అమర్నాథ్ యాత్రలో చూడాల్సిన విశేషాలు : Amarnath Yatra Telugu Yatra Guide 2026
Amarnath Yatra Guide : హిమాలయాల మధ్య ప్రతీ క్షణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు, జలధారలు, దూరం నుంచి వినిపించే “హర హర మహాదేవ్” అనే నినాదం… ఇవన్నీ కలిసి అమర్నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి.
Amarnath Yatra : హిమాలయాల మధ్య ప్రతీ క్షణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు, జలధారలు, దూరం నుంచి వినిపించే “హర హర మహాదేవ్” అనే నినాదం… ఇవన్నీ కలిసి అమర్నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి.
అమర్నాథ్ గుహాలయానికి చేరిన తరువాత గమ్యం కన్నా ప్రయాణమే బాగా గుర్తుంటుంది. ప్రతీ అడుగు ప్రకృతికి దగ్గరగా, ప్రతీ క్షణం దేవేదేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. హిమాలయాల మధ్య నడుస్తూ వెళ్తుంటే సమయం కూడా కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.

హిమాలయాల ఒడిలో మహాదేవుడి నిలయం | Amarnath Yatra Guide 2026
జమ్మూ అండ్ కశ్మీర్లో ఉన్న అమర్నాథ్ గుహాలయం ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ గుహలో ప్రకృతి స్వయంగా మంచుతో రూపొందించిన శివలింగాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు.
గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, మంచు వాసన, మౌనం… ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి.
గుహలో మంచు లింగం ముందు నిలబడిన క్షణంలో మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది మాటల్లో కాదు… అనుభవంలో ఉంటుంది.
సందర్శనీయ ప్రదేశాలు | Places To Visit
అమర్నాథ్ యాత్రలో పహల్గామ్ రూట్ (Amarnath Via Pahalgam Route) చాలా అందంగా ఉంటుంది. పచ్చని పచ్చిక బయలు, గంభీరంగా నిలబడిన హిమ శిఖరాలు, వాగుల మధ్య సాగే ఈ మార్గం ప్రతీ మలుపులో కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. చందన్వారి (Chandanvari) దగ్గర చల్లని గాలి మనసుని రిఫ్రెష్ చేస్తుంది.
శేష్నాగ్ లేక్ (Seshnag Lake) దగ్గర నీళ్లు ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. పంచతరణి (Panch Tarani) చేరిన తరువాత హిమాలయాల వైభవం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు చూస్తూ వెళ్తుంటే గమ్యం ఎంత మధురమో ప్రయాణం అంతే మధురంగా అనిపిస్తుంది.
యాత్ర పూర్తి చేసుకున్న తరువాత శ్రీనగర్‌లో డాల్ లేక్ పై (Dal Lake) హౌజ్‌బోట్‌లో గడిపిన సాయంత్రం మరిచిపోలేని మెమొరీగా మిగిలిపోతుంది. మొఘల్ గార్డెన్స్‌లో నడవడం, లోకల్ బజార్లో కశ్మీర్ సంస్కృతిని చూడడం కూడా ఈ ప్రయాణానికి ఇంకో అందాన్ని జోడిస్తాయి.
Sara Ali Khan is on Amarnath Yatra.. And she is enjoying her Yatra..
— Aakanksha🇮🇳 (@Charu_on_X_x) July 13, 2026
Same Sara Ali Khan sometimes ago celebrated birthday of Pakistani actress Kubara Khan..
Momins and Librandu gang was so happy to see that.. They loved Sara for this.
Now as she is going Amarnath, same gang… pic.twitter.com/z29nqL4YT6
ఎలా వెళ్లాలి? | How To Go
హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు (Hyderabad To Srinagar Direct Flights) డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరుకుతాయి. ఫ్లైట్‌లో హిమాలయాలపై ప్రయాణిస్తున్న సమయం నుంచే ఈ యాత్ర ఫీలింగ్ మొదలవుతుంది.
శ్రీనగర్ చేరుకున్న తరువాత రోడ్డు మార్గంలో పహల్గామ్ లేదా బాల్టాల్ వరకు వెళ్లవచ్చు. ఈ రోడ్ ట్రిప్‌లో కశ్మీర్ వ్యాలీ (Kashmir Valley) అందాలు ప్రతీ విండో ఫ్రేమ్‌ని ఒక పోస్టుకార్డ్లా మార్చేస్తాయి.
విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ లేదా ఢిల్లీ మీదుగా శ్రీనగర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రయాణం అనేది ప్రకృతి మధ్య నిశ్శబ్దంగా సాగుతుంది.
ఎక్కడ ఉండాలి? | Stay Options
శ్రీనగర్‌లో హౌజ్‌బోట్స్, లేక్ వ్యూ హోటల్స్, బోటిక్ స్టేస్ ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి. ఉదయం డాల్ లేక్‌పై పడవల శబ్దంతో మేల్కొనడం ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది.
పహల్గామ్లో కాటేజీలు, హోటల్స్, నేచర్ రిసార్ట్స్‌లో చల్లని గాలి, పచ్చని చెట్లు, పర్వతాల అందాలు రోజంతా మనసుని రిఫ్రెష్ చేస్తాయి. యాత్ర మార్గంలో ఉండే క్యాంపులు కూడా హిమాలయాల మధ్య ఒక యూనిక్ స్టే ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి.
ఏం చూడాలి? | What To See
ఉదయం మంచు శిఖరాలపై పడిన వెలుగు చూడటం ఒక అందమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. పర్వతాల మధ్య సాగే భక్తులు, గుర్రాల సవారి, చల్లని గాలిలో ఎగురుతున్న ప్రార్థనా ధ్వజాలు… ఇవన్నీ కలిసి ఒక సినిమా సీన్లా అనిపిస్తాయి.
డాల్ లేక్‌లో శిఖారా రైడ్ (Shikara Ride), లోకల్ మార్కెట్స్‌లో హ్యాండీక్రాఫ్ట్స్, కశ్మీర్లో సాఫ్రాన్, డ్రై ఫ్రూట్స్ షాపులు… ఇవన్నీ చూస్తూ గడిపిన సమయం కూడా మెమొరబుల్‌గా ఉంటుంది.
ఏం తినాలి? | Food to Eat
కశ్మీర్ క్యూజిన్లో దమ్ ఆలూ, రాజ్మా చావల్, కావా టీ (Kava Tea), కశ్మీరీ రోటీ లాంటి సింపుల్ డిషెస్ చల్లని వాతావరణంలో ఇంకా రుచిగా అనిపిస్తాయి. లోకల్ టీ స్టాల్స్ దగ్గర దొరికే గరం గరం చాయ్ అనేది జర్నీ మధ్య ఒక చిన్న బ్రేక్‌ని మెమొరబుల్ చేస్తుంది.
ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఏప్రికాట్స్ టేస్ట్ చేస్తూ లోకల్ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీ భోజనం అక్కడి వాతావరణం లాగే సింపుల్‌గా, ఆథెంటిక్‌గా ఉంటుంది.
🚩 Jai Baba Barfani 🚩
— 🇮🇳 Indrani 🇮🇳 (@Anti_Congressi) July 14, 2026
When devotion calls, India's brave son's
answer first..
Pure Goosebumps. Pure pride. Pure devotion.
This isn't just a convoy, it's India's strength on the move.. Every vehicle carries the courage of our @crpfindia heroes, ensuring the #AmarnathYatra… pic.twitter.com/2Zssmm4VK3
యాత్ర & బడ్జెట్ వివరాలు | Travel Budget
హైదరాబాద్ నుంచి 5 రోజుల అమర్నాథ్ యాత్రను బడ్జెట్లో ప్లాన్ చేస్తే సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య పూర్తి చేయవచ్చు. కొంచెం కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతుంది
ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం మంచి హోటల్స్, ఫ్లైట్స్, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణంతో కలిపి రూ..70,000 నుంచి రూ.1 లక్షా 10 వేల వరకు ప్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తే టోటల్ బడ్జెట్ కాస్త పెరగవచ్చు.
శ్రీనగర్ హోటల్స్‌లో పర్ నైట్ రూ.2,000 నుంచి రూ.8,000 వరకు ఆప్షన్స్ ఉంటాయి. ప్రీమియం లేక్ వ్యూ స్టేస్ కోసం రూ.10,000 వరకు కూడా ఖర్చు చేస్తారు.
ఫుడ్ కోసం ప్రతీ రోజు సగటున రూ.700 నుంచి రూ.1,500 వరకు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.
ఆసక్తికరమైన విషయాలు | interesting Facts
- అమర్నాథ్ గుహాలయం హిమాలయాల మధ్య సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
- ప్రతీ సంవత్సరం కొన్ని వారాలు పాటు మాత్రమే అమర్నాథ్ యాత్రను నిర్వహిస్తారు.
- మంచుతో ఏర్పడే స్వయంభు శివలింగాన్ని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు.
- పహల్గామ్, బాల్టాల్ అనే రెండు ప్రధాన యాత్రా మార్గాల ద్వారా గుహాలయానికి చేరుకోవచ్చు.
- జూలై, ఆగస్టు నెలల్లో హిమాలయాల అందాలు మరింత ఆకట్టుకుంటాయి.
గమనిక :
ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా వివరాలు, వాతావరణం, స్థానిక పరిస్థితులను స్వయంగా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.
- మరిన్ని మీడియా పబ్లిషింగ్ రికార్డుల కోసం క్లిక్ చేయండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
