వీకెండ్‌లో మైండ్ రీసెట్ కావాలా? ఆంధ్రాలో ఈ ప్రదేశాలు ట్రై చేయండి | Andhra Pradesh Travel

Andhra Pradesh Travel : చలికాలం అంటే ఏ పర్యాటక ప్రాంతమైనా బాగా రద్దీగా ఉంటుంది. కానీ మీకు రష్‌గా ఉన్న ప్రాంతాలు కాకుండా ప్రశాంతంగా, స్లోగా, మీనింగ్‌ఫుల్ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో చాలా అండర్‌రేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి.

ఈ ప్రదేశాల్లో రష్ తక్కువ, నేచర్ ఎక్కువ. వీకెండ్ ట్రిప్‌లో మిమ్మల్ని పూర్తిగా రిఫ్రెష్ చేస్తాయనే నమ్మకం కూడా ఎక్కువే.

1. తలకోన జలపాతం | Talakona Waterfalls (Chittoor)

తలకోన వెళ్తే ఒక జలపాతాన్ని మాత్రమే కాదు, ఒక ఫారెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. చిక్కని పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, కంప్లీట్ నిశ్శబ్దం వల్ల సిటీ స్ట్రెస్ ఇట్టే తగ్గిపోతుంది. కమర్షియల్ టూరిజం తక్కువ కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు.

హైదరాబాద్ నుంచి సుమారు 550 కిమీ, విజయవాడ నుంచి 430 కిమీ దూరంలో తలకోన ఉంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే పైసావసూల్ ట్రిప్ (peaceful weekend destinations Andhra Pradesh) అవుతుంది. రాళ్లపై జారే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి గ్రిప్ ఉన్న ఫుట్‌వేర్ ధరించడం ఉత్తమం.

2. గండికోట | Gandikota (Kadapa District)

గండికోట వెళ్తే మనం ఇంకో గ్రహంలో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓపెన్ స్కై, లోతైన కేన్యాన్ వ్యూస్, చారిత్రాత్మక కోట – ఇవన్నీ కలసి ఈ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక ప్రదేశంగా మార్చాయి.
ఇక్కడ పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండటంతో ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు. నచ్చినన్ని ఫోటోలు తీసుకోవచ్చు.

హైదరాబాద్ నుంచి సుమారు 390 కిమీ, విజయవాడ నుంచి 300 కిమీ దూరంలో ఉంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో బెస్ట్. ఫోర్ట్ ఏరియాలో షాపులు ఉండవు కాబట్టి మంచినీటి బాటిల్, స్నాక్స్ మీతో పాటు తీసుకెళ్లండి.

3.మారేడుమిల్లి | Maredumilli (East Godavari)

ప్రశాంతమైన ఫారెస్ట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి మారేడుమిల్లి బాగా సెట్ అవుతుంది. సన్నని రోడ్లు ఉన్నా, ప్రయాణం మాత్రం బోర్ లేకుండా సాగుతుంది.
దారి మధ్యలో కనిపించే చిన్న జలధారలు, గిరిజన గ్రామాలు, పచ్చదనం మీ స్ట్రెస్‌ను ఇట్టే దూరం చేస్తాయి.

హైదరాబాద్ నుంచి 500 కిమీ, విజయవాడ నుంచి 190 కిమీ దూరం. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు బెస్ట్ టైమ్. ఇక్కడ నెట్‌వర్క్ వీక్‌గా ఉంటుంది కాబట్టి ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని వెళ్లడం మంచిది.

4.యాగంటి | Yaganti (Kurnool District)

యాగంటి చాలా ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది. కొండల మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్తే కొత్త ఎనర్జీని ఫీల్ అవ్వొచ్చు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే ఆధ్యాత్మిక అనుభూతితో పాటు నేచర్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎండ నుంచి తప్పించుకోవడానికి ఉదయం వేళల్లో లేదా సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లడం ఉత్తమం.

5.హార్స్‌లీ హిల్స్ | Horsley Hills (Chittoor District)

హార్స్‌లీ హిల్స్ ఒక కమర్షియల్ హిల్ స్టేషన్ కాదు. జీవితంలో మిస్ అవుతున్న ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. చల్లని వాతావరణం, ఓపెన్ స్కై, అందమైన వ్యూస్ ఇవే ఇక్కడి హైలైట్స్. నవంబర్ నుంచి ఫిబ్రవరి బెస్ట్ టైమ్. రాత్రి ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోతాయి కాబట్టి లైట్ జాకెట్ క్యారీ చేయడం మంచిది.

6.అనంతగిరి హిల్స్ | Ananthagiri Hills (Araku Side)

తెలుగు రాష్ట్రాల్లో అరకు ఎంత పాపులర్ అయినా, దానికి దగ్గరలో ఉన్న అనంతగిరి హిల్స్‌లో ఇంకా రష్ తక్కువే. ఇదే ప్లస్ పాయింట్. ఈ ప్రదేశం కూడా రద్దీగా మారే ముందు ఒకసారి వెళ్లడం మంచిది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. వర్షాకాలంలో రోడ్లు జారే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.

Andhra Pradesh Travel
Andhra Pradesh Travel | Ananthagiri hills

8.ఓర్వకల్లు రాక్ గార్డెన్ | Oravakallu Rock Garden (Kurnool)

ఓర్వకల్లు రాక్ గార్డెన్ సాధారణ టూరిస్ట్ స్పాట్‌లా ఉండదు. ఇక్కడి ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు, నిశ్శబ్దం కలిసి ఒకరోజులో మైండ్ రీసెట్ చేసేలా చేస్తాయి. సూర్యాస్తమయం సమయంలో ఈ ప్రదేశం ప్రత్యేకంగా కనిపిస్తుంది. సంవత్సరం పొడవునా వెళ్లవచ్చు కానీ మధ్యాహ్నం వేళలను ఎవాయిడ్ చేయడం బెస్ట్.

తక్కువ మంది వెళ్లే ప్రదేశాలు అన్నీ కాస్ట్‌లీగా ఉండవు. వాటిని వెతకడానికి మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి. అప్పుడే కదా మైండ్ అండ్ పర్స్ రెండూ రీసెట్ అవుతాయి.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!