షిప్ ఎవరి కోసం ఆగదు: First Time Cruise లో 90% మంది చేసే 5 పెద్ద తప్పులు!
First Time Cruise ఎక్కుతున్నారా? హైదరాబాద్ నుంచి లక్షద్వీప్, సింగపూర్ క్రూయిజ్ కి వెళ్లే ముందు డాక్యుమెంట్స్, క్యాబిన్, ప్యాకింగ్, ఫుడ్, సీ సిక్నెస్ గురించి ఈ 5 విషయాలు తెలిస్తే మీ ట్రిప్ లైఫ్ టైం మెమరీ అవుతుంది.
ఎక్కడ చూసినా నీళ్లు. ఆ నీళ్ల మధ్యలో మెల్లగా కదులుతున్న ఒక పెద్ద నగరం. రాత్రి డెక్ మీద నిలబడితే వీచే చల్లని గాలి, పైన జిగేలుమని మెరిసే నక్షత్రాలు, కింద కనుచూపుమేర లేని అంతులేని సముద్రం. ఇదే క్రూయిజ్ మజా.
చాలా మంది క్రూయిజ్ అంటే భారీ ఖర్చు, డబ్బున్నవాళ్లు మాత్రమే చేసే ట్రిప్ అనుకుంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా లక్షద్వీప్, సింగపూర్, దుబాయ్ క్రూయిజ్ లకు వెళ్లడం చాలా కామన్ అయిపోయింది.
అయితే ఫస్ట్ టైమ్ క్రూయిజ్ ప్రయాణానికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది కంగారు పడతారు. అలాంటి వారికి ఈ సింపుల్ గైడ్ బాగా ఉపయోగపడుతుంది.
- ఇది కూడా చదవండి : Mont Saint Michel : సముద్రం మధ్యలో కలల కోటలా కనిపించే ప్రాచీన ద్వీపం
1. డాక్యుమెంట్స్, క్యాబిన్ ముందే ప్లాన్ చేయండి
క్రూయిజ్ కి పాస్‌పోర్ట్ తప్పనిసరి. ముంబై నుంచి లక్షద్వీప్ వెళ్లినా కావాలి. ఇంటర్నేషనల్ క్రూయిజ్ అయితే వీసా, ఇన్సూరెన్స్ ముందే తీసుకోండి. బోర్డింగ్ పాస్, టికెట్ ప్రింట్ ఒక ఫైల్లో పెట్టుకోండి.
క్యాబిన్ ఎంపిక చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బాల్కనీ లేని ఇంటీరియర్ రూమ్‌లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కనీసం ఓషన్ వ్యూ ఉండేలా చూసుకోండి. మీకు వామిటింగ్ ప్రాబ్లమ్ ఉంటే షిప్ మధ్యలో, మిడిల్ డెక్‌లో రూమ్ తీసుకోండి. అక్కడ కదలికల ప్రభావం తక్కువగా ఉంటుంది.
బోర్డింగ్ రోజు తొందరగా వెళ్లండి. షిప్ 3 గంటలకు కదులుతుందంటే 11 గంటలకే పోర్ట్‌కి వెళితే లైన్ తక్కువగా ఉంటుంది. అందరికన్నా ముందే షిప్ మొత్తం తిరిగి చూడొచ్చు.
2. ప్యాకింగ్ స్మార్ట్ గా చేయండి
షిప్ లో ప్రతి సాయంత్రం ఫార్మల్ నైట్ ఉంటుంది. ఒక మంచి షర్ట్, బ్లేజర్ లేదా డ్రెస్ తప్పనిసరి. మిగిలినవి క్యాజువల్. స్విమ్ సూట్, స్లిప్పర్స్, సన్ స్క్రీన్, క్యాప్ మర్చిపోవద్దు. షిప్ లో లాండ్రీ చాలా కాస్ట్లీ, రోజుకి ఒక డ్రెస్ లెక్కన పెట్టుకోండి. చిన్న మెడిసిన్ కిట్, వామిటింగ్ టాబ్లెట్స్, అల్లం క్యాండీ, బ్యాండ్ ఎయిడ్ లు పెట్టుకోవడం చాలా ముఖ్యం.
3. అంతా ఫ్రీ కాదు
క్రూయిజ్ లో అంతా ఫ్రీ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. బుఫే, మెయిన్ డైనింగ్ హాల్ మాత్రమే ఫ్రీ. స్పెషాలిటీ రెస్టారెంట్లు, స్టార్‌బక్స్, ప్యాకేజ్డ్ వాటర్ కి డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వెజిటేరియన్ అయితే బుకింగ్ టైం లోనే ఆ విషయం చెప్పండి. వాళ్లు సెపరేట్‌గా ప్రిపేర్ చేస్తారు.
షిప్ లో క్యాష్ వాడరు. బోర్డింగ్ లో మీ క్రెడిట్ కార్డు ఇస్తే ఒక క్రూయిజ్ కార్డు ఇస్తారు. అన్ని కొనుగోళ్లు దానితోనే. రోజూ మొబైల్ యాప్ లో బిల్ ఎంత అయిందో చెక్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే చివరి రోజు బిల్ చూసి షాక్ అవుతారు.
4. సీ సిక్ నెస్, ఇంటర్నెట్ కి భయపడొద్దు
ఈ పెద్ద షిప్ లు పెద్దగా ఊగవు. మొదటి రోజు కొంచెం తేడాగా అనిపిస్తే ఓపెన్ డెక్ లోకి వెళ్లి విశాలమైన సముద్రాన్ని చూడండి. నిమ్మకాయ వాసనను పీల్చండి. అల్లం టీ తాగండి. రిసెప్షన్ లో అడిగితే టాబ్లెట్ ఫ్రీ గా ఇస్తారు.
షిప్ లో వైఫై రోజుకి 20 డాలర్లు అంటే సుమారు రూ.2000 వరకు ఉండవచ్చు. స్పీడ్ కూడా తక్కువగా ఉంటుంది. పోర్ట్ లో దిగినప్పుడు లోకల్ సిమ్ కొని నెట్ వాడుకోవడం బెటర్. అలాగే రోజుకి 15 డాలర్లు టిప్ ఆటోమేటిక్ గా బిల్లో యాడ్ అవుతుంది, ఇది తప్పదు.
5. యాక్టివిటీస్, టైం మిస్ అవ్వొద్దు
రోజూ మీ రూమ్ కి ఒక న్యూస్ పేపర్ వస్తుంది, దానిలో ఆ రోజు షో టైమింగ్స్, పూల్ పార్టీ, కామెడీ షోలు ఉంటాయి. అవన్నీ ఫ్రీ కాబట్టి మిస్ అవ్వొద్దు. జాకుజీ, జిమ్, వాక్ ట్రాక్ ఇలా ఫ్రీగా వచ్చిన వాటిని తప్పకుండా వాడుకోండి.
పోర్ట్ లో దిగినప్పుడు షిప్ వాళ్ల టూర్ తీసుకుంటే సేఫ్. అయితే బయట టూర్ తీసుకుంటే చీప్. ఎలా వెళ్లినా కానీ షిప్ టైం కి తిరిగి రావాలి. షిప్ ఎవరి కోసం వెయిట్ చేయదు.
క్రూయిజ్ అంటే ఫోటోలతో గ్యాలరీని నింపేయడం అనుకుంటారు చాలా మంది. కానీ ఫీలింగ్‌తో, మెమోరీస్తో మనసును నింపేయడం అని గుర్తుంచుకుని ఈ జర్నీ స్టార్ట్ చేయండి.
డెక్ పై నుంచి సూర్యోదయాన్ని చూడటం, రాత్రి సమయంలో నక్షత్రాలను వీక్షించడం ఇలాంటి చిన్న చిన్ని సరదాలను అస్సలు మిస్ అవ్వకండి. చక్కగా ప్లాన్ చేసుకుంటే మీ ఫస్ట్ క్రూయిజ్ జీవితాంతం గుర్తుండిపోతుంది.
▶️ వీడియో చూడండి : థాయ్‌లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
ఇది చదవండి : థాయ్‌లాండ్ ట్రావెల్ గైడ్
