు. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. అలాగే చాలా మంది ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి సమ్మర్ మొత్తం ఉండేవారు.
ఇక్కడి నుంచి మనకు గ్రేటర్ హిమాలయాస్ (Greater Himalayas) అందం కనిపిస్తుంది. బద్రినాథ్ (Badrinath), కేదార్‌నాథ్ వైపు ఉన్న పర్వతాలు ఇలా ఎన్నో అద్బుతమైన వ్యూస్ కనిపిస్తాయి.
ఒకవేళ మీరు బద్రినాథ్ లేదా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార హేంకుండ్ సాహిబ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley Of Flowers) ప్లాన్ చేస్తే మాత్రం జోషిమఠ్ నుంచి మీరు ఆలి ప్లాన్ చేసుకోవచ్చు.
యాక్టివిటీస్ : స్కీయింగ్, కేబుల్ కార్ రైడింగ్, నందా దేవి పర్వతం దర్శనం
- ఇది కూడా చదవండి : Valley Of Flowers : ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం
కూర్గ్, కర్ణాటక

Coorg, Karnataka: కూర్గ్ అనేది భారత దేశంలోనే అత్యంత పాపులర్ హిల్ స్టేషన్లలో ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు ఎండాకాలం బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. అయితే వింటర్ టైమ్‌లో ఇది ఒక వండర్ లాండ్‌లా ఉంటుంది.
ఇక్కడీ కాఫీ తోటలు, అందమైన జలపాతాలను చూస్తే మనం స్విట్జర్లాండ్‌లోని (Mini Switzerland) ఏదో గ్రామంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.
యాక్టివిటీస్: ఇక్కడి ఆబ్బీ ఫాల్స్‌కు వెళ్లడం (Abbey Falls), రాజాస్ సీట్ వ్యూ పాయింట్స్ చాలా పాపులర్ .
యుంతాంగ్ లోయ, సిక్కిం

Yumthang Valley, Sikkim : ఒకవైపు పువ్వులతో అందంగా కనిపించే లోయ, అక్కడక్కడా మంచు పర్వతాల నుంచి జాలువారే ధారలు, మరో వైపు వేడి నీటి ఊటలు. మొత్తానికి సిక్కింలోని యుంతాంగ్ లోయ అనేది ఊహించిన దానికంటే అందంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
యాక్టివిటీస్ : ఇక్కడి జీరో పాయింట్, దీంతో పాటు అరుదైన రోడోడెండ్రాన్ అనే పువ్వులున్న షింగ్‌బా శాంక్చువరి (Shingba Rhododendron Sanctuary) విజిట్ చేయవచ్చు. అయితే వెళ్లే ముందు వరదల గురించి (Sikkim Floods) తప్పకుండా చెక్ చేయండి.
మున్నార్, కేరళ

Munnar Kerala : సీజన్ ఏదైనా రీజన్ ఏదైనా కేరళలోని మున్నార్ అనేది One of the Best Hill Station in india. ఇక్కడి టీ ఎస్టేట్స్, చల్లని వాతావరణం మనను మరో లోకంలోకి వెళ్లేలా చేస్తుంది.
యాక్టివిటీస్ : ఎరవికులం జాతీయ పార్క్ (Eravikulam National Park) వెళ్లడం, మట్టుపెట్టి ( Mattupetty Dam) డ్యామ్‌ను చూడటానికి వెళ్లవచ్చు.
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద బౌద్ధ ఆలయం ఇక్కడే ఉంది. చైనా బార్డర్ అయిన బుమ్లా పాస్ (bumla pass) కు అత్యంత చేరువలో ఉంటుంది తవాంగ్. భారత్‌లో ఉన్న అత్యంత అందమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి అని కూడా చెప్పవచ్చు.

ఇక్కడి గడ్డకట్టుకున్న సరస్సులు (Frozen Lakes), అందమైన హిమాలయ పర్వతాలు, భారీ బుధ్దుడి విగ్రహం (Biggest Buddha Statue) ఇవన్నీ కూడా మనల్ని వేరే లోకంలోకి వెళ్లేలా చేస్తాయి.
ప్రధాన ఆకర్షణలు : తవాంగ్ మోనాస్టరీ, సేలా పాస్, బుమ్లా పాస్, బుద్ధా స్టాట్యూ
అరకు లోయ

Araku Valley : తెలుగు రాష్ట్రాల్లో అరకు లోయ గురించి తెలియని వారుండరు. అరకు అనేది మనకు మినీ స్విట్జర్లాండ్ కన్నా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మనకు కాఫీ తోటలే కాదు, ఎన్నో జలపాతాలు, అద్భుతమైన వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి.
ప్రధాన ఆకర్షణలు : లంబసింగి, వంజంగి, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు, కటిక ఫాల్స్, అనంతగిరి.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
జర భద్రం
ఇందులో ప్రస్తావించిన ప్రదేశాలు సాధారణంగా అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఇటీవలే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు.
- అందుకే స్థానిక అధికారులు, ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను పాటించండి.
- అలాగే మీకు ఎక్కడైనా అభద్రతా భావం కలిగితే వెంటనే అక్కడి నుంచి వచ్చేసి అధికారులకు సూచించండి.
- మరీ ముఖ్యంగా సున్నితనమైన ప్రాతాలకు వెళ్లే ముందు జర భద్రం.
- వర్షాకాలంలో పైన వివరించిన ప్రాంతాలకు వెళ్లే ముందు ఆ ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు చదవండి. ఎందుకంటే ఇలాటి ప్రాంతాల్లో వరదలు, కొండ చరియలు విరిగిపడుతూ ఉంటాయి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.