South India Travel : చిక్‌మగళూరు నుంచి అరకు వరకు – కూల్ ట్రావెల్ గైడ్
South India Travel : ఎండలు దంచేస్తున్న సమయంలో కూడా కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. అక్కడ గాలి మెల్లిగా వీస్తుంది. మనసు కూడా అదే రిథమ్‌లో నడవడం మొదలు పెడుతుంది.
సౌత్ ఇండియాలో కొన్ని హిల్ స్టేషన్స్‌లో లైఫ్ చాలా మెల్లిగా, చిన్న కథలా సాగుతుంది.
చిక్‌మగళూరు నుంచి వల్పరై వరకు ఈ ప్రదేశాలు వేడిలో కూడా ఒక చల్లని ప్రయాణంలా అనిపిస్తాయి.
ఇక్కడ వేడిని కాసేపు మర్చిపోవడం మాత్రమే కాదు, చల్లదనాన్ని కూడా ఆస్వాదించవచ్చు.గాలిలో చిల్నెస్, భూమిపై పచ్చదనం, మధ్య మధ్యలో మేఘాల నడక ఇవన్నీ కలిసి ఒక సైలెంట్ రిథమ్ క్రియేట్ చేస్తాయి.
చిక్‌మగళూరు | Chikmaglur
కర్ణాటకలోని చిక్మగళూరులో ఉదయవ వేళలో సమయంలో కాఫీ తోటల మధ్య రోజు మొదలవుతుంది. మిస్ట్ మధ్య నుంచి ప్రకాశించే వెలుగు, స్లోప్స్ మీద పడిన నీడలు ఇవన్నీ కలిసి ఒక సాఫ్ట్‌గా ఉండే దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి.
స్థానిక ముల్లయనగిరి పర్వత రేఖలు చూసినప్పుడు భూమిపై ఒక జెంటిల్ ఎలివేషన్‌లా అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Horsley Hills : ఆంధ్రా ఊటీకి క్యూ కడుతున్న తెలుగు ప్రయాణికులు
వల్పరై | Valparai
తమిళనాడులోని వల్పరైలో రోడ్డుపై నడవడం అనేది టీ ఎస్టేట్స్ మధ్య ఒక ఎండ్లెస్ గ్రీన్ కారిడార్‌లో నడవడంలా ఉంటుంది.
చుట్టూ ఉన్న స్లోప్స్ మీద ప్లాంటేషన్ లైన్స్ ఒక రిథమ్‌లో కనిపిస్తాయి. మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న జలపాతాలు, రోడ్డు పక్కన నడిచే సమయంలో వీచే గాలి… ఒక నిశ్చలమైన దృశ్యాన్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ ప్రతీ టర్న్‌లో ఒక వ్యాలీ కనిపిస్తుంది. ప్రతీ వ్యాలీలో ఒక సైలెంట్ స్పేస్ ఉంటుంది.
ఎర్కాడ్ | Yercaud
తమిళనాడులోని ఎర్కాడ్లో లేక్ పక్కనే సమయం గడపడం ఒక ఎవర్ గ్రీన్ మెమోరీని చూసిన అనుభూతికి కల్పిస్తుంది. మార్నింగ్‌లో ఫాగ్ మధ్య లేక్ సర్ఫేస్ కనిపించడం, సాయంత్రం సమయంలో లైట్ రిఫ్లెక్షన్స్ మారడం ఇవన్నీ ఒక సాఫ్ట్ విజువల్ ఫ్లో క్రియేట్ చేస్తాయి. లేక్ చుట్టూ ఉన్న రహదారుల్లో నడుస్తూ ప్రశాంతమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.
కుద్రేముఖ్ | Kudremukh Trek
కర్ణాటక కుద్రేముఖ్‌లో పర్వతాలు చూస్తే భూమిపై హరిత తరంగాల్లా కనిపిస్తాయి. స్లోప్స్ స్మూత్‌గా, లోయలు లోతుగా ఉంటాయి. అక్కడి నడిచే దారుల్లో ప్రతి అడుగులో ఒక ఫ్రెష్ గాలి తాకుతుంది. దూరంలో క్లౌడ్స్ స్లోప్స్ మీద షాడోలా పడుతుంటే భూమి మీద ఒక స్లో మూమెంట్‌లా అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : ఈ 30 యాక్టివిటీస్ చేయకపోతే మనాలి వెళ్లినట్టే కాదు
అరకు లోయ | Araku Valley
అరకు లోయలో ప్రయాణం అంటే కాఫీ తోటల మధ్య నడిచే కథల మధ్య వెళ్లడంలా ఉంటుంది. రైలు మార్గంలో వెళ్లినప్పుడు టన్నెల్స్ నుంచి బయటికి వచ్చిన ప్రతీసారి కొత్త దృశ్యం కనిపిస్తుంది.
వ్యాలీ మధ్య గ్రామాలు, పక్కన హిల్స్, మధ్య నడిచే గాలి ఇవన్నీ కలిసి ఒక మధురమైన అనుభూతిని అందిస్తాయి. కాఫీ అరోమా గాలిలో కలిసినప్పుడు ప్రతి మూమెంట్ ఇంకా గుర్తుగా నిలిచిపోతుంది.
ఎలా వెళ్లాలి? | How To Travel
హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశాలకు ప్రయాణం అనేది చాలా సులభంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలకు బెంగుళూరు వరకు ప్లైట్‌లో చేరడం, ఇంకొన్ని ప్రదేశాలను చేరుకునేందుకు కోయంబత్తూరు వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో వెళ్లినప్పుడు ప్రతి టర్న్‌లో ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది.
రోడ్డు పక్కనే చెట్లు, మధ్య మధ్యలో కనిపించే వ్యాలీస్, గాలిలో మారిపోయే ఉష్ణోగ్రతలు ఇవన్నీ ప్రయాణాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.
ఎక్కడ ఉండాలి? | Where To Stay
ఈ హిల్ స్టేషన్స్‌లో పెద్ద బిల్డింగ్స్ కన్నా చిన్న హోమ్ స్టేస్‌లు, కాటేజీలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ స్టే చేయడం అంటే గాలి మధ్య కాఫీ సువాసనలు పీల్చుతూ , ప్రకృతి పలికించే స్వరాలనున వింటూ సమయం గడపడం లాంటిదే.
ఇక్కడ ప్రతి మూమెంట్ మెల్లిగా నడుస్తుంది. సాయంత్రం అయితే స్లోప్స్‌పై వెలుగు తగ్గుతూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.
ఏం చూడాలి? | Places to Visit
ఉదయం వేళలో మిస్ట్ మధ్య నడవడం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది.
గాలిలో మాయిశ్చర్ టచ్, చెట్ల మధ్య నడిచే వెలుగు ఇవన్నీ కలిసి ఒక నిశ్చలమైన దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి.
మధ్యాహ్నంలో టీ ఎస్టేట్స్ మధ్య తిరగడం, ఫారెస్ట్ ఎడ్జెస్‌లో కూర్చుని గాలిని ఎంజాయ్ చేయడం ఈ చిన్న మూమెంట్స్ ప్రయాణంలో గుర్తుగా నిలిచిపోతాయి.
సాయంత్రం అయితే సన్‌సెట్ చూడటం, ఆకాశం రంగులు మారడం చూస్తూ సమయం గడపడం ఒక సైలెంట్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంటుంది.
ఏం తినాలి? | Food To Eat
ఈ ప్రదేశాలలో భోజనం కడుపుతో పాటు మనసును సంతోషపెట్టేలా ఉంటుంది. లోకల్ కర్రీస్, కొబ్బరితో చేసిన వంటలు, తాజా మసాలాలతో చేసిన వంటకాలుఇవన్నీ కలిసి భోజనాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.
కాఫీ ప్లాంటేషన్ దగ్గర దొరికే ఫ్రెష్ కాఫీని సిప్ చేస్తే ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది.
చల్లని వాతావరణంలో హాట్ ఫుడ్ తినడం ఒక సౌఖ్యమైన ఫీలింగ్‌ను ఇస్తుంది.
యాక్టివిటీస్ | Activities
మార్నింగ్ సమయంలో సూర్యోదయం చూడటం, పొగమంచులో నడవడం, అడవుల నుంచి వచ్చే శబ్దాలను వినడం, సైట్ సీయింగ్, స్థానికులతో మాట్లాడటం, లోకల్ మార్కెట్లో తిరగడం, హిల్ స్లోప్స్‌లో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం ఇవన్నీ ఈ ప్రదేశాలలో చేయాల్సిన యాక్టివిటీస్‌లో కొన్ని మాత్రమే.
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.
- మరిన్ని మీడియా పబ్లిషింగ్ రికార్డుల కోసం క్లిక్ చేయండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
