భూటాన్‌ను ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ (The Land of The Thunder Dragon) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశాల్లో ఒకటి. ప్రపంచ రాజకీయాలతో సంబంధం లేకుండా తమ పౌరులకు మెరుగైన జీవన విధానాన్ని అందిస్తుంది ఈ దేశం (Exploring Bhutan in 2025). దీంతో పాటు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహించే దేశాల్లో భూటాన్ ముందు వరుసలో ఉంటుంది.
ముఖ్యాంశాలు
ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్

భూటాన్‌ను ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ ( The Land of The Thunder Dragon) అని కూడా పిలుస్తారు. జీవితాన్ని డబ్బులతో కాకుండా డబ్బులతో పోల్చుతూ స్థూల జాతీయ సంతోషాన్ని లెక్కిస్తుంది భూాాటాన్. ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశాల్లో ఒకటి. ప్రపంచ రాజకీయాలతో సంబంధం లేకుండా తమ పౌరులకు మెరుగైన జీవన విధానాన్ని అందిస్తుంది ఈ దేశం. దీంతో పాటు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహించే దేశాల్లో భూటాన్ ముందు వరుసలో ఉంటుంది.
భూటాన్ రాజ్యం గురించి | Where Is Bhutan Kingdom

భూటాన్ అనేది హిమాలయాల (Himalayas) మధ్య కొలువై ఉన్న రాజ్యం. ఈ దేశం వెళ్తే అద్భుతమైన ల్యాండ్‌స్కేప్, చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలు పౌరాణిక వారసత్వాన్ని గురించి మీరు తెలుసుకోవచ్చు.
- భారత్, టిబెట్ (Tibet) మధ్యలో ఉన్న భూటాన్ అనేది ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతమైన పర్యాటక అనుభవాన్ని కోరుకునేవారికి ఒక మంచి ఛాయిస్ అవుతుంది.
ఈ పోస్టులో మీరు 2025 లో భూటాన్ ప్లాన్ చేస్తే పాటించాల్సిన టిప్స్ అందిస్తాము. దీంతో పాటు భూటాన్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు (Must Visit Places in Bhutan), తినాల్సిన ఫుడ్, హైదరాబాద్ నుంచి భూటాన్ ఎలా వెళ్లాలో తెలిపే సమాచారం, ఎప్పుడు వెళ్లాలో తెలిపే సూచనలు, అక్కడి చరిత్ర, అక్కడి భాషలో కొన్ని బేసిక్ వర్డ్స్, ఆచారాలు, సంప్రదాయాలు, ఆసక్తికరమైన విషయాలు మీతో పంచుకుంటాము.
భూటాన్ ఎందుకు వెళ్లాలి ? | Why to Visit Bhutan ?
భూటాన్ అనేది ప్రకృతి ప్రేమికులకు స్వర్గంతో సమానమైన దేశం. ఇక్కడి బౌద్దారామాలు (Monasteries) , అద్భుతమైన నిర్మాణాలు తప్పకుండా ప్రయాణికులకు నచ్చుతాయి. ఇక్కడ డబ్బు కన్నా సంతోషంగా ఉండేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తారు.
- దీనిని గ్రాస్ నేషనల్ హ్యాప్పినెస్ (Gross National Happiness) అంటారు. తమ దేశ వారసత్వాన్ని ప్రపంచం ముందు ఉంచడంతో పాటు వాటికి భంగం కలగకుండా ఉండేందుకు బాధ్యాతయుతమైన పర్యాటకాన్ని (Sustainable Tourism) ను ప్రోత్సాహిస్తోంది భూటాన్.
- ఇక్కడ అన్వేషించేందుకు చాలా ఉన్నాయి. ఇక్కడి అద్భుతమైన వేడుకలు, పండుగలు ఇవన్నీ చూస్తే భూటాన్ మళ్లీ మళ్లీ వెళ్లాలని కోరుకుంటారు.
హైదరాబాద్ నుంచి భూటాన్ ఎలా వెళ్లాలి ? | Hyderabad To Bhutan Journey

హైదరాబాద్ నుంచి భూటాన్‌కు డైరక్టు విమాన సర్వీసులు లేవు. అయితే దీనర్థం మీరు వెళ్లలేరు అని కాదు. ఈ రూట్లో వెళ్లవచ్చు:
- ఢిల్లీ లేదా కలకత్తా వెళ్లండి | Delhi To Bhutan: భూటాన్ వెళ్లాలి అనుకుంటే మీరు ముందుగా ఢిల్లీ లేదా కలకత్తా వెళ్లాల్సి ఉంటుంది. మీ ప్రయాణ సమయాన్ని బట్టి ట్రైన్ లేదా ఫ్లైట్‌లో వెళ్లవచ్చు.
- పారోకు వెళ్లండి : Fly to Paro : మీరు ఢిల్లీ నుంచి లేదా కలకత్తా నుంచి భూటాన్‌కు వెళ్లవచ్చు. ఈ ప్రాంతాల నుంచి డ్రుక్ ఎయిర్ (Drukair), భూటాన్ ఎయిర్‌లైన్స్ (Bhutan Airlines) విమానంలో పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి (Paro International Airport) కు చేరుకోవచ్చు. ఇది భూటాన్‌లో ఉన్న ఏకైకా విమానాశ్రయం.
విసా సంబంధిత అంశాలు | Bhutan Visa and Entry Requirements
భారత్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ తప్పా మిగితా అన్ని దేశాల ప్రయాణికులకు భూటాన్ (Traveling to Bhutan) వెళ్లేందకు వీసా అవసరం అవుతుంది. భారతీయులకు వీసా అవసరం లేదు.
- ఇతరులకు వీసా ఫీజు వచ్చేసి 40 డాలర్ల వరకు అవుతుంది. వీసాను భూటాన్ టూర్ ఆపరేటరే మీకు వచ్చేలా చేస్తాడు.
- భారతీయులకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అయితే భూటాన్ వెళ్లాక అక్కడ మీ పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
భూటాన్ ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To Visit Bhutan

భూటాన్ అనేది ఎప్పుడు వెళ్లినా అందంగా ఉంటుంది. అందులో డౌట్ లేదు. అయితే మార్చి నుంచి మే మధ్యలో, అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ సమయంలో చాలా మంది పర్యాటకులు భూటాన్ వెళ్లడానికి ఇష్డపడతారు.
- వసంతకాలం (Spring) : మార్చి నుంచి మే మధ్యలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందమైన పువ్వులను మీరు చూడవచ్చు.
- శరదృతువు (Autumn) : ఈ సమయంలో భూటాన్ అందాలను మీరు 4కే కళ్లతో చూడవచ్చు. దూరదూరం వరకు నీలి ఆకాశం, ఎటు చూసినా పచ్చదనంతో భూటాన్ కళకళలాడుతుంది. అందుకే చాలా మంది ఈ సమయంలో ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు.
చూడాల్సిన ప్రదేశాలు | Places to Visit in Bhutan

Exploring Bhutan in 2025 : మ్యాపులో చూస్తే భూటాన్ మీకు చాలా చిన్నదేశంగా కనిపిస్తుంది. కానీ ఈ చిన్న దేశంలో ఎన్నో అందమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి:
- పారో | Paro : పారోలో మీరు పారో తక్సాంగ్ (Tiger’s Next Monastery), ఉగ్యెన్ పెలి ప్యాలెస్, పెల్రీ గోఎంబా మోనాస్టరీ సందర్శించవచ్చు. భూటానీస్ చరిత్ర, వారసత్వం (Bhutan History) గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం పారో జోంగ్, టా జోంగ్ వెళ్లాల్సిందే.
- థింఫు | Thimphu : భూటాన్ దేశ రాజధాని ఇది. ఇక్కడ మీరు మెమోరియల్ చోర్టెన్, బుద్ధా డోర్డెమ్నా, క్లాక్ టవర్ స్క్వేర్ విజిట్ చేయవచ్చు.
- పునాఖా | Punakha : ఇక్కడ పునాఖా అనే ప్రాంతంలో మేల్ (Pho Chhu River), ఫీమేల్ (Mo Chhu River) నదుల సంగమాన్ని చూడవచ్చు. దీంతో పాటు ఇక్కడ పునాఖా సస్పెన్షన్ బ్రిడ్జి కూడా విజిట్ చేయవచ్చు.
- బుంగాంత్ లోయ | Bumthang Valley : భూటాల్‌లోని ఈ మారుమూల గ్రామంలో మీరు అందమైన ఆలయాలు, భూటాన్ సంప్రదాయం గురించి తెలుసుకోవచ్చు.
భుటాన్‌లో ట్రెక్కింగ్ | Trekking in Bhutan

అద్భుతమైన ట్రెక్కింగ్ అనుభవం కోసం చాలా మంది భూటాన్ వెళ్తుంటారు. ఇక్కడి మంచుపర్వతాలు, పచ్చని లోయల్లో, గ్లేషియర్ నదుల్లో ట్రెక్కింగ్ చేయడం అనేది మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది
- డ్రుక్ పాత్ ట్రెక్ : ఇది 8 రోజుల ట్రెక్
- జోమల్హారీ ట్రెక్: ఈ ట్రెక్ కొద్దిగా ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కానీ పైసా వసూల్ అవుతుంది.
- స్నోమెన్ ట్రెక్ : ఇది ఒక నెలపాటు జరిగే ట్రెక్. కేవలం బాగా అనుభవం ఉన్న ట్రెక్కర్స్ మాత్రమే వెళ్తుంటారు.
- ట్రాన్స్ భూటాన్ ట్రెయిల్ : దేశ వ్యాప్తంగా పలు ట్రెక్కింగ్ ప్లేసెస్‌ను ట్రెక్కర్స్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.
భూటాన్‌లో పుడ్ | What To Eat in Bhutan
భూటాన్ ఫుడ్ అనేది మసాలా దట్టించిన స్పైసీ పుడ్ అవడం వల్ల భారతీయులకు బాగా నచ్చుతుంది. మరో విషయం ఏంటంటే మనకు ఇక్కడ కొండ ప్రాంతాల్లో అడుగడుగునా మ్యాగీ పాయింట్స్ ఉన్నట్టు భూటాన్‌లో ఉండవు. ఇక ట్రై చేయాల్సిన ఫుడ్ వచ్చేసి:
- ఎమా డాషి | Ema Datshi : ఇది భూటాన్ నేషనల్ డిష్. దీనిని మిర్చీ, చీజ్‌తో తయారు చేస్తారు.
- మోమోస్ : ఇక్కడ మీరు టిబెటన్ స్టైల్ మోమోస్ ఎంజాయ్ చేయవచ్చు.
- రెడ్ రైస్ | Red Rice : భూటాన్ వాసులు రెగ్యులర్‌గా తీసుకునే భోజనం ఇది. ఫ్లేవర్ డిఫరెంట్‌గా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
భూటాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు | Few Facts About Bhutan

- రాజధాని : థింపూ
- కరెన్సీ : ఉన్‌గుంల్ట్రమ్ (Ngultrum) భారతీయ కరెన్సీతో సమానం. మీరు భారతీయ కరెన్సీతో అక్కడ కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్ చేసే అవసరం లేదు.
- జిల్లాలు : భూటాన్‌లో మొత్తం 20 జిల్లాలు ఉంటాయి
- భాషలు : జోంగ్‌కా (Dzongkha) అనేది ఇక్కడి అధికారిక భాష. దీంతో పాటు చాలా మంది హిందీ, ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు.
- మతాలు : 75 శాతం మంది బుద్దిస్టులు, 25 శాతం మంది హిందువులు.
- భూటాన్ అనేది ప్రపంచంలోనే సురక్షితమైన దేశాల్లో ఒకటి. ఇక్కడ మహిళలు కూడా నిర్భయంగా సోలో ట్రావెల్ చేయవచ్చు.
- భూటాన్‌లో 90 శాతం వస్తువులు భారత దేశం నుంచే ఎగుమతి అవుతాయి. వాటికి జీఎస్టీ ఉండదు కాబట్టి చాలా భారతీయ వస్తువులు భారత్ కన్నా భూాటాన్‌లోని తక్కువ ధరకు లభిస్తాయి.
- భూటాన్‌లో పర్యాటకులు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించకూడదు. కేవలం ప్రైవేట్ ట్యాక్సీ లేదా టూరిస్టు వాహనంలోనే ప్రయాణించాలి. ఖచ్చితంగా మినిమం 3 స్టార్ హోటల్లో ఉండాలి.
- ఇక్కడ దుకాణాలు, నివాసాలను కలపతో కూడా నిర్మిస్తుంటారు.
- ప్రపంచంలో జీరో కార్బన్ (Zero Carbon Country) లక్ష్యాన్ని సాధించిన 8 దేశాల్లో భూటాన్ కూడా ఒకటి.
- భూటాన్‌లో ఇండియా లాంటి సాకెట్స్ ఉంటాయి. సో మీరు యూనివర్సల్ అడాప్టర్ తీసుకెళ్లే అవసరం లేదు.
- భూటాన్‌లో పాన్ అంటే కిల్లీ కూడా చాలా మంది ఇష్టంగా తింటుంటారు.
కొన్ని పదాలు | Bhutan Language Tips

భూటాన్ వెళ్తే అక్కడ మీరు మాట్లాడేవిధంగా జోంగ్‌ఖా భాషలోని బేసిక్ పదాలు మీ కోసం :
- కుజు జాంగ్‌పా లా : హెల్లో
- కడించే లా : థ్యాంక్యూ
- గడే బే జూయ్ : బాయ్
- మేంచి : టేస్టీగా ఉంది
ఈ పనులు చేయకండి | Don’ts In Bhutan
- భూటాన్ వెళ్లినప్పుడు అక్కడి మతం గురించి కానీ, అక్కడి రాజ వంశం, రాజు గురించి తప్పుగా మాట్లాడకండి. అలాగే బౌద్ధ మతం ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించండి.
- డ్రెస్సింగ్ : హుందాగా కనిపించే దుస్తువులు ధరించండి. మరీ ముఖ్యంగా పవిత్ర స్థలాలను సందర్శించే సమయంలో దుస్తువుల విషయంలో కేర్ తీసుకోండి.
- పవిత్ర వస్తువులను అస్సలు టచ్ చేయకండి. కళాకారుల అనుమతి లేకుండా కళాఖండాలను టచ్ చేయకండి.
- నదుల్లో, సరస్సుల్లో బట్టలు ఉతకడం, స్నానం చేయడం చేయకండి. ఎందుకంటే నీటిని ఇక్కడ పవిత్రంగా చూస్తారు.
- పవిత్ర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆలయం లోపలి భాగంలోకి వెళ్లే ముందు టోపీలు, గొడుగులు, కళ్లద్దాలు తీసివేయండి.
బాధ్యతాయుతమైన పర్యాటకం | Bhutan Sustainable Travel

భూటాన్ తమ దేశంలోకి వచ్చే పర్యాటకులను ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా తమ దేశాలన్ని సందర్శించాలని కోరుకుంటోంది.
- హై వాల్యూ, లో ఇంపాక్ట్ టూరిజం (High Value Low Impact Tourism) విధానంలో భాగంగా సస్టెయినెబుల్ టూరిజాన్ని ప్రోత్సాహిస్తుంది.
- అందుకే పర్యాటకుల నుంచి ప్రతీ రోజు సస్టెయినెబుల్ టూరిజం ఫీజును వసూలు చేస్తారు.
- దీంతో పాటు మీరు ఇక్కడ టూరిస్టు గైడును తప్పకుండా మాట్లాడుకోవాలి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.