ఇండియాలో తొలి లా టోమాటినా ఫెస్టివల్ హైదారాబాద్‌లో – Hyderabad La Tomatina Festival

షేర్ చేయండి

యూరోప్‌లోని స్పెయిన్‌లో జరిగే లా టోమాటినా ఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదిక (Hyderabad La Tomatina Festival) కానుంది. 2025 మే 11వ తేదీన ఎక్స్‌పీరియం ఇకో పార్కులో జరగనున్న ఈ వేడుకకు అంతర్జాతీయంగా మంచి క్రేజ్ ఉంది. ఈ వేడుకలో సంగీతం, ఉత్సాహంతో పాటు టోమాటోలను విసురుతూ సంబరాలు చేసుకునే అవకాశం లభిస్తుంది.

లా టోమాటినా అంటే ఏంటి ? | What Is La Tomatina

లా టోమాటినా అనేది స్పెయిన్‌కు చెందిన ఒక పండగ. దీనిని టోమా టెర్రా (Toma Terra) అని కూడా పిలుస్తారు. ఇది మన హోలీ పండగలాగే ఉంటుంది. అయితే ఇందులో రంగులుకు బదులుగా టోమాటోలను వినియోగిస్తారు. ఒక రకంగా ఇది టోమాటోల పండగ. 

ఈవెంట్‌లో హైలైట్స్ ఇవే | Hyderabad La Tomatina Festival

  • టోమాటోల యుద్ధం : టోమాటినో ఫెస్టివల్‌ కోసం తక్కువ క్వాలిటి ఉన్న వేలాది టోమాటోలను సేకరిస్తారు. సుమారు గంట పాటు ఈ ఫుడ్ ఫైట్  (Food Fiight) అంటే టోమాటోలతో సరదా ఫైట్ జరుగుతుంది. 
  • వినోదం : వినోదం కోసం లైవ్ మ్యూజిక్, ప్రత్యేక ఫన్ జోన్లతో పాటు ఫ్లీ మార్కెట్లు కూడా ఉంటాయి.మొత్తానికి ఈ ఫెస్టివల్ మోడ్‌ను కాపాడే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
  • రీసైకిల్ : టోమాటిలో ఫెస్టివల్‌లో వినియోగించిన వాటిని తరువాత రీసైకిల్ చేస్తారు.వాటిని ఎక్స్‌పీరియం ఎకో పార్కులోని మొక్కలకు ఎరువుగా వినియోగిస్తారు
  • ఇది కూడా చదవండి :  Selfie With Tiger : పులితో సెల్ఫీ దిగుతారా ? అయితే హైదరాబాద్ జూకి వచ్చేయండి !

గుర్తుంచుకోవాల్సిన విషయాలు | Venue and Ticket Price

  • వేడుక జరిగే తేదీ : 2025 మే 11
  • వేదిక : ఎక్స్‌పీరియం ఇకో పార్క్ (Experium Eco Park)
  • టికెట్ల ధరలు : రూ.399 ( బేకిస్ ఎంట్రీ) నుంచి రూ.3,499 (ప్రీమియం యాక్సెస్ ) మధ్యలో
  • కనీస వయసు : ఈ వేడుకలో పాల్గొనే సభ్యుల వయసు విషయంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ ప్రకటించలేదు. అయితే కనీసం 18 ఏళ్లు ఉండాలి…లేదా పెద్దవాళ్లతో పాటు కలిసి పాల్గొనాలి.
  • ఏం ధరించాలి : హోలి రోజు ఎలాంటి బట్టలు వేసుకుంటామో దాదాపు అలాంటివే వేసుకోవాలి. అంతకన్నా బెటర్ అనుకుంటే మీ ఫ్యాషన్‌సెన్సుకే వదిలేస్తున్నాం (Hyderabad La Tomatina Festival). కాకపోతే టమోటో రంగు అంటుకోవడం మాత్రం ఖాయం.

ఈ నియమాలు తెలుసా? | La Tomatina Rules

  • ఈవెంట్ సమయం : స్పెయిన్‌లోని లా టోమాటినా (Spain La Tomatina) ఫెస్టివల్‌లో జరిగే విధంగానే ఈ ఫెస్టివల్ కూడా సుమారు గంటపాటు జరిగే అవకాశం ఉంది.
  • ఏం చేయాలి ? : ఈ వేడుకలో భాగంగా మీరు ఉన్న ప్రాంతంలో ఎక్కడ చూసినా టోమాటోలే కనిపిస్తాయి. అందులో కొన్ని టోమాటోలు తీసుకుని బాగా పిలకాల్సి ఉంటుంది.
  • సేఫ్టీ : మెత్తబడిన తరువాతే వాటిని మీరు అనుకున్న వ్యక్తి వైపు విసరాలి. అయితే ముఖంపై గురి చూసి కొట్టరాదు.
  • ఇవి నిషేధం : ఈ వేడుకల్లో ఆల్కహాల్ తీసుకోవడం నిషేధం. దీంతో పాటు ప్రమాదకరమైన వస్తువులను తీసుకురాకూడదు.
  • గౌరవం : ఈ వేడుకలో పాల్గొనే సభ్యులను ఇబ్బంది కలగించకూడదు. తప్పుగా ప్రవర్తించే వారిని నిర్వాహకులు వేడుక జరిగే ప్రాంత నుంచి బయటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
Latest Vlog : హరిద్వార్‌లోని అతిపవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. 

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!