Biryani History : పర్షియా నుంచి హైదరాబాద్ వరకు బిర్యానీ జర్నీ ..
Biryani History : బిర్యానీ.. ఈ పేరు వింటేనే మనసులో సువాసన, మసాలా అండ్ దమ్ బిర్యానీ ఘుమఘుమలు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్ అనగానే చార్మినార్‌తో పాటు బిర్యానీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ ఈ అద్భుతమైన వంటకం ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌లోనే పుట్టిందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇక్కడే లభిస్తుంది.
Biryani History : బిర్యానీ.. ఈ పేరు వింటేనే మనసులో సువాసన, మసాలా అండ్ దమ్ బిర్యానీ ఘుమఘుమలు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్ అనగానే చార్మినార్‌తో పాటు బిర్యానీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ ఈ అద్భుతమైన వంటకం ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌లోనే పుట్టిందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇక్కడే లభిస్తుంది.
పర్షియాలో మొదలు | Birth Place Of Biryani
చరిత్రకారుల ప్రకారం బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలో ఉన్న బిరియన్ (Birian) అంటే వేయించడం లేదా ఫ్రై చేయడం అనే పదంతో పాటు, బిరింజ్ (Birinj) అంటే బియ్యం అనే రెండు పదాల నుంచి వచ్చిందని అంటారు. ఈ వంటకం పుట్టుక మాత్రం సుమారు 11 నుంచి 14వ శతాబ్దం మధ్య కాలంలో ఇరాన్, అంటే ఒకప్పటి పర్షియాలో జరిగిందని చెబుతారు.

అక్కడ బియ్యం, మాంసం అండ్ సుగంధ ద్రవ్యాలను కలిపి తయారు చేసే వంటకాలు తరువాత బిర్యానీ రూపం తీసుకున్నాయి.
భారత్‌లో ఎంట్రీ ఎప్పుడు అంటే | Biryani Entry In India
1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ తనతో పాటు పర్షియన్ సంస్కృతి, భాష, వంటకాలను భారతదేశానికి తీసుకువచ్చాడు. తరువాత హుమాయున్, అక్బర్ కాలంలో రాజమందిరాల్లోని కిచెన్‌లో బిర్యానీ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది.
- ఇది కూడా చదవండి : Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
అప్పట్లో బిర్యానీ ప్రధానంగా రాజులు, సైనిక ముఖ్య అధికారులు, రాజభవనాల్లో పని చేసే ముఖ్య సిబ్బందికి మాత్రమే వడ్డించేవారు.
ముంతాజ్ మహల్ కథ | Folklores of Biryani
బిర్యానీకి సంబంధించిన మరో కథ బాగా పాపులర్ అయింది. 17వ శతాబ్దంలో మహారాణి ముంతాజ్ మహల్ సైనికులు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలతో నిండిన భోజనం తయారు చేయమని రాజ కుక్స్‌కు సూచించిందట. అప్పుడు మాంసం, బియ్యం, నెయ్యి, అనేక సుగంధ ద్రవ్యాలను ఒకటే పాత్రలో వండగా అది బిర్యానీగా పాపులర్ అయిందని చెబుతారు.
- ఇది కూడా చదవండి : క్లీనర్ నుంచి భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ పెట్టేవరకు కేఫ్ నీలోఫర్ ఫౌండర్ కథ | Hitech City Cafe Niloufer
అయితే ఈ కథకు బలమైన చారిత్రాత్మక ఆధారాలు లేవు. కానీ ఇది బిర్యానీ గురించి అత్యంత ప్రసిద్ధమైన కథల్లో ఒకటి.
హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంట్రీ | Hyderabad Dum Biryani
1724లో మొదటి అసఫ్ జాహ్ హైదరాబాద్‌లో అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించిన అనంతరం పర్షియన్, మొఘల్ వంటకాలతో పాటు తెలుగు వంటకాల్లో రకరకాల ఎక్స్పరిమెంట్స్ ప్రారంభమయ్యాయి.
నిజాం కాలంలో దమ్ పద్ధతిలో బిర్యానీ తయారు చేయడం బాగా పాపులరైంది. పెద్ద హండీలో బియ్యం, మాంసం, మసాలాలను పొరలుగా పేర్చి, పిండితో మూసి, తక్కువ మంటపై నెమ్మదిగా ఉడికించే పద్ధతినే దమ్ అని పిలుస్తారు.
ఈ పద్ధతి వల్లే హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
భారతదేశంలో ఉన్న బిర్యానీ వెరైటీలు | Biryani Verieties Of India
భారతదేశంలో ప్రతి ప్రాంతంలో ఒకో వెరైటీ బిర్యానీ లభిస్తుంది. స్థానికులు తమ అభిరుచి, మసాలాలు, వంట దినుసులు, కల్చర్‌ను బట్టి బిర్యానీని కస్టమైజ్ చేసుకున్నారు.
హైదరాబాద్‌లో బిర్యానీని దమ్ బిర్యానీ అంటారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో అవధి బిర్యానీ, కలకత్తాలో బంగాళదుంపతో చేసే కలకత్తా బిర్యానీ, తమిళనాడులోని ఆంబూరులో అంబూర్ బిర్యానీ, డిండిగల్‌లో డిండిగల్ బిర్యానీ, కేరళలోని మలబార్ బిర్యానీ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కశ్మీరీ బిర్యానీ పాపులర్ కాగా, మురాదాబాద్ బిర్యానీ… ఇలా అంతగా పాపులర్ కాకపోయినా ఇంకా ఎన్నో బిర్యానీ వెరైటీలు ఉన్నాయి.
ప్రతి బిర్యానీలో మసాలా, బియ్యం, మాంసంతో తమ తమ వంట విధానాల్లో ప్రత్యేక బిర్యానీని తయారు చేస్తారు. ప్రతి బిర్యానీ వెరైటీకి ఒక కథ, చరిత్ర ఉంటుంది.
- ఇది కూడా చదవండి :ప్రపంచంలోనే అత్యంత వికారమైన 5 ఫుడ్ ఐటమ్స్
హైదరాబాద్‌ను ఎందుకు బిర్యానీ రాజధాని అంటారు?
హైదరాబాద్‌లో నిజాం సంస్కృతి, పర్షియన్ ప్రభావం, తెలుగు రుచులు, స్థానిక సుగంధ ద్రవ్యాల కలయిక బిర్యానీకి ఒక కొత్త గుర్తింపు ఇచ్చింది.
ఈ రోజు హైదరాబాద్‌లో వందల సంఖ్యలో హోటళ్లలో బిర్యానీ తయారు చేస్తున్నారు. దేశంలోనే కాకుండా అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాల్లో కూడా హైదరాబాద్ బిర్యానీ అనే పేరు ఒక బ్రాండ్‌గా మారింది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
