కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి (Kumaradhara Theertha Mukkoti) కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా యాత్రికులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి (Lord Venkateshwara) కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి కుమారధార తీర్థ ముక్కోటి కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది.
భక్తుల కోసం మంచినీటి సౌకర్యంతో పాటు, అన్నప్రసాద సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది . శుక్రవారం మార్చి14వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను కుమారధార తీర్థానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తారు.
ముఖ్యాంశాలు
గమనించాల్సిన విషయాలు| Kumaradhara Theertha Mukkoti Tips

కుమారధార తీర్థ ముక్కోటికి వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికుల కోసం సదుపాయాలు కల్పిస్తూనే కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తోంది.
- హృదయ సంబంధిత వ్యాధులు, అధిక బరువు, ఆస్తమా దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అనుమతి లేదు.
- దీంతో పాటు చిన్నపిల్లలు, వయో వృద్ధులను ఆటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు.
- భక్తులను గోగర్భం (Gogarbham) నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసి బస్సుల్లో వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు.
- యాత్రికులు (Travelers) గుమనించాల్సిన మరో విషయం ఏంటంటే వాహన రద్దీ నియత్రణ కోసం ప్రైవేటు వాహనాలను అనుమతించరు.
- యాత్రికులు భద్రత కోసం పాపవినాశనం నుంచి కుమారధార తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
- Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు | Special Arrangements By TTD

కుమారధార తీర్థ ముక్కోటికి వెళ్లే భక్తుల కోసం దారి పొడవునా మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. వీటిలో పాటు..
- పాపవినాశనం డ్యామ్ (Papavinashanam Dam) వద్ద ఉదయం 5 నుంచి పాలు, కాఫీ, ఉప్మా, పొంగలితో పాటు పులిహోరా, సాంబార్ అన్నం, పెరుగు అన్నం అందించనున్నారు.
- అయితే ఈ సమయంలో పైవేట్ సంస్థలు లేదా వ్యక్తులకు అన్నదానం చేసే అనుమతి ఇవ్వలేదు.
Kumaradhara Theertha Mukkoti : యాత్రికుల కోసం షెడ్స్, నిచ్చెనలు, మంచినీటి కొళాయిలను ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారుఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఆంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడిక్ సిబ్బందితో పాటు మందులను అందుబాటులో ఉంచనున్నారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.