సూర్యుడు అస్తమించని మంచురాజ్యం | Svalbard Arctic Travel
Svalbard Arctic Travel : మంచు పరుపుపైన ఆకాశం వాలిపోతుంటే ప్రకృతి తన మౌనాన్ని వినిపిస్తుంది. ఆర్కిటిక్ వెలుగు మధ్య నిశ్శబ్దంగా నిలిచిన ఈ ప్రదేశం.. స్వాల్బార్డ్ అనే ఈ ప్రాంతం నార్వే దేశంలో భాగం. యూరప్ నుంచి దూరంగా ఉండే ఒక మంచుతో నిండిన ద్వీప సమూహం ఇది.
ముఖ్యాంశాలు
ఇక్కడ రాత్రి లేకుండా సాగిపోయే సమయం, మనసులో వెలుగును మిగిల్చే ఒక అనుభవంగా మారుతుంది. స్వాల్బార్డ్ ఇది కేవలం ఒక ప్రదేశం కాదు.. ఒక అనుభూతి. ఆర్కిటిక్ సముద్రం మధ్యలో మంచు కొండల నడుమ మనుషుల హడావిడి లేని ఒక ప్రశాంతమైన ప్రపంచం.
ప్రకృతి తన విశ్వరూపాన్ని ఎంత అందంగా చూపిస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ సమయం అనేది ఒక నెంబర్ కాదు.. ఒక ఎమోషన్.
సందర్శనీయ స్థలాలు | Svalbard Arctic Travel
స్వాల్బార్డ్లో లాంగ్ఇయర్బైయెన్ (Longyearbyen) అనే చిన్న టౌన్ నుంచి మంచు కొండల మధ్యలోకి వెళ్లే కొద్దీ మనకు వినపడే ఒకే ఒక శబ్దం.. నిశ్శబ్దం. ఇక్కడి పిరామిడెన్ (Pyramiden) అనే ఘోస్ట్ టౌన్ చూస్తుంటే గత కాలంలో మనుషుల జీవితం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.
అక్కడున్న ప్రతీ కట్టడం, కోల్ మైన్స్ ఇప్పుడు మంచులో కలిసిపోయి ఒక వింత కథను చెబుతాయి.
నై-ఆలేసుండ్ (Ny-Ålesund) అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు హఠాత్తుగా ఆకాశంలో నక్షత్రాలు మనకు దగ్గరయ్యాయేమో అని అనిపిస్తుంది.
Prof. Brian Cox takes us to the edge of the world in Svalbard, where the typical cycle of day and night is replaced by a sun that never sets.
— Cosmos Archive (@cosmosarcive) April 11, 2026
As the Earth rotates with its North Pole tilted toward our star, the sun appears to trace a perfect 360° circle along the horizon. It’s… pic.twitter.com/EjFsVhrBdS
ఎలా వెళ్లాలి? | How To Go
హైదరాబాద్ నుంచి స్వాల్బార్డ్కు విమాన సర్వీసులు లేవు. ముందునార్వే రాజధాని అయిన ఓస్లో వరకు చేరుకుని అక్కడి నుంచి స్వాల్బార్డ్లోని లాంగ్ఇయర్బైయెన్ ప్రాంతానికి వెళ్లవచ్చు. విజయవాడ నుంచి స్వాల్బార్డ్ వెళ్లాలి అనుకుంటే ముందుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది.
- ఇది కూడా చదవండి : French Alps Travel : ఎండాకాలంలో చల్లని స్వర్గం
ఎక్కడ ఉండాలి? | Where To Stay
స్వాల్బార్డ్లో స్టే అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లాంగ్ఇయర్బైయెన్లో ఉన్న చిన్న బుటిక్ హోటల్స్, గెస్ట్ హౌసెస్ చాలా బాగుంటాయి. వుడ్‌తో చేసిన గోడల మధ్య బయట చలి ఉన్నా.. లోపల ఉండే ఆ వెచ్చదనం మనసుకి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.
Svalbard, Norway feels like the edge of the world…..where the sun disappears for months, polar bears outnumber people, and silence is part of the landscape. pic.twitter.com/u71oFZ8neW
— The Timeless Traveler (@TimelessTrvlr) April 23, 2026
అక్కడ ఉన్న లగ్జరీ అమెనిటీస్ కన్నా అక్కడి సింప్లిసిటీ, హాస్పిటాలిటీ మనసుని గెలుచుకుంటాయి. లాడ్జిలోని వెచ్చని మంట దగ్గర కూర్చుని పుస్తకం చదవడం కానీ, లేదా బయట ఉన్న మంచును చూడటం ఒక మెమోరీగా మిగిలిపోతాయి.
ఏం చూడాలి? | Places To Visit
స్వాల్బార్డ్లో చూడాల్సిన ప్రదేశాలు, చేయడానికి ఆక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఆర్కిటిక్ వైల్డర్నెస్లో డాగ్ స్లెడింగ్ చేస్తూ మంచులో వెళ్లడం చాలా మందికి నచ్చుతుంది. స్నో మొబైలింగ్ చేయడం, నార్తర్న్ లైట్స్ చూడటం ఇవన్నీ చాలా మంది చేసేవే.
కానీ మీరు వెళ్తే మాత్రం అక్కడ ఉన్న డూమ్స్‌డే వాల్ట్ అనే ప్రపంచ విత్తనాల బ్యాంకును చూడటం మరవకండి. గ్లేషియర్స్, వాటి మధ్యలో ఉన్న మంచు గుహలను చూసేందుకు మంచి ట్రావెల్ ఏజెన్సీలు సాయం చేస్తాయి.
Longyearbyen, Svalbard pic.twitter.com/vI9SO2dQSO
— 𝘄𝗮𝗻𝗱𝗲𝗿𝘁𝗿𝗮𝘃𝗲𝗹𝘀 (@visualsofearth1) April 20, 2026
దీంతో పాటు సోవియట్ కాలంలో తవ్వి వదిలేసిన పిరామిడెన్, బారెంట్స్‌బర్గ్ (Barentsburg) అనే మైనింగ్ టౌన్స్ ఒక సినిమాటిక్ ఫీలింగ్ అందిస్తాయి. ఇక్కడి మ్యూజియంలో పోలార్ బేర్స్, అంటే ధ్రువపు ఎలుగుబంట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
ఏం తినాలి? | What To Eat
ఆర్కిటిక్ వాతావరణంలో ఫుడ్ ఒక సూపర్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ లోకల్‌గా లభించే సీ ఫుడ్, ముఖ్యంగా ఫ్రెష్ ఆర్కిటిక్ చార్ అనే కోల్డ్ వాటర్ ఫిష్ డెఫినెట్‌గా ట్రై చేయాల్సిందే.
దీంతో పాటు లోకల్ కాఫీ, రీన్డీర్ మీట్, లోకల్ సూప్స్ ఫుడ్ లవర్స్‌కు మంచి ఆప్షన్స్‌గా ఉంటాయి.
నిజానికి ఇక్కడ ఫుడ్ అనేది ఆకలి తీర్చుకునే సాధనం మాత్రమే కాదు.. ఆ వాతావరణంలో మనసుని తృప్తిపరచుకునే మార్గం కూడా.
స్వాల్బార్డ్లో చేయాల్సిన 5 పనులు | 5 Things To Do in Svalbard
ఫ్రోజెన్ బబుల్ ఫోటోగ్రఫీ (Frozen Bubble Photography)
లాంగ్ఇయర్బైయెన్లో అత్యంత చల్లని వాతావరణంలో వేడి నీటి బుడగలు నేల నుంచి బయటికి వచ్చి పేలుతుంటాయి. ఈ ప్రత్యేక దృశ్యాలను ఫోటోగ్రఫీ చేయడం చాలా మందికి ఇష్టం.
ఆర్కిటిక్ బోట్ సఫారి (Arctic Boat Safari)
ఇస్ఫ్యోర్డెన్ (Isfjorden) ప్రాంతంలో ఐస్‌బర్గ్‌లు, గ్లేషియర్స్ చూడొచ్చు. అలాగే మంచు ప్రపంచంలో మాత్రమే కనిపించే పోలార్ బేర్స్‌ను కూడా చూడవచ్చు.
బారెంట్స్‌బర్గ్ ట్రిప్
స్థానిక కల్చర్, వారి జీవనశైలి గురించి తెలుసుకోవాలి అంటే రష్యన్ సెటిల్మెంట్ ఉన్న బారెంట్స్‌బర్గ్ వెళ్లవచ్చు.
గుడ్ నైట్ చెప్పని సూరీడు
స్వాల్బార్డ్లో ఏప్రిల్ చివరి నుంచి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అస్తమించడు.
పోలార్ నైట్
అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్య వరకు సూర్యుడు ఉదయించడు. దీనినే పోలార్ నైట్ అంటారు. ఇదే స్వాల్బార్డ్ ప్రత్యేకత.
పోలార్ బేర్స్ అడ్డా | Polar Bears In Svalbard
స్వాల్బార్డ్ ప్రయాణం ఎంత అందమైనదో అంతే ప్రమాదకరం కూడా. ఇక్కడ మనుషుల కన్నా పోలార్ బేర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పట్టణం పరిధి దాటి బయటికి వెళ్లినప్పుడు చేతిలో రైఫిల్ తీసుకెళ్లడం అక్కడ తప్పనిసరి.
ధ్రువపు ఎలుగుబంట్లు ఎంత అందంగా ఉంటాయో అంతే శక్తివంతమైనవి కూడా. ఇవి 8 నుంచి 10 అడుగుల ఎత్తు, సుమారు 700 కిలోల బరువుతో కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే Usain Bolt మ్యాగ్జిమం స్పీడ్ గంటకు 37 కిమీ మాత్రమే.
Allí también hay una subespecie de oso pardo (Ursus arctos lasiotus)
— Tokkotai (@Tokkotai___) May 8, 2026
Aún así, incluso un oso negro es un cacharro de +100kg si es macho y +50 si es hembra, mejor no tener que llegar a cuerpo a cuerpo
Los sprays de pimienta son un buen arma anti oso y sino como en Svalbard, fierro pic.twitter.com/HTIAmhbw2I
మంచు కొండల మధ్య హఠాత్తుగా ఒక పోలార్ బేర్ కనిపిస్తే గుండె క్షణం పాటు ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే అక్కడ చాలా మంది గైడ్ లేకుండా ఎక్కడికీ వెళ్లరు.
యాత్ర అండ్ బడ్జెట్ వివరాలు | Svalbard Yatra and Budget Details
స్వాల్బార్డ్ ప్రయాణం కొంచెం ఖర్చుతో కూడినదే. అయితే అక్కడ లభించే అనుభవం మాత్రం పక్కా పైసా వసూల్ అనిపిస్తుంది.
ఈ సుదీర్ఘ ధ్రువ ప్రయాణానికి 5 రోజులు కేటాయిస్తే సుమారు రూ.4.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు బడ్జెట్ అవుతుంది.
హైదరాబాద్ నుంచి ఓస్లోకు (Norway Tourism) ఫ్లైట్ టికెట్‌ను బట్టి 12 నుంచి 22 గంటల వరకు సమయం పడుతుంది. అప్ అండ్ డౌన్ టికెట్ ధరలు రూ.99 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉండొచ్చు.
Oslo ❤️ Norway ❤️ pic.twitter.com/guIGJPvXzA
— Omar Sharief (@OmarSharief7) May 8, 2026
ఓస్లో నుంచి లాంగ్ఇయర్బైయెన్కు ఫ్లైట్‌లో వెళ్తే వన్‌వే జర్నీకి సుమారు రూ.45 వేల వరకు ఖర్చవుతుంది. టికెట్ ధరలు సీజన్‌ను బట్టి మారొచ్చు.
స్టే ఆప్షన్స్ విషయానికి వస్తే మీ బడ్జెట్‌ను బట్టి రూ.8 వేల నుంచి రూ.62 వేల వరకు కూడా హోటల్స్ లేదా లాడ్జ్‌లలో రూమ్స్ దొరికే అవకాశం ఉంది.
ఫుడ్ అండ్ లోకల్ సఫారీ విషయానికి వస్తే డైలీ రూ.12 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ట్రిప్ కొనసాగించవచ్చు.
అదే మీరు ఆర్కిటిక్ క్రూజ్‌లో (Arctic Cruise) ప్రయాణించాలి అనుకుంటే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది.
వీసా అవసరమా? | Svalbard Visa For Indians
భారతీయులు స్వాల్బార్డ్ వెళ్లేందుకు సాధారణ నార్వే షెంజెన్ వీసా (Norway Schengen Visa) అవసరం అవుతుంది. నిజానికి స్వాల్బార్డ్ వెళ్లేందుకు ప్రత్యేక వీసా అవసరం లేదు. టెక్నికల్‌గా అది వీసా-ఫ్రీ జోన్.
అయితే అక్కడికి వెళ్లాలంటే నార్వే మెయిన్‌లాండ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే భారతీయులకు మల్టిపుల్ ఎంట్రీ షెంజెన్ వీసా అవసరం అవుతుంది.
అలాగే పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్ బుకింగ్స్, రిటర్న్ టికెట్స్ వంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం అవుతాయి.
ఆసక్తికరమైన విషయాలు | Quick Facts
- స్వాల్బార్డ్లో మనుషుల కన్నా పోలార్ బేర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
- ఇక్కడ మిడ్నైట్ సన్ వల్ల సమ్మర్లో 24 గంటలూ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు.
- స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఇక్కడే ఉంది. దీనిని డూమ్స్‌డే వాల్ట్ అని కూడా అంటారు.
- ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ చాలా తక్కువ. ప్రయాణానికి స్నో మొబైల్స్ ఎక్కువగా వాడతారు.
- స్వాల్బార్డ్లో చనిపోయిన వారిని ఖననం చేయరు. దీనికి కారణం ఇక్కడ నేల మొత్త
- శాశ్వత మంచుతో ఉండటమే. దీనిని పెర్మాఫ్రోస్ట్ (Permafrost) అంటారు. దీని వల్ల మృతదేహాలు పూర్తిగా డీకంపోజ్ కావు.
గమనిక:
ఇక్కడ ఇచ్చిన ట్రావెల్ అండ్ బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు వివరాలు స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
