హైదరాబాద్‌లో త్వరలో మరో జూపార్క్ అందుబాటులోకి (Hyderabad To Get Second Zoo) రానుంది. ఈ కొత్త జూ పార్కులో ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొచ్చే అరుదైన జంతువులు సందడి చేయనున్నాయి. ఈ ప్రతిష్మాత్మక ప్రాజెక్టును ఫ్యూచర్ సిటీలోని ముచ్చర్లలో చేపట్టనున్నారు.
ఈ జూ పార్క్ రాకతో నగరంలో వన్యప్రాణి పర్యాటకానికి (wildlife tourism) ఊతం లభించనుంది. ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికా , ఆస్ట్రేలియా నుంచి వచ్చే అరుదైన జాతికి చెందిన జంతువులకు ఇది కేంద్రం కానుంది.
ముఖ్యాంశాలు
200 ఎకరాలు-విదేశీ జంతుజీవాలు | Hyderabad To Get Second Zoo
నగరంలో రెండవ జూపార్క్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో (Future City Hyderabad) 200 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం బహాదూర్‌పురలో ఉన్న జూపార్కులో అరుదైన జంతువులతో పాటు కొన్ని విదేశీ జంతువులు కూడా ఉన్నాయి. కొత్త జూ పార్కులో…
జూ పార్క్ డిజైన్, నిర్వహణ, ఆపరేషన్‌లో ప్రైవేటు సంస్థలు కీలక పాత్రను పోషించనున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ జూపార్కులో మన దేశానికి చెందిన జంతువులను కాకుండా విదేశాలకు చెందిన జంతువులను తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో ఏర్పాటు చేయనున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో | International Standards
కొత్త జంతు ప్రదర్శనశాలను సింగాపూర్‌లోని జూ పార్కు (Singapore Zoo Park) నుంచి ప్రేరణ పొంది ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ లెవల్లో దీనిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
వినోదంతో పాటు విఙ్ఞానాన్ని అందించే విధంగా, ప్రపంచ వన్యప్రాణి వైవిధ్యాన్ని చాటి చెప్పేలా ఉంటుంది కొత్త జూ పార్క్.
- ఇది కూడా చదవండి : Nehru Zoological Park లో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్…షెడ్యూల్ అండ్ రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే
నెహ్రూ జాపార్కును తరలిస్తారా ? | Will Nehru Zoo Park be Relocated?
నెహ్రూ జూపార్కును మరో చోటికి తరలించి అక్కడ కొన్ని ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు కొన్ని కథనాలు వచ్చాయి. అయితే కఠినమైన నియమాలు, సంక్లిష్టమైన ఆమోద ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఈ ఆలోచనను పక్కన పెట్టారు.
- నెహ్రూ జంతు ప్రదర్శనశాలను 1963 లో ఏర్పాటు చేశారు.
- ఇందులో 194 జాతులకు చెందిన 2,200 జంతువులు ఉన్నాయి.
- భవిష్యత్తులో కూడా ఈ జూ పార్కు మీర్ ఆలం ట్యాంక్ (Mir Alam Tank) ప్రాంతంలోనే ఉంటుంది. దీనికి తరలించబోరు అని సమాచారం.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.