ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది.
ముఖ్యాంశాలు
హెలియాత్ర | IRCTC Heliyatra
ఈ సేవల వల్ల ఉత్తరాఖండ్‌లని గడ్వాల్ హిమాలయాల్లో ఉన్న కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది. దీని కోసం హెలియాత్ర (Heliyatra) అనే ఒక డెడికేటెడ్ పోర్టల్ అంటే వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తోంది ఐఆర్‌సీటీసి.
- ఇది కూడా చదవండి : Kedarnath Rope Way : ఇక 36 నిమిషాల్లో కేదార్‌నాథ్ వెళ్లవచ్చు...
బుకింగ్ చేసుకునే విధానం | Booking Process
కేదార్‌నాథ్ యాత్ర వెళ్లాలి అనుకునే భక్తులు ముందుగా ఉత్తరాఖండ్ టూరిజం (Uttarakhand Tourism) అధికారిక వెబ్‌సైట్‌లో తమ యాత్రను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- కేదార్‌నాథ్ యాత్ర రిజస్ట్రేషన్ పోర్టల్ : https://registrationandtouristcare.uk.gov.in/signin.php
దీని తరువాత హెలికాప్టర్ సేవల కోసం బుకింగ్ చేసుకోవచ్చు. దీని కోసం ఈ కింది వెబ్‌సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుంది.
- హెలియాత్ర రిజిస్ట్రేషన్ పోర్టల్ : https://www.heliyatra.irctc.co.in
ఐఆర్‌సీటిసి వారి హెలియాత్ర పోర్టల్‌లో మీ ఖాతాను క్రియేట్ చేసుకోవాలి. హెలియాత్ర పోర్టల్‌లో హెలికాప్టర్ టికెట్ బుక్ చేసే సమయంలో… ఉత్తరాఖండ్ టూరిజంలో రిజిస్టర్ చేసుకున్నాక వచ్చే రిజిస్ట్రేషన్ లెటర్ అవసరం అవుతుంది.
ఆ లెటర్ ఇలా ఉంటుంది.

- హెలియాత్ర అనే పోర్టల్‌లో యూజర్లు తమ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ఓటీపితో వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక యాత్ర రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రయాణికులు ఇందులో వారి ప్రయాణ తేదీలు, టైమ్ స్లాట్స్, ఎంత మంది వెళ్తున్నారు అనే వివరాలు వెళ్లడించాల్సి ఉంటుంది. ఒక యూజర్ కేవలం రెండు టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగలడు.
టికెట్ ధరలు | Fares and Routes
ఈ కింది ప్రాంతాల నుంచి హెలికాప్టర్ సేవలు మొదలు అవుతాయి.
- ఫాాటా (Phata) : రూ.6,063 ప్రతీ ట్రిప్పునకు
- సిర్సీ (Sirsi) రూ.6,061 ప్రతీ (రౌండ్ ట్రిప్)
- గుప్తకాశి (Guptkashi) : రూ.8,533 (రౌండ్ ట్రిప్)
ఈ మార్గాల్లో వెళ్లడం వల్ల సమయం ఆదా అవుతుంది. దీంతో పాటు ఎంతో అందమైన దృశ్యాలు కనిపిస్తాయి.
కేన్సలేషన్ విధానం | Cancellation Policy
హెలీ సేవల కోసం బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జర్నీకి 5 రోజు ముందు క్యాన్సిల్ చేసుకుంటే 75 శాతం చార్జి రిఫండ్ అవుతుంది.
- ఇలా ప్రయాణానికి 24 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రిఫండ్ రాదు.
- అలాగే ప్రయాణ సమయానికి 1 గంట ముందు హెలిప్యాడ్ వద్దకు చేరుకోకపోయినా ఎలాంటి రీఫండ్ రాదు.
యాత్ర ప్రారంభం అయ్యాక పెరిగే రద్దిని గుర్తుంచుకుని మీరు ముందస్తు బుకింగ్ చేసుకుంటే మంచిది. ఈ హెలికాప్టర్ సేవల వల్ల మీకు సమయం ఆదా అవుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. అలాగే అందమైన హిమాలయలను (Himalayas) , వాటి అద్భుతమైన అందాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.