Watermelon Capital : ప్రపంచ పుచ్చకాయల రాజధాని ఎక్కడుందో తెలుసా?
Watermelon Capital : ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు అక్కడ లభించే వస్తువులు, ఉత్పత్తుల వల్ల పాపులారిటీని సంపాదించుంటాయి. అయితే ప్రపంచ పుచ్చకాయల రాజధాని గురించి తెలుసా?
సమ్మర్ అంటే మనకి ఫస్ట్ గుర్తుకు వచ్చేదే ఈ ఫ్రూట్. ఎంత చల్లగా ఉంటుందో అంతే హైడ్రేట్ చేస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కానీ ఈ టేస్టీ ఫ్రూట్కి ఒక స్పెషల్ సిటీ ఉంది అని చాలా మందికి తెలియదు.
అమెరికాలో ఉన్న కార్డెలె (Cordele) అనే చిన్న సిటీని ప్రపంచ వాటర్మెలన్ క్యాపిటల్ (Watermelon Capital of the World) అని పిలుస్తారు. ఈ ప్లేస్ జార్జియా స్టేట్లో ఉంటుంది. అక్కడ క్లైమేట్ చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. మట్టి కూడా సాండీగా ఉండటం వల్ల క్రాప్స్ బాగా వస్తాయి.
Perfect method to cut fresh watermelon in farm pic.twitter.com/nbnKKTCzhc
— ViralPulse (@ViralPulse1419) April 19, 2026
కార్డెలేకి ఈ టైటిల్ ఎలా వచ్చిందంటే? అక్కడ భారీ సంఖ్యలో పుచ్చకాయలను పండిస్తారు. ఎంతగా అంటే అమెరికాలోనే అది అతిపెద్ద వాటర్మెలన్ హబ్ అయింది. ప్రతి సంవత్సరం లక్షలాది టన్నుల పుచ్చకాయలను ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు, కెనడాకు కూడా ఎగుమతి చేస్తారు.
అక్కడి రైతులు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వినియోగించి సీడ్లెస్ వాటర్మెలన్ను పండిస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 1949 నుంచి Watermelon Days Festival అని ఒక ఫెస్టివల్ కూడా జరుగుతోంది. ఈ ఫెస్టివల్లో స్థానికులు, టూరిస్టులు అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తారు. గేమ్స్, ఫుడ్ స్టాల్స్, ఈవెంట్స్ ఇవన్నీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి.
ప్రపంచ స్థాయిలో చూస్తే చైనా అనేది పుచ్చకాయలను అత్యధికంగా పండించే దేశంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ ఒక సిటీ లెవెల్లో మాత్రం కార్డెలే టాప్ ప్లేస్లో ఉంటుంది. అందుకే దానిని అధికారికంగా Watermelon Capital of the World అని పిలుస్తారు.
సో మీరు నెక్ట్స్ టైమ్ పుచ్చకాయను తింటే మాత్రం అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందో అని ఆలోచించండి. మేబి అది కార్డెలె నుండి వచ్చిందేమో ఎవరికి తెలుసు?!
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
