నేచర్‌ని స్లోగా ఫీల్ అవ్వాలి అనుకుంటే ఇదే బెస్ట్ ఛాయిస్ | Black Forest Germany Travel Guide
Black Forest Germany : ప్రతీ ట్రిప్ అడ్వెంచర్‌గా ఉండాల్సిన అవసరం లేదు కదా? ఎందుకంటే కొన్ని ప్రదేశాలు సైలెంట్‌గా మనసును రిఫ్రెష్ చేస్తాయి. బ్లాక్ ఫారెస్ట్ అలాంటి ఒక ప్రదేశమే. మొదటిసారి యూరోప్ విజిట్ చేసే వాళ్లకు కూడా ఈ ప్రదేశం కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది.
ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ వ్యూస్, ప్రశాంతమైన రహదారులు కలిసి ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ ఇస్తాయి. ఇక్కడ సమయం నెమ్మదిగా గడుస్తున్న అనుభూతి కలుగుతుంది.
అడవి మధ్య గ్రామాలు చాలా నీట్‌గా ఉంటాయి. వుడెన్ హౌజెస్, ఫ్లవర్ బాల్కనీలు, చిన్న స్ట్రీట్స్ అన్నీ పోస్ట్కార్డులా కనిపిస్తాయి. మార్నింగ్ మిస్ట్ చెట్ల మధ్య పడితే వాతావరణం ఇంకా కామ్‌గా ఉంటుంది. వాకింగ్ చేస్తూ నేచర్ సౌండ్స్ వింటుంటే సిటీ నాయిస్ సులభంగా మరిచిపోతాము. ప్రతీ కార్నర్లో సింపుల్ బ్యూటీ కనిపిస్తుంది.
Black Forest 🌲 pic.twitter.com/LtwgjrmeAF
— PPLHI Indonesia (@PplhiI55911) July 3, 2026
సందర్శనీయ ప్రదేశాలు
ట్రిబెర్గ్ జలపాతాల (Triberg Waterfall) దగ్గర నీటి శబ్దాలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. టిటిసీ లేక్ (Titisee Lake) పక్కన ఈవినింగ్ వాక్ ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. బేడెన్ బేడెన్ స్ట్రీట్స్ వైబ్ ఫీల్ అవ్వాలంటే ఒక్కసారైనా అక్కడికి వెళ్లాల్సిందే అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : సూర్యుడు అస్తమించని మంచురాజ్యం | Svalbard Arctic Travel
ఏం తినాలి? | Food To Eat
బ్లాక్ ఫారెస్ట్ కేక్ స్వీట్ లవర్స్‌కి మెమోరెబుల్ టేస్ట్ ఇస్తుంది. ఫ్లామ్కుచెన్ క్రిస్పీ బేస్‌తో లైట్‌గా ఎంజాయ్ చేయవచ్చు. ట్రెడిషనల్ జర్మన్ సాసేజ్‌లను వార్మ్ బ్రెడ్‌తో ఆస్వాదిస్తే లోకల్ ఫ్లేవర్ కంప్లీట్‌గా ఫీల్ అవుతుంది. సింపుల్ ఫుడ్ అయినా శాటిస్ఫైయింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
ఎప్పుడు వెళ్లాలి? | Best Time
మే నుంచి అక్టోబర్ వరకు క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆటమ్‌లో రంగురంగుల చెట్లు ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. ఈ సమయంలో వెళ్తే రోడ్లు చాలా క్లీన్‌గా ఉంటాయి. స్థానికులు చాలా స్నేహభావంతో పలకరిస్తారు. స్లో ట్రావెల్‌ని ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ వాతావరణం అని చెప్పవచ్చు.
హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి? | How To Plan From Hyderabad
హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) లేక స్టుట్‌గార్డ్ (Stuttgart) కి కనెక్టింగ్ ఫ్లైట్‌లో సుమారు 12 నుంచి 15 గంటల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి ట్రెయిన్ లేక కార్ జర్నీతో బ్లాక్ ఫారెస్ట్ రీచ్ అవ్వడం ఈజీ. సీనిక్ రూట్ జర్నీని ఇంకా ఎంజాయబుల్‌గా మార్చేస్తుంది.
ట్రిప్ అయ్యాక ఫోటోల కన్నా మెమోరీస్ ఎక్కువగా గుర్తొస్తాయి. నేచర్‌తో స్పెండ్ చేసిన క్వైట్ మూమెంట్స్ హార్ట్‌లో లాంగ్ టైమ్ ఉంటాయి. బ్లాక్ ఫారెస్ట్ విజిట్ సింపుల్‌గా జర్నీ అయినా అనుభూతి మాత్రం లైఫ్ టైమ్ మిగిలిపోతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
