భూమికి ఏదైనా జరిగితే… ఇదే ఆధారం! : Svalbard Seed Vault
Svalbard Seed Vault : మన భూమిపై పలు రకాల మొక్కలు, పంటలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా జరిగితే, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని జాతుల పంటలు, మొక్కలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్లీ వాటిని పండించేందుకు, ఆహార పంటలు, మొక్కల వైవిధ్యాన్ని రక్షించేందుకు నార్వేలోని స్వాల్బార్డ్ అనే ప్రదేశంలో ఈ విత్తనాల బ్యాంకును ఏర్పాటు చేశారు.
Svalbard Seed Vault : మన భూమిపై పలు రకాల మొక్కలు, పంటలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా జరిగితే, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని జాతుల పంటలు, మొక్కలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్లీ వాటిని పండించేందుకు, ఆహార పంటలు, మొక్కల వైవిధ్యాన్ని రక్షించేందుకు నార్వేలోని స్వాల్బార్డ్ అనే ప్రదేశంలో ఈ విత్తనాల బ్యాంకును ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోని వేలాది పంటల విత్తనాలను బ్యాకప్‌గా భద్రపరిచే ప్రత్యేకమైన గ్లోబల్ సీడ్ వాల్ట్ ఇది. నార్వే దేశంలోని స్వాల్బార్డ్ అనే ఆర్కిపెలాగోలోని స్పిట్స్‌బెర్గెన్ ద్వీపంలో ఈ సీడ్ వాల్ట్ ఉంది.
ఈ వాల్ట్‌ను ఆర్కిటిక్ మంచు, కొండల మధ్యలో, ఒక పర్వతం లోపల నిర్మించారు. అందుకే ఇది బయట నుంచి చూస్తే మంచు మధ్య దాగి ఉన్న పెద్ద లాకర్లా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Margherita Hut : 15,000 అడుగుల ఎత్తులో ఒంటరి హోటల్
సీడ్ వాల్ట్ లక్ష్యం ఏంటి?
నిజానికి ప్రపంచంలో అనేక దేశాల్లో విత్తనాల బ్యాంకులు ఉన్నాయి. మన దేశంలో కూడా విత్తనాలను భవిష్యత్తు తరాల కోసం సంరక్షించే సంస్థలు ఉన్నాయి. అలాగే స్వాల్బార్డ్ అనేది సీడ్ బ్యాంక్ కాదు.. ఇది వాల్ట్.

వివిధ దేశాలు, పరిశోధనా సంస్థలు, జీన్ బ్యాంకుల నుంచి విత్తనాలను ఇక్కడ భద్రపరుస్తారు. ఒక దేశంలో ప్రకృతి విపత్తు సంభవించినా, యుద్ధం కారణంగా పంటలు లేదా విత్తనాల సేకరణలు నాశనమైనా, భవిష్యత్తులో ఈ విత్తనాలను తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Forbidden Places In world : ఈ 5 ప్రదేశాలకు మీరు ఎప్పటికీ వెళ్లలేరు!
దీనిని పర్వతం లోపల నిర్మించారు. అది ఒక నేచురల్ ఫ్రీజర్‌గా పని చేస్తుంది. పర్వతం లోపల లోతుగా ఉండటం వల్ల బయట ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల నుంచి ఈ విత్తనాలకు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని సహజమైన చల్లని వాతావరణం కూడా ఈ సంరక్షణకు సహాయపడుతుంది.
స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్‌ను 2008లో ప్రారంభించారు. దీని నిర్మాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పర్వతం లోపలికి వెళ్లే ఒక పొడవైన టన్నెల్ ద్వారా సీడ్ స్టోరేజ్ చాంబర్లకు చేరుకోవచ్చు. అక్కడ మన షాపింగ్ మాల్లో ఉన్నట్టు ర్యాక్స్ ఉంటాయి. ఒక దేశానికి ర్యాక్‌లో కొంత ప్లేస్ ఇస్తారు. ఆ ప్లేస్‌లో ఆ దేశం పంపించే విత్తనాలను సేవ్ చేస్తారు.
ఇది సాధారణ సీడ్ స్టోరేజ్ సెంటర్ కాదు. భవిష్యత్ తరాల కోసం ప్రపంచంలోని వ్యవసాయ వైవిధ్యాన్ని కాపాడే ఒక గ్లోబల్ బ్యాకప్ సిస్టమ్. అందుకే దీనిని కొన్నిసార్లు “డూమ్స్‌డే వాల్ట్” అని కూడా పిలుస్తారు.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
