మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 9 ప్రదేశాలు బెస్ట్ | South Indian Monsoon Hill Stations
South Indian Monsoon Hill Stations : వర్షం అంటే కేవలం నేలంతా తడవడం మాత్రమే కాదు… కొన్ని ప్రదేశాలు తన అందాన్ని చూపించే కాలం కూడా. దక్షిణ భారత దేశంలో ఉన్న కొన్ని పర్వతాలు, పట్టణాలు వర్షాకాలం వస్తే చాలు మరింత అందంగా మారిపోతాయి. ప్రతీ మలుపు ఒక కొత్త చిత్రంలా అనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాలకు చుట్టుపక్కనే కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉన్న పర్వత ప్రాంతాల్లో మాన్సూన్ ట్రిప్ అనేది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈ సీజన్లో ఈ హిల్ టౌన్స్‌లో గాలి, మబ్బులు, పచ్చని అడవులు కలిసి ఒక మధురమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ తొమ్మిది ప్రదేశాల్లో ప్రతి ఒక్క ప్రాంతం చిరునవ్వుతో ప్రయాణికులను ఆహ్వానిస్తుంది.
మబ్బుల్లో మధురమైన కూర్గ్, చిక్‌మగళూరు
కర్ణాటకలో ఉన్న కూర్గ్ (Coorg), చిక్‌మగళూరు (Chikamagluru) వర్షాకాలంలో కాఫీ సుగంధంతో మరింతగా అలరిస్తాయి. ప్రతీ ఉదయం మబ్బులు కాఫీ తోటల మధ్య నిలిచి ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న జలధారలు, అడవి మార్గాలు, కొండల మధ్య పడిన చినుకులు అన్నీ కలిసి ఒక సినిమా ఫ్రేమ్‌లా ఉంటాయి.
ఇక్కడ నడిచే ప్రతీ అడుగు ప్రకృతితో మాట్లాడినట్టు ఉంటుంది. కాఫీ ఎస్టేట్స్ (Coffee Estates) మధ్య వాకింగ్, చిన్న చిన్న జలపాతాల వద్ద సమయం గడపడం, స్థానిక గ్రామాల్లో ప్రజల జీవితాన్ని దగ్గరి నుంచి చూడటం అనేది ఈ ప్రయాణంలో సహజంగా కలిగే అనుభవాలుగా మిగిలిపోతాయి.
నీలగిరి అందాలు.. | Nilgiri Mountains
తమిళనాడులో (TamilNadu) నీలగిరి పర్వతాల మధ్య ఉండే ఊటీ (Ooty), కూనూరు (Coonoor) ఎప్పుడూ అందంగా ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఈ అందాలు డబుల్ అవుతాయి. టీ గార్డెన్స్‌పై పడిన మబ్బులు, టాయ్ ట్రెయిన్ శబ్దం, యూకలిప్టస్ వాసన కలిసి ఒక నాస్టాల్జిక్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి.

ప్రతీ రోడ్డు కర్వ్ దగ్గర కొత్త వ్యాలీ (South Indian Valleys) కనిపిస్తుంది. చిన్న రైల్వే స్టేషన్స్, కాలనియల్ బిల్డింగ్స్, టీ ప్లాంటేషన్స్ మధ్య గడిపే సమయం ప్రయాణాన్ని స్లోగా ఆస్వాదించే అవకాశం ఇస్తుంది.
కేరళ పచ్చదనం | Monsoon Destinations
కేరళ అందాలు చూడాలి అనుకుంటే మున్నార్ (Munnar) లేదా వయనాడ్ (wayanad) వెళ్తే చాలు. ఇందులో ఏ ప్రాంతానికి వెళ్లినా కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ (Gods Own Country) అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది.
మున్నార్ టీ గార్డెన్స్ వర్షంలో పచ్చని వెల్వెట్ బ్లాంకెట్లా కనిపిస్తాయి. వాయనాడ్ అడవుల్లో మబ్బులు దిగివచ్చి చెట్ల మధ్య ఆటలాడుతున్నట్టు ఉంటాయి.
స్థానికుల జీవితం ఇక్కడ ప్రకృతి రిథమ్‌కి తగ్గట్టు ఉంటుంది. ప్లాంటేషన్ గ్రామాలు, చిన్న మార్కెట్లు, స్పైస్ ప్లాంటేషన్స్, వర్షంలో తడిసిన రహదారులు అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ పర్వత శోభ | Monsoon Tips In Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అరకు లోయ (Araku Valley) వర్షాకాలంలో ఒక హరిత వస్త్రాన్ని ధరించినట్టు గ్రీనరీతో నిండి ఉంటుంది. విశాఖపట్టణం నుంచి మొదలయ్యే ట్రైన్ జర్నీలో టన్నెల్స్, బ్రిడ్జిలు, లోయలు కలిసి ఒక మరపురాని అనుభూతిని అందిస్తాయి. కాఫీ ప్లాంటేషన్స్, ట్రైబల్ కల్చర్ ఇవన్నీ అరకుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి.
మేఘాల మధ్య మేఘమలై, యెర్కాడ్
తమిళనాడులో మేఘమలై (Meghamalai) పేరు వినగానే మబ్బులు గుర్తొస్తాయి. పేరుకి తగ్గట్టే మబ్బులు ఇక్కడ కొండలకు దగ్గరగా చేరుకుంటాయి. యెర్కాడ్‌లో (Yercaud) లేక్ పక్కనే వర్షం చినుకుల శబ్దం వినడం, నారింజ తోటల మధ్య నడవడం, ప్రశాంతతను ఆస్వాదించడం ఒక మెమొరబుల్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది.’
A beautiful video about Meghamalai. Don't miss it. pic.twitter.com/VtkDwE4oeo
— மேகமலைக்காதலன் ( A true lover of Megamalai ) (@MegamalaiS) March 6, 2024
టూరిస్టుల రష్ (Tourist Rush) కన్నా నేచర్ సౌండ్స్ ఎక్కువగా వినిపించే ఈ ప్రదేశాలు స్లో ట్రావెల్ ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతాయి.
ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్
కొడైకనాల్ని (Kodaikanal) చాలా మంది ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా పిలుస్తారు. మాన్సూన్లో ఆ పేరుకి తగ్గట్టే ఉంటుంది ఇక్కడి బ్యూటి. పైన్ ఫారెస్ట్ మధ్య చినుకులు పడుతుంటే, లేక్ పక్కనే గాలి మెల్లిగా వీస్తుంటే, సమయం కొంచెం మెల్లిగా సాగినట్టు, కొన్ని సార్లు క్షణం పాటు ఆగినట్టు అనిపిస్తుంది.
మార్నింగ్ మిస్ట్‌లో వాకింగ్, స్మాల్ కేఫేలో హాట్ కాఫీ తాగడం, సాయంత్రం లేక్ రిఫ్లెక్షన్స్ చూడటం… ఈ అనుభవాలు ప్రయాణాన్ని మరింతగా గుర్తుండేలా చేస్తాయి.
సందర్శనీయ ప్రదేశాలు | Places To Visit
ఈ తొమ్మిది హిల్ టౌన్స్‌లో ప్రతీ ప్రదేశం ఒక డిఫరెంట్ అనుభవాన్ని అందిస్తుంది. కూర్గ్ కాఫీ ఎస్టేట్స్, చిక్‌మగళూరు ముల్లాయనగిరి పరిసర ప్రాంతాలు, ఊటీ బొటానికల్ గార్డెన్, కూనూరు టీ తోటలు, మున్నార్ టీ ప్లాంటేషన్స్, వాయనాడ్ అడవులు, అరకు కాఫీ గార్డెన్స్, మేఘమలై రోలింగ్ హిల్స్, యెర్కాడ్ లేక్, కొడైకనాల్ పైన్ ఫారెస్ట్ అన్నీ కలిసి సౌత్ ఇండియా బ్యూటిని (South Indian Beauty) ప్రపంచానికి మరింత అందగా చూపిస్తాయి. ప్రతీ ప్రదేశంలో ప్రకృతి ఒక కొత్త రంగును చూపిస్తుంది.
ఎలా వెళ్లాలి ? | How To Reach
హైదరాబాద్ నుంచి బెంగుళూరు (Hyderabad To Benguluru), కోచి, కోయంబత్తూరు, మదురై, విశాఖపట్టణం లాంటి నగరాలకు ఫ్లైట్స్, ట్రైన్లు, బస్సులు ఈజీగా దొరుకుతాయి. అక్కడి నుంచి కొండ రహాదారుల్లో ప్రయాణం మొదలవుతుంది.
ప్లెయిన్స్ నుంచి మెల్లగా కొండల మధ్యకి చేరేటప్పుడు గాలి మారడం, టెంపరేచర్ తగ్గడం, మబ్బులు దగ్గరవడం అనేది ప్రయాణంలో ఒక అందమైన మార్పుగా కనిపిస్తుంది.
విజయవాడ నుంచి విశాఖపట్టణం, బెంగళూరు, కోయంబత్తూరు, కోచికి చేరుకుని అక్కడి నుంచి ఈ హిల్ టౌన్స్కి చేరుకోవచ్చు. జర్నీలో ప్రతీ క్షణం ప్రకృతి తన కొత్త రూపాన్ని చూపిస్తుంది.
ఎక్కడ ఉండాలి ? | Where To Stay
ఈ మౌంటెన్ టౌన్స్‌లో బోటీక్ హోమ్ స్టేలు, ప్లాంటేషన్ కాటేజీలు, హెరిటేజ్ బంగ్లాలు, నేచర్ రిసార్ట్స్, సింపుల్ హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కిటికీ తెరవగానే టీ గార్డెన్స్ కనిపించే రూమ్ అయినా, కాఫీ ఎస్టేట్స్ మధ్య వెలిసిన కాటేజీలు అయినా, ఫారెస్ట్ ఎడ్జ్‌లో ఉన్న స్టేలు అయినా… అకామోడేషన్ కూడా ప్రయాణంలో ఒక భాగంగా అనిపిస్తుంది.
ఏం చూడాలి ? | What To See
మార్నింగ్ మిస్ట్‌లో లోయలను, వర్షం తరువాత మెరుసే జలపాతాలు, టీ , కాఫీ ప్లాంటేషన్స్, చిన్న రైల్వే స్టేషన్స్, ట్రైబల్ కల్చర్, లేక్స్, అడవిలో సాగే ప్రయాణం, సూరస్తమయంలో రంగు రంగులతో సందడి చేసే వ్యూ పాయింట్స్… ఈ అనుభవాలు ఒక్కో హిల్ స్టేషన్లో ఒక్కోలా ఉంటాయి.
లోకల్ మార్కెట్లలో నడవడం, ప్లాంటేషన్ విజిట్స్, సీనిక్ ట్రైన్ జర్నీస్, బోటింగ్, ఫోటోగ్రఫీ, విలేజ్ వాక్స్ లాంటివి ఈ ప్రయాణంలో సహజంగా కనిపిస్తాయి.
ఏం తినాలి? | What To Eat
కూర్గ్‌లో పాండీ కర్రీ ఇష్టపడేవారికి ఫేమస్. కానీ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. చిక్‌మగళూరు ఫ్రెష్ కాఫీని ఒక్కసారి రుచి చూస్తే ఇక ఎప్పుడూ మర్చిపోలేరు. ఊటీ హోమ్మేడ్ చాకొలేట్స్, మున్నార్ టీ, వాయనాడ్ స్పైసెస్, అరకు ఆర్గానిక్ కాఫీ, కొడైకనాల్ హోమ్మేడ్ చాకొలేట్స్, లోకల్ బేకరీ ఐటమ్స్ ఇలా ప్రతీ ఐటమ్ ఆ ప్రదేశానికి బ్రాండ్ ఎంబాసెడర్లా పని చేస్తుంది.
యాత్ర, బడ్జెట్ వివరాలు | Budget Details
హైదరాబాద్ నుంచి 5 రోజుల మాన్సూన్ హిల్ స్టేషన్ ట్రిప్ బడ్జెట్ రేంజ్ అనేది మీ ట్రావెల్ స్టైల్‌ను బట్టి మారుతుంది. బడ్జెట్ ట్రావెల్‌ను సుమారు రూ.18,000 నుంచి రూ.25,000 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ కాస్ట్ సుమారు రూ.28,000 నుంచి రూ.40,000 మధ్యలో ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.45,000 నుంచి రూ.70,000 వరకు బడ్జెట్ అవవచ్చు.
స్టే విషయానికి వస్తే ప్రతీ రాత్రికి రూ.1,500 నుంచి రూ.8,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.1,500 మధ్య ఖర్చు అవుతుంది.
హైదరాబాద్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది డెస్టినేషన్‌ను బట్టి రూ.4,000 నుంచి రూ.15,000 మధ్య మారుతుంది. విజయవాడ నుంచి ట్రావెల్ కాస్ట్ కొంచెం తక్కువ లేదా దాదాపు సమానంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాల్లో ప్లాంటేషన్ స్టే ప్యాకేజీలు, హెరిటేజ్ స్టేస్, సీనిక్ ట్రైన్ ఎక్స్‌పీరియెన్స్ అన్నీ కలిపి ప్రయాణాన్ని మరింత స్పెషల్‌గా మార్చేస్తాయి.
ఆసక్తికరమైన విషయాలు | Interesting Facts
వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ హిల్ టౌన్స్ అత్యంత అందంగా ఉంటాయి.
ఈ డెస్టినేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలోనే ఉన్నాయి.
వర్షాకాలంలో ఈ ప్రదేశాలకు వెళ్తే చల్లని గాలితో పాటు, మబ్బులతో నిండిన ఆకాశం, పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు.
ఇందులో మీరు ఏ ప్రదేశానికి వెళ్లాలి అనుకున్నా 5 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తే సరిపోతుంది.
ఇక్కడ మీరు టీ లేదా కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో స్లో ట్రావెల్‌ను ఆస్వాదించవచ్చు.
ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
గమనిక :
ఈ ట్రావెల్ గైడ్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారం, స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకుని, వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
