తిరుమల, తిరుపతికి వచ్చే భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను (TTD WhatsApp Feedback) లాంచ్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విధానం వల్ల భక్తుల నుంచి ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడం వాటిని స్ట్రీమ్‌లైన్ చేయడం సులభతరం అవనుంది.
ముఖ్యాంశాలు
ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ వల్ల పారదర్శకత పెరుగుతుంది అని, మెరుగైన సేవలు అందించేందుకు ఈ విధానం సాయపడుతుంది అని , భక్తుల ఆధ్మాత్మిక యాత్ర సంతృప్తిగా సాగుతుంది అని టీటీడీ (TTD) ఆశిస్తోంది.
- ఇది కూడా చదవండి : కైలాష్ మానసరోవర యాత్ర ఎలా వెళ్లాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఎన్ని .. | Kailash Mansarovar Yatra 2025

ఈ సిస్టమ్ ఎలా పని చేస్తుంది ? | How It Works
తిరుమలకు వచ్చే తీర్థయాత్రికులు ఇకపై తమ అభిప్రాయాలను క్యూార్ కోడ్ స్కాన్ చేసి తెలపవచ్చు. తిరుమల- తిరుపతి పరిసరాల్లో ఉన్న సదుపాయాల గురించి ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఇక ఈ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే…
- క్యూర్ కోడ్ స్కాన్ (TTD WhatsApp Feedback) చేసిన తరువాత వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే ఫిర్యాదును, అభిప్రాయాన్ని నమోదు చేయవచ్చు.

- పేరు : ముందుగా భక్తులు తమ పేరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- కేటగిరి : మీ ఫిర్యాదు ఏంటి అని తెలిపే ముందు అది ఏ కేటగిరికి చెందినదో ఎంచుకోవాలి. ఇందులో అన్న ప్రసాదం, పరిశుభ్రత, కల్యాణ కట్ట, లడ్డూ ప్రసాదం, లగేజ్, రూమ్స్, క్యూ లైన్, లేదా పూర్తి అనుభవం అనే కేటగిరీలను ఎంచుకోవచ్చు.
- ఫీడ్ బ్యాక్ మీడియం : భక్తులు వీడియోను అప్లోడ్ చేయవచ్చు, లేదా టెక్ట్స్ మెసేజ్ పంపవచ్చు.
- సర్వీస్ రేటింగ్ : టీటీడి సేవలను ఇకపై రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందులో గుడ్, యావరేజ్/ మెరుగు అవ్వవచ్చు, లేదా బాగోలేదు అనే ఆప్షన్స్ ఉంటాయి.
- కామెంట్ : మరింత సమాచారం అందిందుకు ఒక వీడియో అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా 600 పదాల్లో మీ ఫీడ్‌బ్యాక్‌ను రాయవచ్చు.
- ఇది కూడా చదవండి : Amarnath Yatra 2025 : అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం…మీ అధ్యాత్మిక యాత్రను ఇలా ప్లాన్ చేసుకోండి !
మీ ఫిర్యాదు లేదా ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ అయిన తరువాత భక్తులకు “మీ ఫిర్యాదును విజయవంతంగా రికార్డు అయింది. మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌కు ధన్యవాదాలు” అనే మెసేజ్ వస్తుంది.
సేవల ప్రమాణం పెంచే దిశలో | TTDs Commitment For Improvement
తిరుమల, తిరుపతికి వచ్చే భక్తుల నుంచి స్వీకరించే ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి వాటిపై సరైన చర్యలు తీసుకోనుంది టీటీడి (Tirumala Tirupati Devasthanams). తద్వారా సేవా ప్రమాణాలు పెంచాలని భావిస్తోంది. భవిష్యత్తులో భక్తలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది అని ఆశిస్తోంది.
ఈ వార్త అప్డేట్ అవుతోంది…
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.