Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
Street Food : నిత్యం ఉద్యోగం రీత్యానో.. లేక ఆస్పత్రికో.. లేదా ఇంకా వేరే పనుల మీద హైదరాబాదుకు వచ్చే వాళ్లు వేలల్లో ఉంటారు. మరి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి స్ట్రీట్ ఫుడ్ రుచి చూడకపోతే ఎలా.. ఈ నగరంలో ఆహారం కేవలం కడుపు నింపదు, అదొక అనుభూతిని అందిస్తుంది.
వేడి వేడి నూనె సవ్వడులు, ప్లేట్ల కంటి కింద శబ్దాలు, హలీమ్‌లో కరిగే నెయ్యి సువాసన… ఇదంతా హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ గొప్పతనం. కరకరలాడే లుఖ్మీల నుంచి పొగలు కక్కే కబాబ్‌ల వరకు ఇక్కడి ప్రతి వంటకం ఒక చరిత్రను చెబుతుంది.
పానీ పూరి, చాట్ వంటివి హైదరాబాద్‌లో (hyderabadi street food) చాలా చోట్ల దొరుకుతాయి. కానీ అవి నిజమైన హైదరాబాదీ రుచిని కలిగించలేవు. ఈ నగరం అసలు రుచి అనేది దాని సంప్రదాయాలో భాగం అయిన, హలీమ్, పత్తర్ కా ఘోష్, పునుగులు వంటి ప్రత్యేక వంటకాల్లో ఉంది.
ముఖ్యాంశాలు
హైదరాబాద్‌లో తినాల్సిన టాప్ 8 స్ట్రీట్ ఫుడ్స్!
ఉస్మానియా బిస్కెట్స్, ఇరానీ ఛాయ్ | Hyderabad Street Food
ఇది అల్టిమేట్ టీ-టైమ్ కాంబో. కొద్దిగా ఉప్పగా, వెన్నతో కూడిన ఉస్మానియా బిస్కెట్లను (Osmania Biscuits), పాలు, బలమైన ఇరానీ ఛాయ్‌లో (Irani Chai) ముంచి తాగితే ఆ రుచి అద్భుతం.
- నీలోఫర్ కేఫ్
- నిమ్రా కేఫ్
- తైబా కేఫ్
- గ్రాండ్ హోటల్
- ఆదాబ్ హోటల్
- కేఫ్ బహార్లలో రుచికరమైన ఛాయ్ దొరుకుతుంది.
హలీమ్ | Haleem
హైదరాబాద్‌లో కచ్చితంగా తినాల్సిన వంటకాల్లో హలీమ్ మొదటి స్థానంలో ఉంది. ఇది గోధుమలు, పప్పులు, మసాలాలు, నెయ్యితో చాలా సేపు ఉడికించిన చిక్కటి మాంసం వంటకం. రంజాన్ నెలలో చాలా ప్రసిద్ధి, కానీ కొన్ని చోట్ల ఏడాది పొడవునా దొరుకుతుంది.
- పిస్తా హౌస్ (Pista House)
- షా ఘౌస్, సిటీ డైమండ్
- సుభాన్ బేకరీలలో రంజాన్ సమయంలో
- ఆఫ్-సీజన్లో అల్-సబా హోటల్, హైదరాబాద్ హౌస్, అలీ కేఫ్‌లలో ప్రయత్నించవచ్చు.
లుఖ్మీ | Lukmi
ఇదొక హైదరాబాదీ క్లాసిక్. మసాలాలు కలిపిన కీమాతో నింపిన కరకరలాడే పేస్ట్రీ. సమోసా లా ఉంటుంది కానీ మరింత రుచిగా ఉంటుంది.
- షాహ్రాన్ కబాబ్స్
- రియో రెస్టారెంట్
- రూమాన్ రెస్టారెంట్లలో బెస్ట్ లుఖ్మీలు దొరుకుతాయి.
పత్తర్ కా ఘోష్ | Pattar Ka Gosht
వేడిగా ఉన్న గ్రానైట్ రాయిపై నెమ్మదిగా వండిన సన్నటి మాంసం ముక్కలతో దీనిని తయారు చేస్తారు. రాయిపై ఉండటం వల్ల వచ్చే పొగ , సాఫ్ట్ మీట్‌ని కాంబినేషన్ కలిసి రాజరికపు అనుభూతిని ఇస్తుంది. *
- షాహి దస్తర్ఖాన్
- బిర్యానీవాలా కోలలో బెస్ట్ పత్తర్ కా ఘోష్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
పునుగులు | Pungulu
పులియబెట్టిన దోస పిండితో చేసిన డీప్ ఫ్రైడ్, కరకరలాడే బాల్స్ ఇవి. కొబ్బరి, అల్లం చట్నీలతో వడ్డిస్తారు. ప్రతి ప్రాంతంలోనూ ఇది ఒక ప్రసిద్ధ స్నాక్.
- KPHB లోని పూర్ణ టిఫిన్ సెంటర్ (Purna Tiffin Centers)
- హనుమాన్ ముంత మసాలాలో (Hanuman Munta Masala) బెస్ట్ పునుగులు లభిస్తాయి.
చికెన్ 65 | Chicken 65
డీప్ ఫ్రై చేసిన స్పైసీ చికెన్, కరివేపాకు, పచ్చిమిర్చితో కలిపి వేయిస్తారు. హైదరాబాద్‌లో ఇది డ్రైగా, క్రిస్పీగా లేదా కాస్త సాసీగా వివిధ రకాల్లో దొరుకుతుంది.
- కేఫ్ 555
- అక్బర్ ఫాస్ట్ ఫుడ్
- షా ఘౌస్, సర్వీ రెస్టారెంట్
- డైన్ హిల్‌లలో ప్రయత్నించవచ్చు.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
షవర్మా | Shawarma
అరబిక్ వంటకం అయినప్పటికీ, హైదరాబాద్ షవర్మాను తమదైన శైలిలో మార్చుకుంది. రుమాలి రోటీలో స్పైసీ మాయో, ఊరగాయ వెజిటేబుల్స్‌తో చుడతారు. బార్కాస్, టోలిచౌకి ప్రాంతాల్లో ఇది బాగా ప్రసిద్ధి.
హైదరాబాదీ స్టైల్ కోసం..
- ఫీల్ ఇన్ సౌదియా
- మొహమ్మడియా
- స్మోకీ డాకీలను
- అసలైన అరబిక్ రుచి కోసం షావెఫెల్
- అల్ టాజాలను ప్రయత్నించవచ్చు.
ఆప్రికాట్ డిలైట్ | Apricot Delight
చివరిగా, ఆప్రికాట్ డిలైట్ అనేది ఖుబానీ కా మీఠా నుండి ప్రేరణ పొందిన లేటెస్ట్ స్వీట్ డెజర్ట్. క్రీమ్ లేదా కస్టర్డ్‌తో కలిపి వండిన ఆప్రికాట్లు ఇందులో ఉంటాయి. రుచిగా, పుల్లగా ఉండి, మీ స్ట్రీట్ ఫుడ్ ప్రయాణాన్ని ముగించడానికి ఇది సరైన ఎంపిక. జ్యూస్, డెజర్ట్ స్టాల్స్‌లో ఇది దొరుకుతుంది.
- ది స్పైసీ వెన్యూ
- పిస్తా హౌస్
- శ్రీ నర్సింగ్
- నైస్ జ్యూస్ సెంటర్లలో మీకు రుచికంగా అందిస్తారు.
హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ అనేది కేవలం ఆకలిని మాత్రమే తీర్చదు. విభిన్నమైన రుచులను కోరే నాలుకను శాంత పరుస్తుంది. కొత్తదనం కోరే మనసును శాంత పరుస్తుంది. హైదరాబాద్ వంటకాలు అనేవి ఇక్కడ ఘనమైన వారసత్వానికి ప్రతీరూపం.
ఒక ముక్కలో చెప్పాలంటే అది అదిరిపోయే రుచుల వారసత్వం. ప్రతి వంటకం నగరం చరిత్రలో భాగం. ప్రేమగా వండి, గర్వంగా వడ్డిస్తే అదే హైదరాబాదీ ఆతిథ్యం.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.