హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) అప్డేట్ అవుతోంది. సందర్శకులకు అధునాతన సదుపాయాలు కల్పిస్తూనే చక్కని అనుభవాన్ని కల్పించే దిశలో వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా పులితో సెల్ఫీ తీసుకునే అవకాశం (Selfie With Tigers) కూడా కల్పించనుంది. పూర్తి వివరాలు…
ముఖ్యాంశాలు
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ జూపార్క్‌లో (Hyderabad Zoo Park) ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా రైనో ఎన్‌క్లోజర్ వద్ద డైనింగ్ ఏర్పాటు చేయడం, సఫారీ సెక్షన్‌లో మరిన్ని జంతువులను జోడించడం వంటి మార్పులు చేసింది. తాజాగా పులులతో సెల్ఫీ దిగేందుకు ఒక డెడికేటెడ్ సెల్ఫీ పాయింట్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది..
- ఇది కూడా చదవండి : Nehru Zoological Park లో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్…షెడ్యూల్ అండ్ రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే
- ఈ సెల్ఫీ పాయింట్ వద్దకు వెళ్లి గ్లాసు అవతల ఉండే పులితో కలిసి సెల్ఫీలు దిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఇలాంటి సెల్ఫీ పాయింట్స్ చాలా పాపులారిటీని సంపాదించాయి.
- ఇకపై హైదరాబాదీ ప్రజలతో పాటు నగరాన్ని సందర్శించే పర్యాటకులు కూడా ఈ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.
కొత్త జంతువుల సందడి | New Animals In Hyderabad Zoo Park
జూపార్కులో కొత్త జంతువులు సందడి చేసున్నాయి. వాటి రాకతో సందర్శకులు తాకిిడి పెరిగింది. ఇందులో చింకారా (Indian Gazelle), స్వాంప్ డీర్, చీర్ పీజంట్, సీమీస్ మొసలి వంటి కొత్త జంతువులు ఉన్నాయి. మన దేశంలోని వివిధ జూపార్కుల నుంచి ఎక్స్‌ఛేంజ్‌లో భాగంగా ఇవి హైదరాబాద్‌కు చేరుకున్నాయి.
- వీటిలో పాటు కొత్తగా రెండు స్లోథ్ బేర్స్ (Sloth Bears-ఎలుగు బంట్లు) ను నందవన్ జూ పార్క్, నయా రాయ్‌పూర్ జూపార్కు నుంచి తీసుకువచ్చారు. ఈ ఎలుగుబంట్ల రాకతో సఫారీలో ఉన్న స్లోథ్ బేర్ల సంఖ్య ఆరుకు చేరుకుంటుంది.
జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా..| Selfie With Tigers
దేశంలోని 17 జూ పార్కుల నుంచి, జంతు సంరక్షణ కేంద్రాల నుంచి వివిధ జంతువులను హైదరాబాద్ జూపార్కుకు తీసుకువస్తున్నారు. గతంలో ఈ జంతుమార్పిడి విధానంలో భాగంగా హరియాణాలోని రోహ్తక్ నుంచి మగ ఆసియా సింహాన్ని (Asian Lion) తీసుకువచ్చారు. అలాగే తెల్లపులికి బదులు ఆడ పులిని తీసుకువచ్చారు.
ఈ వారం జూ పార్కులో కొత్త జంతువులను విశాఖలోని గాంధి జూలాజికల్ పార్క్ (Gandhi Zoological Park) నుంచి హైదరాబాద్ జూపార్కుకు తీసుకురానున్నారు.
- అందులో బబూన్, అడవి కుక్క, ఆకుపచ్చ ఇగువానా, నల్ల హంస, బార్న్ గుడ్లగూబ వంటివి ఉన్నాయి.
- ఇక హరియాణాలోని జటాయు వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి రాబందులను కూడా తీసురానున్నారు అని సమాచారం.
సెల్ఫీ పాయింట్ | Tiger Selfie Point Hyderabad Zoo
ఇక సందర్శకుల్లో ఉత్సాహాన్ని పులులతో సెల్పీ తీసుకునే విధంగా సెల్ఫీ పాయింట్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ సెల్ఫీ పాయింట్‌ను అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయనున్నారు. పులిని అద్దంలోని అత్యంత సమీపంలోనే వీక్షిస్తూ దానితో సెల్పీ తీసుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న వన్య ప్రాణి ప్రేమికులు పులితో సెల్ఫీ తీసుకునేందుకు క్యూ కట్టే అవకాశం ఉంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.