Tirumala Laddus : తిరుమలలో రికార్డు.. జూన్‌లో కోటి 27 లక్షల శ్రీవారి లడ్డూల విక్రయం!
Tirumala Laddus : తిరుమల అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) దర్శనం, ఆ తరువాత అందరూ భక్తితో తీసుకునే శ్రీ వారి లడ్డూ ప్రసాదం (Sri Vari Laddu Prasadam). ఈ లడ్డూ కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు… స్వామి వారి ఆశీర్వాదం అని భక్తులు నమ్ముతారు.
2026 జూన్ నెలలో తిరుమలలో 1,26,81,805 శ్రీవారి లడ్డూలు విక్రయమై కొత్త రికార్డు క్రియేట్ చేశాయి. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు లడ్డూల డిమాండ్ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది.
టీటీడీ ప్రకారం ఏప్రిల్‌లో కోటి 11 లక్షల లడ్డూలు, మేలో కోటి 21 లక్షల లడ్డూలు విక్రయం జరగగా, జూన్‌లో ఆ సంఖ్య కోటి 27 లక్షల దగ్గరికి చేరడం విశేషం. అంటే దాదాపు 6.37 శాతం మేరకు లడ్డూల వినియోగం పెరిగింది. 2024తో పోల్చితే ఈ పెరుగుదల చాలా ఎక్కువ.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్నారు. దర్శనం అయ్యాక శ్రీ వారి లడ్డూని ఇంటికి తీసుకెళ్లడం, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచడం అనేది ఒక అందమైన సంప్రదాయం. అందుకే TTD కూడా డిమాండ్‌కు తగిన విధంగా నిరంతరం లడ్డూలను తయారు చేస్తూ, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రసాదాన్ని అందిస్తోంది.
మీరు కూడా తిరుమల యాత్ర ప్లాన్ చేస్తుంటే దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి. ఆ ప్రసాదంలో ఉన్న రుచికన్నా, స్వామి వారి కృప అనే భావన ఇంకా గొప్పది.
గోవిందా… గోవిందా… అని పిలుస్తూ తిరుమల మెట్లు ఎక్కిన ప్రతి భక్తుడి చేతిలో కనిపించే శ్రీవారి లడ్డూ, ఒక ప్రసాదం మాత్రమే కాదు… అది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం కూడా. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. తిరుమల యాత్రను పూర్తి చేసిన మధురమైన జ్ఞాపకంగా శ్రీ వారి లడ్డూ ఎప్పటికీ నిలిచిపోతుంది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
