క్రియేటివ్‌గా ఆలోచించిన డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా ? అయితే భారతీయ రైల్వే మీలాంటి వారి కోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు నెక్ట్స్ జెనరేషన్ డిజిటల్ క్లాక్ డిజైన్ (Digital Clock Design Contest) చేసిన వారికి రూ.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ముఖ్యాంశాలు
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో స్డాండర్డ్ టైమింగ్‌ను మెయింటేన్ చేసేందుకు ఇలా ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది రైల్వే (Indian Railways). ఇందులో డిజైనర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఎవరైనా తమ డిజైన్లను రైల్వే శాఖకు సబ్మిట్ చేయవచ్చు
ఈ కాంటెస్ట్ వివరాలు | Content Overview
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్వర్క్‌లో (Indian Railway Network) సరికొత్త డిజిటల్ క్లాక్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది. రైల్వే శాఖకు హాల్ మార్కుగా నిలిచే విధంగా వినూత్నమైన డిజైన్‌తో, పూర్తిగా, చక్కగా పని చేసే విధంగా ఈ డిజైన్ ఉండాలని కోరకుంటోంది రైల్వేశాఖ. అందుకే ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీ మొత్తం మూడు విభాగాలుగా జరగనుంది.
- ప్రొఫెషన్స్
- కాలేజీ / యూనివర్సిటీ విద్యార్థులు
- స్కూలు విద్యార్థులు (12వ తరగతి వరకు)

ఈ విషయాలు గుర్తుంచుకోండి
అభ్యర్థులు పలు రకాలు డిజైన్లను రైల్వే శాఖకు సబ్మిట్ చేయవచ్చు. డిజైన్‌తో పాటు ఆ డిజైన్‌కు సంబంధించిన కాన్పెప్టును వివరిస్తూ ఒక నోట్ కూడా రాయాల్సి ఉంటుంది. అంటే డిజైన్‌కు O(Digital Clock Design Contest) ప్రేరణ ఎక్కడి నుంచి లభించింది, దానీ థీమ్ ఏంటి వంటి విషయాలు అందులో వివరించాల్సి ఉంటుంది.
- అన్ని డిజైన్లు పూర్తిగా ఒరిజినల్ అయి ఉండాలి
- హై రిజల్యూషన్‌లో ఉండాలి.
- వీటినై వాటర్మార్క్కానీ లోగోలు కానీ ఉండరాదు.
- దీంతో పాటు డిజైన్ పూర్తిగా ఒరిజినల్ అని తెలుపుతూ ఒరిజినాలిటీ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది.
- భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి | 10 ఆసక్తికరమైన విషయాలు | New Pamban Railway Bridge
బహుమతితో పాటు గుర్తింపు | Prizes, Recognition
డిజిటల్ క్లాక్ డిజైన్ చేసేవారి కోసం భారతీయ రైల్వే కొన్ని సూచనలు జారీ చేసింది:
- అభ్యర్థులు తమ డిజైన్లను 2025 మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో పంపించాల్సి ఉంటుంది.
- పాఠశాల విద్యార్థులు తమ స్కూలు ఐడీ కార్డ్ అప్లోడ్ చేయాలి.
- కాలేజీ విద్యార్థులు తమ ఎన్రోల్‌మెంట్ ప్రూఫ్‌ను అప్లోడ్ చేయాలి.
- వీరి మినహా ఇతర అభ్యర్థులను ప్రొఫెషనల్స్‌గా పరిగణిస్తారు.
- ఈ డిజిటల్ క్లాక్ డిజైన్లు ఎలాంటి కాపీ రైట్‌ను, మేధోసంపత్తి హక్కులను (Intellectual Property Rights) ను ఉల్లంఘించరాదు.
ఎవరికి పంపించాలి ? | Mail Id For Railway Digital Clock Designing
తమ డిజైన్లను పూర్తి చేసిన అభ్యర్థులు పూర్తి వివరాలు, పైన వివరించిన అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది.
మెయిన్ ఐడీ : contest.pr@rb.railnet.gov.in
ఈ వార్త అప్డేట్ అవుతోంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.