Monsoon Travel Tips : వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
Monsoon Travel Tips : వర్షాకాలంలో ట్రావెల్ చేయడం అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం ప్లానింగ్ కూడా అవసరం. చిన్న ప్రిపరేషన్ ఉంటే జర్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము కాబట్టి టెన్షన్ పడకుండా సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయితే ట్రిప్ స్మూత్‌గా ఎంజాయ్ చేయవచ్చు.
వాతావరణం చెక్ చేయండి | Weather Checking
ట్రావెల్ స్టార్ట్ చేసే ముందు వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయడం మంచిది. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల గురించి ముందుగా తెలిస్తే తగిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. లోకల్ అప్డేట్స్ కూడా తెలుసుకుంటే అనవసరమైన అత్యవసర ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

ప్యాకింగ్ ఇలా | Travel Packing
లైట్‌వెయిట్ రెయిన్‌కోట్ లేదా కాంపాక్ట్ అంబ్రెల్లాను బ్యాగులో తప్పనిసరిగా ఉంచుకోవాలి. వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్ కవర్ వినియోగిస్తే గ్యాడ్జెట్స్, బట్టలు సేఫ్‌గా ఉంటాయి. మొబైల్, డాక్యుమెంట్స్, వాలెట్ లాంటివి వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లో క్యారీ చేస్తే బెస్ట్.
ఫుట్‌వేర్ | Travel Footwear
ఫుట్‌వేర్ సెలెక్ట్ చేసేటప్పుడు వాటర్‌ప్రూఫ్ శాండిల్స్ లేదా క్విక్ డ్రైయింగ్ షూస్ చాలా బెటర్ ఆప్షన్. స్లిప్పరీ రోడ్స్‌లో కంఫర్టబుల్ గ్రిప్ ఉన్న ఫుట్‌వేర్ జర్నీని సులభతరం చేస్తుంది. ఎక్స్ట్రా సాక్స్ క్యారీ చేస్తే తడిసిన వెంటనే మార్చుకోవచ్చు.
స్నాక్స్ | Travel Snacks
హెల్తీ స్నాక్స్, వాటర్ బాటిల్, చిన్న టవల్, పవర్ బ్యాంక్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి ట్రావెల్ ఎసెన్షియల్స్గా బ్యాగులో రెడీగా ఉంటే చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా చార్జింగ్ చేసే అవకాశం దొరక్కపోయినా పవర్ బ్యాంక్‌తో చార్జింగ్ పెట్టుకుంటే సేఫ్‌గా ఉంటుంది. మెడిసిన్స్ రెగ్యులర్‌గా వాడితే వాటిని సెపరేట్ పౌచ్‌లో ఉంచడం బెటర్.
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో టాప్ 7 కుటుంబ సమేతంగా వెళ్లదగిన ప్రాంతాలు | Vijayawada Near By Places
రోడ్ ట్రిప్స్‌లో డ్రైవింగ్ స్లోగా చేయడం, సరైన దూరం పాటించడం చాలా అవసరం. నీటితో నిండిపోయిన రోడ్డుపై అనవసరమైన రిస్క్ తీసుకోకపోవడం బెటర్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తే కొంచెం ఎక్స్ట్రా ట్రావెల్ టైమ్ ప్లాన్ చేసుకుంటే రష్ అవాయిడ్ చేయవచ్చు.
మాన్సూన్ ట్రావెల్లో డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా మెమొరబుల్‌గా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ ల్యాండ్‌స్కేప్స్, చల్లని వెదర్ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చేస్తాయి. కొంచెం సిద్ధం అయి వెళ్తే ఆ ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా పూర్తి చేసుకుని ఇంటికి మెమొరీస్‌తో తిరిగి వచ్చేయవచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
