ఎండల్లో ట్రావెల్ చేస్తున్నారా? ఇవి మిస్ అయితే ఇబ్బంది! : Summer Travel Tips Telugu
Summer Travel Tips Telugu : సమ్మర్ వెకేషన్ అంటటే స్కూల్ రోజుల నుంచి ఇప్పటి వరకు మనకి ఒక స్పెషల్ ఎమోషన్. ట్రావెల్ చేసేటప్పుడు బయట ఉన్న టెంపరేచర్ కంటే మన లోపల ఉన్న ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
కానీ ఈ సమ్మర్లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని చిన్న హ్యాబిట్స్ ఫాలో అయితే మన జర్నీ ఇబ్బంది లేకుండా రీఫ్రెష్‌గా ఉంటుంది. ఫస్ట్ టైమ్ లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసేవారికి ఈ చిన్న విషయాలు చాలా కంఫర్ట్‌ని ఇస్తాయి.
ఎండాకాలం ట్రావెల్ చేసేటప్పుడు మెయిన్ గోల్ వచ్చేని రిలాక్స్ అవ్వడం. సో షెడ్యూల్స్‌ని చాలా లైట్‌గా ఉంచండి. సన్‌లైట్ మనల్ని యాక్టీవ్‌గా ఉంచుతుంది. ఎవరూ లేని ప్రశాంతమైన చోట్ల కూర్చొని, నేచర్‌ని ఎంజాయ్ చేయడం ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. ప్రాపర్ హైడ్రేషన్ వల్ల మన ఎనర్జీ లెవల్ తగ్గకుండా ఉంటుంది.
ఎండల్లో ఎలాంటి ప్రదేశాలకు వెళ్లవచ్చు! | Summer Travel Tips Telugu
ఎండాకాలంలో వెళ్లడానికి హిల్ స్టేషన్ లేదా ఇండోర్ కల్చర్ స్పాట్స్ చాలా బాగుంటాయి. లోకల్ బొటానికల్ గార్డెన్స్‌లో ట్రీస్ మధ్య నడుస్తుంటే చల్లగా అనిపిస్తుంది. సాయంత్రం సమయంలో లేక్ సైడ్ పార్క్స్ లేదా సన్‌సెట్ పాయింట్స్ దగ్గర కూర్చొని నేచర్ బ్యూటిని అబ్జర్వ్ చేయవచ్చు. ఇండోర్‌లో ఉన్న ఆర్ట్ గ్యాలరీస్ అండ్ లోకల్ లైబ్రరీస్ మన మైండ్‌కి కొత్త ఆలోచనలు ఇస్తాయి.
- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Food to Eat
ఎండాకాలం లైట్ ఫుడ్ తీసుకునేటప్పుడు బాడీ యాక్టీవ్‌గా ఉంటుంది. ఫ్రెష్ సలాడ్స్ అండ్ సీజనల్ జ్యూసులు తాగుతుంటే రిఫ్రెష్మెంట్ బాగుంటుంది. కోకోనట్ వాటర్ లేదా బటర్‌మిల్క్ ఎనర్జీని ఇస్తాయి. లోకల్‌గా దొరికే పెరుగు అన్నం, లైట్ మీల్స్ తిన్నప్పుడు ట్రావెల్లో ఫాటీగ్ అనిపించదు.
ఎప్పుడు వెళ్లాలి ? | Best Time
మార్చి నుంచి జూన్ వరకు సమ్మర్ ట్రిప్‌కి అనుకూలం అని చెప్పవచ్చు. అయితే ఎండలు దంచేస్తున్న ప్రాంతాలకు మాత్రం అస్సలు ప్లాన్ చేయకండి.
ఉదయం 7 నుంచి 11 గంటల లోపు మీరు వెళ్లిన ప్రదేశాన్ని అన్వేషించండి. ఇలా చేయడం వల్ల వడగాలులు, తీవ్రమైన ఎండతాకిడి నుంచి తప్పించుకోవచ్చు. మధ్యాహ్నం సమయంలో మ్యూజియమ్స్ లేదా ప్రశాంతమైన కేఫ్స్‌లో గడపవచ్చు. లైట్ కాటన్ దుస్తులు, కంఫర్టబుల్ వాకింగ్ షూస్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్.
ఎండాకాలం ట్రిప్ అంటే కేవలం ప్రదేశాలు చూడటం మాత్రమే కాదు. మన ఙ్ఞాపకాలని భద్రపరుచుకోవడం. టోపీ, సన్‌గ్లాసెస్, మంచి సన్‌స్క్రీన్ తప్పనిసరిగా మీతో పాటు తీసుకెళ్లండి. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రయాణం సంతోషంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
