Vanuatu: లలిత్ మోడి పౌరసత్వం పొందిన వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్

షేర్ చేయండి

ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మన్ లలిత్ మోడి (Lalit Modi) ఇటీవలే బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకుని చిన్న పసిఫిక్ దేశం అయిన వనవాటు (Vanuatu) పౌరసత్వాన్ని స్వీకరించనున్నట్టు తెలిపాడు. 

అయితే భారత్‌‌కు చెందిన దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకుని ఈ ఆర్థిక నేరగాడు తిరుగుతున్నాడు. ఈ  విషయం తెలియడంతో అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనవాటు ప్రధాని జోథమ్ నపాత్ (Jotham Napat) ఆధికారులను సూచించారు. తరువాత పౌరసత్వం రద్దు కూడా అయింది. అయితే అప్పటికే వనవాటు దేశం చాలా అందంగా ఉంది అంటూ లలిత్ మోడి ట్వీట్ చేశాడు.

Vanuatu PM Cancelled Lalit Modi Citizenship
వనవాటు ప్రభుత్వం అధికారిక ప్రకటన

అటు బ్రిటిష్ పౌరసత్వం (Britain Citizenship)  రద్దు చేయాలి అని అతను అప్లై చేశాడు, ఇటు వనవాటు పౌరసత్వం రద్దయింది. ఈ టైమ్‌లో వనవాటు దేశం ట్రెండ్ అవుతోంది కాబట్టి… అది ఎక్కడుంది…ఆ దేశం ఎలా వెళ్లాలి వంటి విషయాలు తెలుసుకుందాం.

వనవాటు పేరు వెనక ఉన్న అర్థం | Meaning Of Vanuatu

వనవాటులో Vanua అంటే భూమి లేదా ఇల్లు , Tu అంటే ఐక్యతగా ఉండటం అనే అర్థం వస్తుంది. 

వనవాటు దేశం ఎక్కడుంది ?

Vanuatu Map
వనవాటు మ్యాప్ ( Source: google Maps)

వనవాటు దేశం అనేది సౌత్ పసిపిక్ ఓషన్‌లో (South Pacific Nation) ఉన్న ఒక చిన్న దేశం. ఆస్ట్రేలియా నుంచి 1,750 కిమీ దూరంలో, న్యూజిలాండ్ నుంచి 500 కిమీ దూరంలో ఉంటుంది ఈ దేశం. ఈ దేశ రాజధాని వచ్చేసి పోర్ట్ విలా (Port Vila). 

ఆసక్తికరమైన విషయాలు | Facts About Vanuatu

వై షేప్‌లో ఉన్న ఈ చిన్న దేశంలో సుమారు 83 చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 65 ద్వీపాల్లోనే ప్రజలు నివసిస్తారు.ఈ దేశ విస్తీర్ణం వచ్చేసి 12,274 కిమీ ఉంటుంది.

వనవాటు దేశం చిన్నదే అయినా ఇది చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ రెయిన్ ఫారెస్ట్స్, అద్భుతమైన బీచులు (Beaches), అందమైన పర్వతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. 

Vanuatu Beauty
వనవాటు సౌందర్యం

దీంతో పాటు ఇక్కడ భూమిపై, సముద్ర గర్భంలో అనేక అగ్నిపర్వతాలు (Volcanos) ఉన్నాయి.

ఇక్కడ రోజురోజుకూ కాలుష్యం పెరగటం, సముద్ర మట్టం పెరగడం వంటి సమస్యలు ఉన్నాయి. మంచినీటి వనరులు (water Resource) కూడా తగ్గిపోతున్నాయి. దీంతో పాటు వ్యర్థాల నిర్వహణలో నైపుణ్యం లేకపోవడం రీసైక్లింగ్ ప్రాసెసింగ్ అనేది వీరికి కష్టంగా మారింది. 

ఈ దేశంలో భారీ పరిశ్రమలు లేకపోవడం లేదా అంతగా లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు అంతగా ఉండవు. దీంతో ఆర్థిక సమస్యల వల్ల ఇక్కడి వాళ్లు స్థానిక పర్యావరణంపై ఆధారపడుతున్నారు. దీంతో అక్కడి పర్యావరణంపై కూడా ప్రభావం పడుతోంది. 

Yasur Volcano
తానా ద్వీపంలో ఉన్న యాసుర్ వొల్కనో

వనవాటులో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో పాటు ఇక్కడ అగ్నిపర్వాతాలు కూడా చాలా ఉన్నాయి.  తానా ఐలాండ్‌లో (Tanna Island Volcano) ఒక అగ్నిపర్వతం ఉంది. ఇందులో మీరు లావా కూడా చూడవచ్చు. దీని కోసం మీరు పోర్ట్ విలా నుంచి మరో ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది.

వనవాటు రాజకీయాల విషయానికి వస్తే దేశ అధ్యక్షుడికి ప్రత్యేక అధికారాలు ఉండవు. ప్రధానమంత్రే దేశాన్ని నడిపిస్తాడు. స్థానిక గ్రామాల్లో ఉండే పెద్దలే అక్కడి రాజకీయాలను శాసిస్తారు. వీరి మాటలను రాజకీయ నాయకులు కూడా పాటిస్తారు.

వ్యవసాయమే ప్రధానం

Vanuatu Beaches
వనవాటు బీచ్

ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే వనవాటు అనేది ప్రపంచంలో సురక్షితమైన పెట్టుబడుల జాబితాలో 173వ స్థానంలో ఉంది. ( 2011 లో యూరోమనీ కంట్రీ రిస్కింగ్ ర్యాంకింగ్ ప్రకారం )

  • వనవాటు దేశంలో వ్యవసాయంపై (Agriculture) ఆధారపడి జీవించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. సుమారు 65 శాతం మంది వ్యవసాయం చేస్తారు.
  • ఇక్కడి నుంచి కోప్రా, కావా (Kava), గొడ్డుమాంసం, కోకోవా, కలపను విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ దేశంలో వివిధ గ్రామాల మధ్య వస్తు మార్పిడి పద్ధతి (Barter System) నేటికీ అమలులో ఉంది.

అదే సమయంలో వివిధ దేశాల నుంచి యంత్రాలను, ఆహార పదార్థాలను, చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ మైనింగ్ అనేది దాదాపు జరగదు అని చెప్పవచ్చు. 

పౌరసత్వం అమ్మబడును | Vanuatu Selling Citizenship

ఆర్థిక అవసరాల కోసం, పెరుగుతున్న సముద్రం మట్టం నుంచి తన దేశాలను కాపాడుకునేందుకు ఇటీవలే నౌరూ దేశం (Nauru) తన దేశ పౌరసత్వాన్ని అమ్మనున్నట్టు ఇటీవలే తెలిపింది.

అయితే అంతకు ముందు నుంచే వనవాటు దేశం లక్షా 50 వేల డాలర్లకు తమ దేశ పౌరసత్వాన్ని అమ్ముతోంది. ఇక్కడ పౌరసత్వం కొనేవారిలో చైనా (China) వాళ్లే అధికం. ప్రస్తుతం ఈ దేశ ఆదాయంలో 30 శాతం పౌరసత్వం అమ్మకాల నుంచే వస్తాయి. 

  • 2025 మార్చి 5 వ తేదీ వరకు అందిన గణాంకాల ప్రకారం  ఈ దేశ జనాభా వచ్చేసి 3 లక్షల 32 వేల 789 . 
  • భాషల విషయానికి వస్తే వనవాటులో మూడు అధికారిక భాషలు ఉన్నాయి. అవి బిస్లామా (Bislama), ఇంగ్లిష్, ఫ్రెంచ్.  దీంతో పాటు వివిధ ద్వీపాల్లో అనేక అరుదైన భాషల్లో కూడా ప్రజలు మాట్లాడుకుంటారు.
  • వనవాటు దేశంలో ఉన్న కరెన్సీని వనవాటు వాటు (Vanuatu Vatu) అంటారు. అయితే ఈ దేశం క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) వినియోగం విషయంలో వేగంగా ముందుకు వెళ్తోంది. 

వనవాటు దేశం 1980 లో ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల నుంచి స్వాతంత్య్రాన్ని పొందింది. పార్లమెంటరీ రిపబ్లిక్ దేశంగా అవతరించింది

హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి ? | Hyderabad to Vanuatu 

Vanuatu Port
వనవాటులో ఓడరేవు

హైదరాబాద్ నుంచి మీరు వనవాటుకు డైరక్ట్ విమానాల్లో వెళ్లలేరు. అయితే మీరు అక్కడికి వెళ్లలేరు అని మాత్రం నేను అనడం లేదు.

హైదరాబాద్ నుంచి లేయోవర్స్‌లో వనవాటు వెళ్లాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా, వర్జిన్ ఆస్ట్రేలియా (Virgin Airways) విమానంలో పలు ఎయిర్‌పోర్ట్స్‌లో ఆగిఆగి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా సింగాపూర్, తరువాత ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వెళ్లాలి అక్కడి నుంచి వనువాటులోని పోర్ట్ విలాకు వెళాల్సి ఉంటుంది. 

ప్రయాణానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఒక టూవే టికెట్ల ధర రూ.98,000 నుంచి రూ.1,28,000 వేల వరకు ఉంటుంది.( ఈ పోస్టు రాసే సమయానికి)

ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To Visit Vanuatu

వనవాటు వెళ్లేందుకు బెస్ట్ టైమ్ వచ్చేసి ఎండాకాలం. ఏప్రీల్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా మంది ఈ దేశానికి వెళ్తుంటారు. ఈ సమయంలో స్కార్కిలింగ్ (snorkeling) , డైవింగ్ వంటి పలు యాక్టివిటీస్ చేయవచ్చు.

చూడాల్సిన ప్రదేశాలు | Places To Visit

  • పోర్టు విలా : వనవాటు రాజధాని ఇది. ఇక్కడి అద్భుతమైన సముద్ర తీరాలు, వైబ్రెంట్ మార్కెట్స్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
  • ఎఫాటే ఐస్లాండ్స్ (Efate Islands) : ఇక్కడి తీరప్రాంతాలతో పాటు ఫేమస్ మెలే కాస్కేడ్స్ Mele Cascades) అనే జలపాతం చూడవచ్చు.
Mele Cascades (1)
మెలె కాస్కేడ్ జలపాతం
  • తానా ఐలాండ్ (Tanna Island) : ఈ ఐల్యాండ్‌లో మీరు యాసుర్ అనే అగ్నిపర్వతాన్ని (Yasur Volcano) మీరు చూడవచ్చు. రగులుతోన్న లావా ఎలా ఉంటుందో చూడాలంటే చూడవచ్చు. స్థానిక కల్చర్ గురించి తెలుసుకోవచ్చు. పోర్టు విలా నుంచి ఈ ఐలాండ్‌కు విమానంలో వెళ్లవచ్చు. సుమారు రూ.7,000 వరకు టికెట్ ధర ఉంటుంది. 
  • ఎస్పిరిటు సాంటో (Espiritu Santo) : ఈ ఐలాండ్‌లో ఉండే అందమైన బీచులు, క్రిస్టల్ క్లియర్ సముద్రపు నీరు మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయి.
  • ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

ట్రై చేయాల్సిన ఫుడ్ | Food

ఏ దేశం వెళ్లినా తప్పకుండా అక్కడి ఫుడ్ తయారు చేయాలి. ఎందుకంటే కడుపు సంతోషంగా ఉంటే బుర్ర వేగంగా పని చేస్తుంది. 

  • లప్లాప్ | Laplap : ఇది వనవాటు నేషనల్ డిష్. దీనిని చిలకడదుంప లేదా చామదుంపలతో ఒక ఒవెన్‌లో తయారు చేస్తారు.
  • తులుక్ | Tuluk:  ఇది కూడా లాప్లాప్ లాంటిదే. కర్రపెండలంను ఉడికించి తయారు చేస్తారు.
  • కోకోనట్ క్రాబ్ | Coconut Crab:  వనవాటు స్పెషల్ డిష్ ఇది. ఉడకబెట్టి లేదా రోస్ట్ చేసి వడ్డిస్తారు.
  • కసావా పుడ్డింగ్ |  Cassava Pudding: ఇది ఒక స్వీట్ డిష్. కర్ర పెండలం, పాలను మిక్స్ చేసి తయారు చేస్తారు

బేసిక్ పదాలు

వనవాటు వెళ్తే అక్కడ స్థానికంగా మాట్లాడే బిస్లామా భాషలో కొన్ని పదాలు మీకు తెలిస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంగ్లిష్, స్పానిష, ఫ్రెంచ్ మాట్లాడేవాళ్లు కూడా ఉంటారు.

  • హెల్లో : హాలో (Halo)
  • థ్యాంక్యూ : టాంక్యు టుమాస్ (Tankiu Tumas)
  • ఎంత : హామస్ (Hamas)
  • ఏంటి ? : వానెమ్ (Wanem)

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!