యాదాద్రి, స్వర్ణగిరి, పోచంపల్లి… ఒక్కరోజు పెర్ఫెక్ట్ ట్రిప్ : Hyderabad One Day Tour
Hyderabad One Day Tour : హైదరాబాద్ నుండి ఒక రోజులో తెలంగాణలోని ఆధ్యాత్మిక, వారసత్వ సాంస్కృతిక అందాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ టూరిజం డెవెలెప్మెంట్ కార్పొరేషన్ (TGTDC) తీసుకొచ్చిన కొత్త హైదరాబాద్-యాదగిరిగుట్ట-శిల్పారామం-కొలనుపాక జైన్ ఆలయం-స్వర్ణగిరి ఆలయం-భూదాన్ పోచంపల్లి-హైదరాబాద్ ఒక్కరోజు ప్యాకేజీ మీకోసమే.
ఈ ప్యాకేజీలో మొదటగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ (Yadadri Tour Package) దర్శనం ఉంటుంది. తరువాత హరితా హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేసి, తెలంగాణ కళ, సంస్కృతిని ప్రతిబింబించే శిల్పారామాన్ని విజిట్ చేస్తారు. ఆ తరువాత దక్షిణాదిలో ప్రసిద్ధి చెందిన కొలనుపాక జైన్ ఆలయం దర్శనం ఉంటుంది.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
మధ్యాహ్నం భువనగిరిలో వెజిటేరియన్ లంచ్ అనంతరం అద్భుతమైన స్వర్ణగిరి ఆలయాన్ని (Swarnagiri Temple) సందర్శించే అవకాశం లభిస్తుంది. చివరి గమ్యస్థానంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇకాట్ హ్యాండ్లూమ్ (Ikat Handloom) కు పేరు పొందిన భూదాన్ పోచంపల్లిని విజిట్ చేసి హరితా హోటల్లో హై టీ తరువాత హైదరాబాద్‌కు రిటర్న్ అవుతారు.
ప్యాకేజీలో ఏసీ మినీ బస్ ట్రాన్స్‌పోర్టు, బ్రేక్‌ఫాస్ట్, వెజ్ లంచ్, హై టీ, ఆలయ దర్శనం వంటి సదుపాయాలు ఉంటాయి.
పికప్ పాయింట్స్
- సికింద్రాబాద్‌లోని యాత్రినివాస్ – ఉదయం 7 గంటలకు
- బేగంపేట్‌లోని టూరిజం భవన్ – ఉదయం 7.15 గంటలకు
- బషీర్‌బాగ్ సీఆర్ఓ ఆఫీస్ – ఉదయం 7 గంటల 30 నిమిషాలకు
ప్యాకేజీ ధర
- పెద్దలకు: రూ. 2,070
- పిల్లలకు: రూ. 1,770
భక్తి, చరిత్ర, సంస్కృతి తోపాటు తెలంగాణ హ్యాండ్లూమ్ వైభవాన్ని ఒకే రోజులో అనుభవించాలనుకునే కుటుంబాలు, తీర్థయాత్రికులు, పర్యాటకులు, ట్రావెల్ లవర్స్‌కు ఇది ఒక అద్భుతమైన ఛాయిస్. వీకెండ్ ఔటింగ్ కోసం కూడా ఈ ప్యాకేజీ బాగా సెట్ అవుతుంది.
బుకింగ్ ఎలా?
TGTDC Official Website విజిట్ చేయడం లేదా సీఆర్ఓ బషీర్‌బాగ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
